Director Krish: వెబ్ సిరీస్‌గా ‘కన్యాశుల్కం’... డైరెక్టర్ క్రిష్ ప్రయత్నం? ఆ ఓటీటీలో విడుదల?
డైరెక్టర్ క్రిష్ మరో అద్భుత ప్రయత్నం చేయబోతున్నట్టు సమాచారం. కన్యాశుల్కానికి ఆయన ఆధునిక రూపాన్ని ఇవ్వబోతున్నారట.
కన్యాశుల్కం... తెలుగులో తొలి ఆధునిక రచనల్లో ఒకటి. 1897లో తొలిసారి ఈ నవలను ప్రచురించారు. ప్రముఖ తెలుగు రచయిత గురజాడ అప్పారావు అద్భుత సృష్టి ఇది. ఇప్పటికీ ఎంతో మంది హాట్ ఫేవరేట్ రచన అది. డబ్బాశతో చిన్న పిల్లని ఒక ముసలివాడికిచ్చి పెళ్లిచేసేందుకు ప్రయత్నించడం, అందుకు ప్రతిఫలంగా కన్యాశుల్కాన్ని తీసుకోవడం అనే పాయింట్ చుట్టూ కథ తిరుగుతుంది. అగ్నిహోత్రావధాన్లు, మధురవాణి, గిరీశం, కరటక శాస్త్రి... ఈ పేర్లన్నీ చాలా పాపులర్ అయింది ఈ రచన వల్లే. నేటి కాలం పిల్లలకి, యువతరానికి కన్యాశుల్కం గురించి ఏం తెలియదు. అందుకే దీన్ని వెబ్ సిరీస్ తెరకెక్కించాలనుకుంటున్నారట డైరెక్టర్ క్రిష్.
కొండపొలంతో ఆగట్లేదు...
క్రిష్ తాజా సినిమా కొండపొలం. ఒక నవల ఆధారంగా దాన్ని తెరకెక్కించారు. కొండలచుట్టూ ఉండే గొర్రెల కాపరుల కష్టాలు, జీవన శైలిని చూపించారు. సినిమా హిట్ టాక్ రాలేదు కానీ, మంచి పేరు తెచ్చుకుంది. ఓటీటీలో కూడా బాగానే చూశారు ఈ సినిమాని. ఇప్పుడు క్రిష్ పూర్తిగా దృష్టి ఓటీటీ మీద పడింది. కన్యాశుల్కాన్ని వెబ్ సిరీస్ గా మార్చి ఓటీటీలో విడుదల చేయాలని కోరుకుంటున్నారట. తెలుగు వారి ముందుకు ఈ అద్భుత నవలకు ఆధునిక రూపాన్నిచ్చి తేవాలన్న ఆలోచనలో ఉన్నారట. నేటి తరానికి నవల తెలియజేయాలని అనుకుంటున్నారట. ఈ వెబ్ సిరీస్ సోనీ లివ్ ఓటీటీ కోసం నిర్మించబోతున్నట్టు సమాచారం. స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్టు సమాచారం. నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నారట క్రిష్. తానే దర్శకత్వం వహించబోతున్నారు. ఎవరికి మెయిన్ లీడ్ పాత్రలు దక్కనున్నాయో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాలి.
ఇదే కొత్త రచన
గురజాడ కన్యాశుల్కాన్ని మొదట 1892లో రాసినట్టు చెబుతారు. తొలిప్రతిని 1897 ప్రచురించారని అంటారు. అది చదివిన కొంతమంది శ్రేయోభిలాషులు ఇచ్చిన సలహా మేరకు మార్పులు, చేర్పులు చేసి తుది నవలను 1909లో ముద్రించారని అంటారు.
Also Read:యూవీ క్రియేషన్స్ లో నవీన్ పోలిశెట్టి.. అనుష్కకు జంటగా..
Also Read: 'మా రెండు కుటుంబాల మధ్య 35 ఏళ్ల పోరు..' మెగా,నందమూరి ఫ్యామిలీలపై ఎన్టీఆర్ కామెంట్స్..
Also Read:సల్మాన్ కి 'నాటు' స్టెప్స్ నేర్పించిన ఎన్టీఆర్, చరణ్..
Also Read: సన్నీకి మాధవీలత వార్నింగ్.. అతడు కనిపిస్తే చెంప పగలగొడతా అంటూ ఫైర్..
Also Read:అవమానకర రీతిలో డాన్స్.. సన్నీలియోన్ ను ఇండియా నుంచి తరిమేయమంటూ ఫైర్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి