Kareena Kapoor: ‘కేజీఎఫ్’ గర్ల్ అని పిలిపించుకోవాలని ఉంది - మనసులో మాట బయటపెట్టిన బాలీవుడ్ బ్యూటీ
Kareena Kapoor: బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కరీన్ కపూర్ కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అతడితో కలిసి నటించాలని ఉందంటూ మనసులో మాటను బయటపెట్టింది.
Koffee With Karan Show: బాలీవుడ్ సీనియర్ నటి కరీనా కపూర్ రెండు దశాబ్దాలకు పైగా సినిమా పరిశ్రమలో సక్సెస్ ఫుల్ గా రాణిస్తోంది. దాదాపు బాలీవుడ్ లోని అందరు స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. దేశ వ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ షోలో పాల్గొన్నది. బాలీవుడ్ క్యూట్ బ్యూటీ ఆలియా భట్ తో కలిసి ఈ షోలో సందడి చేసింది. ఈ సందర్భంగా తన కెరీర్ కు సంబంధించిన పలు కీలక విషయాలు వెల్లడించింది.
యశ్ యాక్టింగ్ అంటే ఇష్టం- కరీనా
ఈ సందర్భంగా కరణ్ జోహార్ కరీనాను కొన్ని ఫన్నీ క్వశ్చన్ అడగడంతో పాటు, మరికొన్ని కోపం తెప్పించే ప్రశ్నలు కూడా వేశారు. ఆమె కొన్నింటికి సమాధానం చెప్పగా, మరికొన్నింటిని స్కిప్ చేసింది. సౌత్ ఇండస్ట్రీకి చెందిన ఏ హీరోతో నటించాలని అనుకుంటున్నావు? అని కరణ్ అడిగిన ప్రశ్నకు యశ్ అంటూ సమాధానం చెప్పింది. ఆయన నటన తనకు ఎంతో బాగా నచ్చుతుందని వెల్లడించింది. తను నటించిన ‘కేజీఎఫ్’ సినిమా ఎంతో బాగా నచ్చిందని చెప్పింది. అవకాశం వస్తే ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలనుందని వివరించింది. అంతేకాదు, తనను ‘కేజీఎఫ్ గర్ల్’ అని పిలిపించుకోవాలని ఉందని చెప్పింది.
అవకాశం వస్తే సారాకు తల్లి నటిస్తా- కరీనా
అటు సారా అలీఖాన్ (కరీనా భర్త సైఫ్ అలీఖాన్ ఫస్ట్ భార్య కూతురు)కు తల్లిగా నటించే ఛాన్స్ వస్తే చేస్తావా? అని మరో ప్రశ్న అడిగారు కరణ్. తప్పకుండా చేస్తానని కరీనా వెల్లడించింది. తానుకొక నటినని, ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయడానికి రెడీగా ఉంటానని చెప్పింది. నిజంగానే సారాకు తల్లిగా నటించే ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తానని చెప్పింది. అందులో ఎవరికి ఎలాంటి సందేహం అవసరం లేదని వెల్లడించింది.
కరీనాకు కోపం తెప్పించిన కరణ్
ఇక కరీనాకు బాగా కోపం తెప్పించే ప్రశ్న అడిగారు కరణ్. రీసెంట్ గా ‘గదర్ 2’ పార్టీకి ఎందుకు రాలేదు? అమీషాకు, నీకు మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా? అని అడిగారు. వెంటనే కరీనాకు బాగా కోపం వచ్చింది. ఆ విషయం గురించి తాను మాట్లాడాలి అనుకోవడం లేదని చెప్పింది. అక్కడితో ఆపకుండా ‘కహోనా ప్యార్ హై’లో మీరే తొలి హీరోయిన్ కదా? అని మరో ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్నకు కరీనా ఆన్సర్ చెప్పకుండా సైలెంట్ అయ్యింది.
అమీషా, కరీనాకు మధ్య గొడవేంటి?
వాస్తవానికి 2000లో విడుదలైన ‘కహోనా ప్యార్‌హై’ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాకు మొదట్లో హీరోయిన్ గా కరీనాను ఎంపిక చేశారు దర్శకుడు రాకేష్ రోషన్. ఆ తర్వాత అనుకోని గొడవల కారణంగా ఆమె స్థానంలో అమీషా పటేల్ ను తీసుకున్నారు. అప్పటి నుంచి కరీనా, అమీషా మధ్య మాటలు లేవు. ఈ విషయాన్ని గతంలో అమీషా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అదే అంశాన్ని కరణ్ మళ్లీ గుర్తు చేయడంతో కరీనాకు ఎక్కడలేని కోపం వచ్చింది. కానీ, తను మౌనంగా ఉండిపోయింది. ఇక పనిలో పనిగా నువ్వు దీపికా పదుకొణెకు పోటీ అనుకుంటున్నావా? అని మరో ప్రశ్న వేశారు. ఆ ప్రశ్న అడగాల్సింది నన్ను కాదు, ఆలియాను అని చెప్పడంతో కరణ్ షాక్ అయ్యారు.
Read Also: 'అన్ స్టాపబుల్‘ షోలో ‘యానిమల్’ టీమ్ సందడి, ఎపిసోడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?