అన్వేషించండి

Kantara Chapter 1 First Look: 'కాంతార' కొత్త చాప్టర్ ఫస్ట్ లుక్ - ఈసారి కాంతి కాదు, దర్శనమే! అంచనాలు పెంచిన రిషబ్

సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్ 'కాంతార'కు ప్రీక్వెల్ 'కాంతార : ఏ లెజెండ్' చాప్టర్ ఫస్ట్ లుక్ విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు.

Rishab Shetty's Kantara Chapter 1 first look release date: కన్నడ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించడంతో పాటు దర్శకత్వం వహించిన సినిమా 'కాంతార'. కర్ణాకట వ్యాప్తంగా, దేశంలోని ఇతర నగరాల్లో కన్నడ వెర్షన్ థియేటర్లలో విడుదలైన సమయంలో ఆ సినిమా భారీ విజయం సాధిస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. కన్నడలో తీసిన ఆ సినిమా ఇతర భాషలో అనువాదమై... ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకుంది. 'కాంతార' భారీ విజయం సాధించడంతో దానిని ఓ ఫ్రాంచైజీ తరహాలో ముందుకు తీసుకు వెళ్లాలని రిషబ్ శెట్టి డిసైడ్ అయ్యారు.

'కాంతార' చాప్టర్ 1 ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?
'కాంతార'కు ప్రీక్వెల్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకు 'కాంతార : ఏ లెజెండ్' చాప్టర్ 1 అని టైటిల్ ఖరారు చేశారు. ఆ సినిమా ఫస్ట్ లుక్ విడుదలకు ముహూర్తం కూడా ఖరారు చేశారు. ఈ నెల 27న... అంటే సోమవారం నాడు 'కాంతార 2' (Kantara 2 First Look) విడుదల చేయనున్నారు. 

'కాంతార' సినిమా గుర్తు ఉందా? సినిమా ప్రారంభంలో హీరో తండ్రి, చివరలో హీరో దట్టమైన చెట్ల మధ్యలోకి వెళతారు. అక్కడ ఒక్కసారిగా మాయం అవుతారు. ఆ సమయంలో ఓ కాంతి కింద వస్తుంది. దాన్ని గుర్తు చేసేలా కొత్త 'కాంతార' సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు. 

'అది కాంతి మాత్రమే కాదు... దర్శనం' అంటూ ఈ నెల 27న మధ్యాహ్నం 12.55 గంటలకు ఫస్ట్ లుక్ విడుదల చేస్తామని రిషబ్ శెట్టి ట్వీట్ చేశారు. అదీ సంగతి!

Also Readకోట బొమ్మాళి పీఎస్ రివ్యూ: రాజకీయ చదరంగంలో పోలీసుల మధ్య యుద్ధం - థ్రిల్ ఇస్తుందా? లేదా?  

'కాంతార'ను 'కెజియఫ్ 1', 'కెజియఫ్ 2' సినిమాలు ప్రొడ్యూస్ చేసిన కన్నడ టాప్ ప్రొడక్షన్ హౌస్ హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మించింది. విజయ్ కిరగందూర్ నిర్మాత. ఇప్పుడీ 'కాంతార : ఏ లెజెండ్' చాప్టర్ 1ను కూడా ఆయనే నిర్మిస్తున్నారు. 'కాంతార' విజయంలో సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ స్వరాలు, నేపథ్య సంగీతం కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు ఈ ప్రీక్వెల్ సినిమాకు కూడా ఆయనే సంగీతం అందిస్తున్నారు. 'కాంతార' తర్వాత తెలుగులో సాయి ధరమ్ తేజ్ 'విరూపాక్ష', అజయ్ భూపతి 'మంగళవారం' సినిమాలకు అజనీష్ సంగీతం అందించారు. 

Also Readఆదికేశవ రివ్యూ: మెగా మేనల్లుడి ఊర మాస్ యాక్షన్ - వైష్ణవ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?

రిషబ్ శెట్టి దక్షిణ కర్ణాటకలో తీర ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఆయన బాల్యానికి, 'కాంతార' కథకు ఓ సంబంధం ఉంది. దక్షిణ కర్ణాటకలో దైవారాధన ఎక్కువ. మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్లు కుల దైవం వంటి ఆచారాలు ఉన్నాయి. బాల్యంలో ఆ ఆచారాలను గమనించిన రిషబ్ శెట్టి, ఈ సినిమాలో చూపించారు. ఇప్పుడీ 'కాంతార 2' వాటి గురించి మరింత ఎక్కువ చూపించే అవకాశాలు ఉన్నాయి.

