News
News
X

Rashmika: 'లైగర్' ఎఫెక్ట్ - రష్మిక సినిమా ఆపేసిన కరణ్ జోహార్!

'గుడ్ బై' సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుంది. ఇందులో అమితాబ్ కూడా నటించారు. ఈ సినిమా రిలీజ్ కాకుండానే హిందీలో మరో రెండు ఛాన్స్ లను కొట్టేసింది.

FOLLOW US: 
కన్నడ ఇండస్ట్రీకి చెందిన రష్మిక.. 'ఛలో' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే హిట్ అందుకుంది. దీంతో ఆమెకి పలు సినీ అవకాశాలు వచ్చాయి. వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటూ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. టాలీవుడ్ లో అగ్ర హీరోల సరసన నటిస్తూ బిజీగా మారింది. 'పుష్ప' సినిమాతో నేషనల్ వైడ్ గా ఆమె పాపులర్ అయింది. ఇప్పుడు ఆమెకి బాలీవుడ్ లో కూడా అవకాశాలు వస్తున్నాయి. 
 
'గుడ్ బై' సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుంది. ఇందులో అమితాబ్ కూడా నటించారు. ఈ సినిమా రిలీజ్ కాకుండానే హిందీలో మరో రెండు ఛాన్స్ లను కొట్టేసింది. అందులో సందీప్ రెడ్డి వంగ 'యానిమల్' సినిమా ఒకటి. రణబీర్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటినుంచే మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమాతో పాటు 'స్క్రూడీలా' అనే మరో సినిమా ఓకే చేసింది రష్మిక. 
 
టైగర్ ష్రాఫ్ హీరోగా దర్శకుడు శశాంక్ ఖైతాన్ ఈ సినిమాను తెరకెక్కించాలనుకున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రకటన కూడా వచ్చింది. అయితే నిర్మాత కరణ్ జోహార్ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. సినిమా బడ్జెట్ అంతా చూసుకున్న ఆయన వర్కవుట్ కాదని భావిస్తున్నారు. ఈ సినిమాను రూ.140 కోట్ల రెమ్యునరేషన్ తో చిత్రీకరించాలనుకున్నారు. 
 
ఈ సినిమాకి రెమ్యునరేషన్ గా టైగర్ ష్రాఫ్ రూ.35 కోట్లు అడిగారు. రష్మికకు రూ.4 కోట్లు ఇవ్వాలి. రెమ్యునరేషన్స్ తో కలిసి రూ.140 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఈ బడ్జెట్ దాటే అవకాశాలు కూడా ఉన్నాయి. రీసెంట్ గానే 'లైగర్' సినిమాతో నిర్మాత కరణ్ జోహార్ కి భారీ నష్టాలొచ్చాయి. అందుకే ఇకపై బడ్జెట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు. ఒకవేళ ప్లాప్ అయినా.. తక్కువ నష్టంతో బయటపడే సినిమాలు మాత్రమే చేయాలనుకుంటున్నారు. టైగర్ ష్రాఫ్ సినిమా అతడికి రిస్క్ అనిపించడంతో ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టారు. ఆ విధంగా రష్మిక లిస్ట్ లో నుంచి ఒక బాలీవుడ్ సినిమా ఎగిరిపోయిందనే చెప్పాలి. 
 
ఇక రష్మిక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె 'పుష్ప2'లో నటించడానికి రెడీ అవుతుంది. ఫస్ట్ పార్ట్ లో హీరోతో ప్రేమాయణం, పెళ్లి వరకు వెళ్తుంది రష్మిక. మరిప్పుడు సెకండ్ పార్ట్ లో ఆమె క్యారెక్టర్ ను ఎలా చూపిస్తారో చూడాలి. ఇటీవలే   'పుష్ప2'  సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కొద్దిరోజుల్లో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఇప్పటికే 'పుష్ప' సినిమాలో చాలా మంది విలన్స్ ఉన్నారు. 
 
