News
News
X

Kangana Ranaut: మహేష్ భట్‌పై కంగనా ఫైర్, ఆ పేరు ఎందుకు మార్చుకున్నాడంటూ కామెంట్స్!

సందు దొరికినప్పుడల్లా మహేష్ భట్ ఫ్యామిలీపై ఒంటికాలుతో లేచే కంగానా రనౌత్ మరోసారి టార్గెట్ చేసింది. మహేష్ భట్ తన అసలు పేరు ‘అస్లాం’ను ఎందుకు మార్చుకున్నాడో చెప్పాలని డిమాండ్ చేసింది.

FOLLOW US: 
Share:

కంగనా రనౌత్.. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్. తాను చెప్పాలనుకున్న ఏ విషయాన్ని అయినా సూటిగా.. సుత్తి లేకుండా చెప్పేస్తుంది. ఎవరో.. ఎదో.. అనుకుంటారని ఏమాత్రం వెనుకడుగు వేయదు. ఎంత పెద్ద వివాదమైనా పర్వాలేదు. తాను మొహమాటం లేకుండా మాట్లాడేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే బాలీవుడ్ లో వివాదం అంటే తొలుత గుర్తొచ్చే పేరు కంగనా రనౌత్. ఇప్పటికే ఎన్నో అంశాల్లో విదాస్పద వ్యాఖ్యలు చేసిన కంగనా తాజాగా మరోసారి తన నోటికి పని చెప్పింది. మహేష్ భట్ మీద, ఆయన కుటుంబం మీద నిప్పులు చెరిగింది. 

మహేష్ భట్ అసలు పేరు ‘అస్లాం’

తాజాగా మహేష్ భట్ గురించి ఓ షాకింగ్ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. మహేష్ భట్ అసలు పేరు అస్లాం అని వెల్లడించింది. ఇన్ స్టా గ్రామ్ వేదికగా మహేష్ భట్ పాత వీడియోను ముక్కలు ముక్కలుగా కట్ చేసి.. వరుస పోస్టులు పెట్టింది. మహేష్ భట్ క్యాజువల్‌ గా, కవితాత్మకంగా ప్రజలను హింసకు ప్రేరేపించారని మండిపడింది. అదే వీడియోలోని మరొక భాగాన్ని షేర్ చేస్తూ.. మహేష్ భట్  అసలు పేరు అస్లాం అని నాకు తెలిసింది.  అతడు  సోని రజ్దాన్ ని రెండో వివాహం చేసుకున్నాడు. వీరిద్దరివి చాలా అందమైన పేర్లు, వాటిని ఎందుకు దాచి పెట్టారు? అని ప్రశ్నించింది. కంగనా షేర్ చేసిన మరో క్లిప్‌ తో పాటు మహేష్ పేరుపై ఒక ప్రకటన కూడా ఉంది. అందులో "మతం మారినప్పుడు తన అసలు పేరును ఉపయోగించాలి, నిర్దిష్ట మతానికి ప్రాతినిధ్యం వహించకూడదు" అని రాసి రాసుకొచ్చింది.

కంగనాను బాలీవుడ్ కు పరిచయం చేసిన మహేష్ భట్

వాస్తవానికి  2006లో వచ్చిన గ్యాంగ్‌స్టర్‌ సినిమాతో కంగనా రనౌత్ బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఆమెను ఈ సినిమా ద్వారా బాలీవుడ్ కు పరిచయం చేసిందే మహేష్ భట్. అయినా ఆయనపై కంగనా నిత్యం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంది. కొన్నిసార్లు ఆయన ఇద్దరు కూతుర్లు పూజా భట్, అలియా భట్ మీద సైతం తీవ్ర విమర్శలు చేసింది. పూజా భట్ సినిమాను తాను తిరస్కరించినప్పుడు ఆ మూవీ నిర్మాత తనపై దాదాపుగా దాడి చేశాడని ఆరోపించింది.  'గంగూబాయి కతియావాడి' విడుదలకు ముందు అలియాపై పరోక్ష విమర్శలు చేసింది. అలియాను 'నాన్న ఏంజెల్' అని మహేష్ 'మూవీ మాఫియా' అని కామెంట్ చేసింది.  

