Kareena Kapoor: కరీనాకు చేదు అనుభవం, ముంబై ఎయిర్ పోర్టులో ఫ్యాన్స్ ఆమెను చుట్టుముట్టి ఏం చేశారంటే?
బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ కు చేదు అనుభవం ఎదురయ్యింది. ముంబై ఎయిర్ పోర్టులో అభిమానులు ఆమెను చుట్టుముట్టి కాసేపు ఇబ్బంది పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ గతంలో ఎప్పుడూ లేని విధంగా వింత అనుభవాన్ని చవిచూడాల్సి వచ్చింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన కొడుకు జహంగీర్ అలీ ఖాన్‌తో కలిసి ముంబై విమానాశ్రయంలో కనిపించింది. ఈ సందర్భంగా ఆమెతో ఫోటోలు తీసుకునేందుకు అభిమానులు చుట్టుముట్టారు. కొంత మంది ఆమెను ఈ సందర్భంగా ఇబ్బంది పెట్టారు. ఎయిర్ పోర్టు ఎంట్రెన్స్ దగ్గర ఆమె కనిపించడంతో అభిమానులు చుట్టూ గుమిగూడారు. కొంత మంది తనతో సెల్పీలు తీసుకున్నారు. కొద్ది సేపు అభిమానులతో గడిపిన, తర్వాత వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ, కొందరు ఇంకా సెల్పీలు తీసుకునే ప్రయత్నం చేశారు. తన చేతిని పట్టుకుని అక్కడే ఉండాలని కోరే ప్రయత్నం చేశారు. వెంటనే భద్రతా సిబ్బంది కలుగజేసుకుని కరీనాను ఎయిర్ పోర్టు లోపలికి తీసుకెళ్లారు.
కరీనా తెల్లటి షర్ట్, ట్రాక్ ప్యాంట్ తో అల్లిన స్లీవ్‌లెస్ స్వెటర్, నల్లటి కళ్లజోడుతో తన కారులో నుంచి దిగి గేటు వైపు నడుస్తుండగా అభిమానులు గమనించారు. వెంటనే ఆమె చుట్టూ గుమిగూడారు. ఒక అభిమాని సెల్ఫీ కోసం ఆమె భుజానికి అడ్డంగా చేయి వేయబోయాడు. వెంటనే ఆమె వ్యక్తిగత సిబ్బంది వారించాడు. ఈ ఘటనతో కరీనా భయపడింది.
View this post on Instagram
దీనిపై సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతుంది. "ఇది సరైన పద్దతికి కాదు, అభిమానులు ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవాలి" అంటూ పలువురు నెటిజన్లు వ్యాఖ్యానించారు. " అభిమానులు సెలబ్రిటీల దగ్గర తమ పరిమితులను మరచిపోకూడదు" అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. “ప్రజలు పిచ్చిగా ఉండకూడదు. కొంచెం మర్యాద కలిగి ఉండాలి” అని వేరొకరు కామెంట్ చేశారు. "ఆమె నిజంగా భయపడింది. ప్లీజ్.. సెన్సిటివ్ గా ఉండాలి. వారు కూడా మనుషులే అని గమనించాలి" అంటూ కామెంట్స్ వెల్లువెత్తాయి.
హన్సల్ మెహతా దర్శకత్వంలో కరీనా కపూర్ ఓ సినిమా చేస్తున్నది. ఈ సినిమా షూటింగ్ కోసం లండన్ వెళ్లే సందర్భంలో ఈ ఘటన జరిగింది. ఈ చిత్రాన్ని ఏక్తా కపూర్ తన సొంత బ్యానర్ బాలాజీ మోషన్ పిక్చర్స్‌పై సహ నిర్మాతగా నిర్మిస్తున్నారు. గత ఏడాది ఆగస్టులో కరీనా ఈ చిత్రాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా ఇన్ స్టా గ్రామ్ లో హన్సల్ మెహతా, ఏక్తా కపూర్ తో ఉన్న ఫోటోను షేర్ చేసింది. దానికి ‘న్యూ బిగినింగ్స్’ అని క్యాప్షన్ పెట్టింది. ఈ ఫోటోలకు హన్సల్ స్పందించారు. ‘’వారు చాలా అద్భుతమైన మహిళలు. వారితో కలిసి పని చేయడం చాలా సంతోషకరం. వారితో ఈ ప్రయాణం కొనసాగించేందుకు ఎదురు చూస్తున్నాను” అని కామెంట్ చేశారు. ఇటీవల కరీనా కపూర్ అమీర్ ఖాన్ తో కలిసి ‘లాల్ సింగ్ చద్దా’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దేశ వ్యాప్తంగా కేవలం రూ. 58 కోట్లు సాధించింది.
Also Read : ఎన్టీఆర్ సినిమాలు చూసి నేర్చుకోండి - ‘ఆదిపురుష్’ దర్శకుడిపై ‘కేజీఎఫ్’ నటి ఆగ్రహం