ఇప్పుడు మరో కొత్త విలన్ వచ్చి చేరబోతున్నారు. మొదటి పార్ట్ లో బన్నీకి సపోర్ట్ గా ఉండే ఎంపీ రోల్ లో రావు రమేష్ కనిపించారు. ఎర్ర‌చంద‌నం సిండికేట్ మొత్తాన్ని పుష్ప చేతిలో పెట్టి వెనుక ఉంటూ కథ నడిపిస్తారు. ఇప్పుడు పార్ట్ 2లో పుష్పను ఇబ్బంది పెట్టే ఓ పొలిటీషియన్ రోల్ ఉంటుందట. ఫహద్ ఫాజిల్ తో కలిసి సదరు పొలిటీషియన్ బన్నీతో ఫైట్ కి దిగుతాడట. ఆ పాత్రలో పేరున్న నటుడిని తీసుకోవాలనుకుంటున్నారు. దీనికోసం ఆదిపినిశెట్టి లాంటి స్టార్స్ ను పరిశీలిస్తున్నారు. గతంలో బన్నీ నటించిన 'సరైనోడు' సినిమాలో ఆది పినిశెట్టి విలన్ గా కనిపించారు. ఇప్పుడు మరోసారి ఆయనకు ఛాన్స్ వస్తుందేమో చూడాలి. త్వరలోనే విలన్ గా ఎవరిని తీసుకున్నారో అనౌన్స్ చేయనున్నారు.
 
Published at : 30 Aug 2022 03:26 PM (IST) Tags: Rashmika Mandanna Rashmika Liger Movie karan johar

సంబంధిత కథనాలు

DJ Tillu 2: 'డీజే టిల్లు' సీక్వెల్ డైరెక్టర్ ఎవరో క్లారిటీ వచ్చేసింది!

DJ Tillu 2: 'డీజే టిల్లు' సీక్వెల్ డైరెక్టర్ ఎవరో క్లారిటీ వచ్చేసింది!

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్' సినిమాకి పూర్ బుకింగ్స్ - పాజిటివ్ టాక్ వస్తుందా?

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్' సినిమాకి పూర్ బుకింగ్స్ - పాజిటివ్ టాక్ వస్తుందా?

Satyadev Interview : చిరంజీవి స్థాయిని తగ్గించేలా నటించలేదు... వాళ్ళ డౌట్స్ వాళ్ళవి, నా కాన్ఫిడెన్స్ నాది - సత్యదేవ్ ఇంటర్వ్యూ

Satyadev Interview : చిరంజీవి స్థాయిని తగ్గించేలా నటించలేదు... వాళ్ళ డౌట్స్ వాళ్ళవి, నా కాన్ఫిడెన్స్ నాది - సత్యదేవ్ ఇంటర్వ్యూ

Bigg Boss 6 Telugu: నేహా ఎలిమినేట్ అయ్యాక ఆదిరెడ్డి - రాజశేఖర్ ఏమన్నారంటే, నాగార్జున చెప్పినా రివ్యూలు మానని ఆదిరెడ్డి

Bigg Boss 6 Telugu: నేహా ఎలిమినేట్ అయ్యాక ఆదిరెడ్డి - రాజశేఖర్ ఏమన్నారంటే, నాగార్జున చెప్పినా రివ్యూలు మానని ఆదిరెడ్డి

God Father: 'గాడ్ ఫాదర్'లో 'బింబిసార' బ్యూటీ - ఒక్క సాంగ్ కోసం ఎంత ఖర్చు పెట్టారంటే?

God Father: 'గాడ్ ఫాదర్'లో 'బింబిసార' బ్యూటీ - ఒక్క సాంగ్ కోసం ఎంత ఖర్చు పెట్టారంటే?

టాప్ స్టోరీస్

Vijayashanti: పండక్కి పైసలెట్ల? సర్కార్ ఉద్యోగులే కేసీఆర్‌ను పడగొడతరు - విజయశాంతి

Vijayashanti: పండక్కి పైసలెట్ల? సర్కార్ ఉద్యోగులే కేసీఆర్‌ను పడగొడతరు - విజయశాంతి

Supreme Court Live Streams: సుప్రీం కోర్టు విచారణలు లైవ్‌లో ఇలా చూడొచ్చు!

Supreme Court Live Streams: సుప్రీం కోర్టు విచారణలు లైవ్‌లో ఇలా చూడొచ్చు!

ఏవండీ ఆవిడ వద్దు! నెల్లూరు టిక్‌టాక్‌ మ్యారేజ్‌లో అదిరిపోయే ట్విస్ట్‌

ఏవండీ ఆవిడ వద్దు! నెల్లూరు టిక్‌టాక్‌ మ్యారేజ్‌లో అదిరిపోయే ట్విస్ట్‌

పద్దతి దాటితే కుల్లం కల్లం మాట్లాడతా, షర్మిల గురించి డెప్త్‌ విషయాలు చెప్తా: జగ్గారెడ్డి

పద్దతి దాటితే కుల్లం కల్లం మాట్లాడతా, షర్మిల గురించి డెప్త్‌ విషయాలు చెప్తా: జగ్గారెడ్డి