నెపోటిజంపై కంగనా పోరాటం

కంగనా రనౌత్ చాలా రోజుల నుంచి నెపోటిజంపై పోరాడుతోంది. బాలీవుడ్ లో టాలెంట్ కంటే వారసులకే ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారని విమర్శలు చేసింది. ఇక సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోయాక ఈ విమర్శలను మరింత తీవ్రం చేసింది. సుశాంత్ సూసైడ్ చేసుకుంటాడని తాను ముందే ఊహించానని మహేష్ భట్ చేసిన వ్యాఖ్యలపై కంగనా మండిపడింది. అదే సమయంలో మా నాన్నే గ్యాంగ్ స్టర్ సినిమాతో కంగనాని బాలీవుడ్ కు పరిచయం చేశాడని పూజ ప్రకటించింది. మహేష్ కొత్తవాళ్లకు రెమ్యునరేషన్ ఇవ్వకుండా ఫ్రీగా యాక్ట్ చేయించుకుంటాడని కంగనా పూజకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అతను చనిపోతాడని మీ నాన్నకు ముందే ఎలా తెలుసో వెళ్లి అడగాలని సూచించింది.

Published at : 05 Sep 2022 05:32 PM (IST) Tags: Kangana Ranaut Mahesh Bhatt Aslam

సంబంధిత కథనాలు

Upasana Baby Bump : ఉపాసన బేబీ బంప్ అదిగో - ఇంకా ఎనీ డౌట్స్?

Upasana Baby Bump : ఉపాసన బేబీ బంప్ అదిగో - ఇంకా ఎనీ డౌట్స్?

Brad Minnich For NTR 30 : ఎన్టీఆర్ సినిమాకు ఇంకో హాలీవుడ్ టచ్ - స్టార్ టెక్నీషియన్ వచ్చాడుగా 

Brad Minnich For NTR 30 : ఎన్టీఆర్ సినిమాకు ఇంకో హాలీవుడ్ టచ్ - స్టార్ టెక్నీషియన్ వచ్చాడుగా 

Janaki Kalaganaledu March 28th: ఒక్కటైన రామ, జానకి- సంతోషంలో జ్ఞానంబ, అనుమానించిన మల్లిక

Janaki Kalaganaledu March 28th: ఒక్కటైన రామ, జానకి- సంతోషంలో జ్ఞానంబ, అనుమానించిన మల్లిక

డేటింగ్‌పై నెటిజన్ వింత ప్రశ్న, తన స్టైల్ లో రిప్లై ఇచ్చిన సమంత

డేటింగ్‌పై నెటిజన్ వింత ప్రశ్న, తన స్టైల్ లో రిప్లై ఇచ్చిన సమంత

'పులి' నుంచి 'కబ్జ' వరకు - పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఇదే జరుగుద్ది

'పులి' నుంచి 'కబ్జ' వరకు - పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఇదే జరుగుద్ది

టాప్ స్టోరీస్

Visakhapatnam: చనిపోతామంటూ భార్యాభర్తల సెల్ఫీ వీడియో! చూస్తే కన్నీళ్లే - కాలువ వద్ద షాకింగ్ సీన్

Visakhapatnam: చనిపోతామంటూ భార్యాభర్తల సెల్ఫీ వీడియో! చూస్తే కన్నీళ్లే - కాలువ వద్ద షాకింగ్ సీన్

MLA Durgam Chinnaiah: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిళ సంచలన ఆరోపణలు, కోడ్‌ భాష‌లో ఛాటింగ్‌!

MLA Durgam Chinnaiah: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిళ సంచలన ఆరోపణలు, కోడ్‌ భాష‌లో ఛాటింగ్‌!

Hyderabad Metro: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోకు భూసార పరీక్షలు ప్రారంభం - ఎలా చేస్తారంటే!

Hyderabad Metro: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోకు భూసార పరీక్షలు ప్రారంభం - ఎలా చేస్తారంటే!

పార్టీ మార్పుపై వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి క్లారిటీ -  అనుమానంగా ఫోన్లు పెట్టేశారని ఆవేదన

పార్టీ మార్పుపై వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి క్లారిటీ -  అనుమానంగా ఫోన్లు పెట్టేశారని ఆవేదన