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram: పిఠాపురం మల్లంలో దళితుల సాంఘిక బహిష్కరణ దేని కోసం? ఇప్పుడు గ్రామంలో ఏం జరుగుతోంది?
పిఠాపురం మల్లంలో దళితుల సాంఘిక బహిష్కరణ దేని కోసం? ఇప్పుడు గ్రామంలో ఏం జరుగుతోంది?
AP SSC Results 2025: జిల్లాలవారీగా ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్, అమ్మాయిలే టాప్.. 1680 స్కూళ్లలో వంద శాతం పాస్.. పూర్తి వివరాలు
జిల్లాలవారీగా ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్, అమ్మాయిలే టాప్.. 1680 స్కూళ్లలో వంద శాతం పాస్.. పూర్తి వివరాలు
SRH vs MI: నేడు సన్‌రైజర్స్ వర్సెస్ ముంబై మ్యాచ్.. ఉగ్రదాడితో బీసీసీఐ కీలక నిర్ణయం
నేడు సన్‌రైజర్స్ వర్సెస్ ముంబై మ్యాచ్.. ఉగ్రదాడితో బీసీసీఐ కీలక నిర్ణయం
Pahalgam Attack Terrorists Sketch: పహల్గాంలో కాల్పులు జరిపిన ముగ్గురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలు విడుదల
పహల్గాంలో కాల్పులు జరిపిన ముగ్గురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలు విడుదల
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SRH vs MI Match Preview IPL 2025 | సన్ రైజర్స్  హైదరాబాద్ కోమాలో నుంచి మేల్కొంటుందా.?Axar Patel Batting IPL 2025 | కీలక సమయాల్లో ఆదుకుంటున్న కెప్టెన్ ఆల్ రౌండర్KL Rahul vs Rishabh Pant | సంజీవ్ Goenka అనుకున్నది ఒకటి..అయినది ఒకటిKL Rahul Ignored LSG Owner Goenka | రాహుల్ కి ఇంకా కోపం లేదు..తిట్టారనే కసి మీదే ఉన్నట్లున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram: పిఠాపురం మల్లంలో దళితుల సాంఘిక బహిష్కరణ దేని కోసం? ఇప్పుడు గ్రామంలో ఏం జరుగుతోంది?
పిఠాపురం మల్లంలో దళితుల సాంఘిక బహిష్కరణ దేని కోసం? ఇప్పుడు గ్రామంలో ఏం జరుగుతోంది?
AP SSC Results 2025: జిల్లాలవారీగా ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్, అమ్మాయిలే టాప్.. 1680 స్కూళ్లలో వంద శాతం పాస్.. పూర్తి వివరాలు
జిల్లాలవారీగా ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్, అమ్మాయిలే టాప్.. 1680 స్కూళ్లలో వంద శాతం పాస్.. పూర్తి వివరాలు
SRH vs MI: నేడు సన్‌రైజర్స్ వర్సెస్ ముంబై మ్యాచ్.. ఉగ్రదాడితో బీసీసీఐ కీలక నిర్ణయం
నేడు సన్‌రైజర్స్ వర్సెస్ ముంబై మ్యాచ్.. ఉగ్రదాడితో బీసీసీఐ కీలక నిర్ణయం
Pahalgam Attack Terrorists Sketch: పహల్గాంలో కాల్పులు జరిపిన ముగ్గురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలు విడుదల
పహల్గాంలో కాల్పులు జరిపిన ముగ్గురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలు విడుదల
Pahalgam Baisaran Valley: బైసరన్ లోయ మినీ స్విట్జర్లాండ్ -  వాహనాలు కూడా వెళ్లవు - అందుకే టెర్రరిస్టుల ప్లాన్ ?
బైసరన్ లోయ మినీ స్విట్జర్లాండ్ - వాహనాలు కూడా వెళ్లవు - అందుకే టెర్రరిస్టుల ప్లాన్ ?
Saeed Hussain Shah killed: హిందువుల కోసం ప్రాణం ఇచ్చిన ముస్లిం -  పెహల్గాం దాడి ఘటనలో మరో కోణం
హిందువుల కోసం ప్రాణం ఇచ్చిన ముస్లిం - పెహల్గాం దాడి ఘటనలో మరో కోణం
Karshmir Terror Attack: ఉగ్రవాదుల దాడిలో పెద్దల్ని కోల్పోయిన రెండు తెలుగు కుటుంబాలు - వీరి కన్నీళ్లకు సమాధానం ఎలా?
ఉగ్రవాదుల దాడిలో పెద్దల్ని కోల్పోయిన రెండు తెలుగు కుటుంబాలు - వీరి కన్నీళ్లకు సమాధానం ఎలా?
Pahalgam Terror Attack Viral Photo: ఆ ఫోటో మనల్ని ఎప్పటికీ వెన్నాడుతూనే ఉంటుంది… పహల్‌గామ్ దాడిలో చనిపోయిన  వ్యక్తి ఫోటో వైరల్
ఆ ఫోటో మనల్ని ఎప్పటికీ వెన్నాడుతూనే ఉంటుంది… పహల్‌గామ్ దాడిలో చనిపోయిన  వ్యక్తి ఫోటో వైరల్
Embed widget