By: ABP Desam | Updated at : 21 Jun 2022 04:18 PM (IST)
కాపీ కొట్టి సినిమా తీశారు - స్టార్ డైరెక్టర్ పై ఆరోపణలు
బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఓ పక్క దర్శకుడిగా పని చేస్తూనే మరోపక్క తన బ్యానర్ లో వరుస సినిమాలను నిర్మిస్తున్నారు. తాజాగా ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై 'జగ్ జగ్ జీయో' అనే సినిమానుతెరకెక్కించారు . రాజ్ మెహతా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అనిల్ కపూర్, నీతూ కపూర్, వరుణ్ ధావన్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించారు.
జూన్ 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా విషయంలో కరణ్ జోహార్ కాపీ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ సినిమా విడుదలకు ముందే తమకు చూపించాలని రాంచీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అసలు విషయంలోకి వస్తే.. రాంచీకి చెందిన రచయిత విశాల్ సింగ్ తను పంపించిన పాయింట్స్ ను కాపీ కొట్టి 'జగ్ జగ్ జీయో' సినిమాను తెరకెక్కించారని.. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా తన దగ్గర ఉన్నాయని చెబుతున్నారు.
'బన్నీ రాణి' అనే టైటిల్ తో కొన్ని పాయింట్స్ ను ధర్మ ప్రొడక్షన్స్ కు పంపించినట్లు ఆయన తెలిపారు. ఆ తరువాత ప్రొడక్షన్ హౌస్ నుంచి రిప్లై కూడా వచ్చిందని.. అయితే ఆ పాయింట్స్ ను సినిమాగా రూపొందిస్తున్నట్లు ధర్మ ప్రొడక్షన్స్ తనతో చెప్పలేదని.. తీరా చూస్తే ఆయన పాయింట్స్ తోనే సినిమా వచ్చినట్లుగా పేర్కొన్నారు. ఈ విషయంపై రాంచీ కోర్టులో దావా వేశారు విశాల్. పిటిషన్ ను స్వీకరించిన రాంచీ కమర్షియల్ కోర్టు స్క్రీనింగ్ తరువాత ఇరువైపు వాదనలు విని.. కాపీ రైట్ ఉల్లంఘన జరిగిందో.. లేదో చెబుతామని వెల్లడించింది . అయితే ఈ విషయంపై కరణ్ జోహార్ ఇంకా స్పందించలేదు.
Also Read : శోభితతో నాగచైతన్య డేటింగ్ - సమంత పుట్టించిన పుకారేనా?
Also Read : తక్కువ అంచనా వేయకండి - బాలకృష్ణ హీరోయిన్‌కు కరోనా
#TruthShallPrevail #सत्यमेव_जयतेhttps://t.co/NJDdci6C0E
— Vishal A. Singh (@Vishal_FilmBuff) June 19, 2022
Coz all major newspapers of #Mumbai and #Delhi has blacked out this important Court development of yesterday.. have no choice but to share it on my timeline.
— Vishal A. Singh (@Vishal_FilmBuff) June 19, 2022
Will fight for truth, even if I stand alone.#JugJuggJeeyo #TruthShallPrevail #सत्यमेव_जयते pic.twitter.com/4rfnrTwSG3
Am an ordinary Indian citizen.. and am being shown my औक़ात? Hope @MIB_India @MIB_Hindi @Anurag_Office will take note of this.@PMOIndia @narendramodi https://t.co/W3KYjQSQyU
— Vishal A. Singh (@Vishal_FilmBuff) June 19, 2022
Bigg Boss Season 7 Telugu: శివాజీ పిట్టకథ - నామినేషన్స్‌లో జనాల జపం, గ్రూపిజానికి కొత్త అర్థం చెప్పిన తేజ
Boney Kapoor: శ్రీదేవిది సహజ మరణం కాదు, అప్పట్లో పన్ను విరిగిందని నాగార్జున చెప్పారు: బోనీ కపూర్
వాళ్లకు టాలెంట్‌తో పనిలేదు, బట్టలు విప్పితే చాలు - ‘ఊసరవెల్లి’ నటి కామెంట్స్
Bigg Boss Season 7 Latest Promo: రాజుగారి చిన్నపెళ్లాం మంచిది కాదు అని కాదు - అమర్‌కు శివాజీ పంచ్
Leo Trailer: విజయ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ‘లియో’ ట్రైలర్ వచ్చేది అప్పుడే!
Bandaru Satyanarayana: బండారు సత్యనారాయణ అరెస్టు, విశాఖ నుంచి గుంటూరుకు తరలింపు!
Car At YSRCP Office: వైసీపీ వాళ్లు రూ.16 కోట్లు మోసం! జగనన్న న్యాయం చేయకపోతే ఆత్మహత్యే గతి- కారుకు స్టిక్కర్లు
Supreme Court: రేపే సుప్రీంలో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ - ఈ ధర్మాసనం వద్ద లిస్టింగ్
సల్మాన్ ఖాన్ సినిమాలో ఎన్టీఆర్ గెస్ట్ రోల్ - 'వార్ 2' కన్నా ముందే తారక్ బాలీవుడ్ ఎంట్రీ?
/body>