Kangana Twitter Restored: ట్విట్టర్‌లోకి కంగనా రి-ఎంట్రీ, రెండేళ్ల తర్వాత అకౌంట్ యాక్టివేట్!
బాలీవుడ్ నటీమణి కంగనా రనౌత్ ట్విట్టర్ యాక్టివేట్ అయ్యింది. సుమారు రెండు ఏండ్ల తర్వాత తను ట్విట్టర్ లోకి అడుగు పెట్టింది. 2021 మేలో ఆమె అకౌంట్ ను పర్మినెంట్ గా సస్పెండ్ చేసింది ట్విట్టర్.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మళ్లీ ట్విట్టర్ లో దర్శనం ఇచ్చింది. రెండు సంవత్సరాల తర్వాత తొలిసారి ట్వీట్ చేసింది. 2021 మేలో శాశ్వతంగా ఆమె అకౌంట్ సస్పెండ్ చేస్తున్నట్లు ట్విట్టర్ ప్రకటించినా, తాజాగా పునరుద్దరించింది. ఈ సందర్భంగా ఆమె ట్విట్టర్ లోకి మళ్లీ వచ్చినట్లు ట్వీట్ చేసింది. “అందరికీ హాలో, మళ్లీ ఇక్కడికి రావడం బాగుంది” అంటూ ట్వీట్ చేసింది. తన తాజా మూవీ ‘ఎమర్జెన్సీ’ గురించి మరో ట్వీట్ పెట్టింది.
Hello everyone, it’s nice to be back here 🙂
— Kangana Ranaut (@KanganaTeam) January 24, 2023
And it’s a wrap !!!
— Kangana Ranaut (@KanganaTeam) January 24, 2023
Emergency filming completed successfully… see you in cinemas on 20th October 2023 …
20-10-2023 🚩 pic.twitter.com/L1s5m3W99G
మే 2021లో ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్
కంగనా రనౌత్ ట్విట్టర్ నియమావళిని ఉల్లంఘించడంతో పాటు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ 2021 మే నెలలో ఆమె అకౌంట్ ను పర్మినెంట్ గా సస్పెండ్ చేస్తున్నట్లు మైక్రో బ్లాగింగ్ యాజమాన్యం ప్రకటించింది. రెండు, మూడు సార్లు హెచ్చరించినా తను పట్టించుకోలేదని ట్విట్టర్ ప్రకటించింది. బెంగాల్ ఎన్నికల తర్వాత జరిగిన హింస గురించి కంగనా పలు వివాదాస్పద ట్వీట్లు చేసినట్లు తెలిపింది. దీంతో ఆమెను ట్విట్టర్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించింది.
ట్విట్టర్ పై తీవ్ర విమర్శలు
తనను ట్విట్టర్ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కంగనా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ట్విట్టర్ తనను సస్పెండ్ చేయడం ద్వారా మరోసారి తాము అమెరికన్లమే అని నిరూపించుకున్నారని మండిపడ్డారు. తెల్లజాతి ప్రజలు పుట్టుకతోనే నలజాతీయులను బానిసలుగా చూసే అలవాటును కలిగి ఉన్నారంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇతరులు ఏం ఆలోచించాలి? ఎలా ఆలోచించాలి? ఏం మాట్లాడాలి? అనే విషయాలను వారు నిర్ణయించినట్లుగానే ఉండాలని భావిస్తారని చెప్పారు. భారత ప్రజలు ఎన్నో ఏండ్లుగా అణిచివేత, వేధింపులు ఎదుర్కొన్నారని, ఇప్పటికీ అవి అలాగే కొనసాగుతున్నాయని వెల్లడించారు.
అక్టోబర్ 20న ‘ఎమర్జెన్సీ’ విడుదల
ఇక కంగనా రనౌత్ ప్రస్తుతం ‘ఎమర్జెన్సీ’ అనే సినిమా తెరకెక్కిస్తోంది. స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 20న విడుదల కానుంది. ఇందులో కంగనా ఇందిరా గాంధీ పాత్రను పోషిస్తోంది. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, సతీష్ కౌశిక్, శ్రేయాస్ టాల్పేడ్, మిలింద్ సోమాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేశంలో చీకటి రోజులుగా చెప్పుకునే ఎమర్జెన్సీ కాలాన్ని బేస్ చేసుకుని ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఆమె స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మణికర్ణిక’ మూవీ మంచి హిట్ అంటుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు కూడా తనే దర్శకత్వం వహిస్తోంది. పాన్ ఇండియన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
‘ఎమర్జెన్సీ’ ఓ పునర్జన్మ-కంగనా
తాజాగా తన ‘ఎమర్జెన్సీ’ సినిమా గురించి ఆమె కీలక విషయాలు వెల్లడించింది. ఈ సినిమా కోసం ఎన్నో ఇబ్బందులు పడినట్లు చెప్పింది. షూటింగ్ సమయంలో డెంగ్యూ బారిన పడి చాలా సమస్యలు ఎదుర్కొన్నట్లు వెల్లడించింది. అనారోగ్యం కారణంగా కొద్ది రోజులు సినిమా షూటింగ్ కు దూరం అయినట్లు తెలిపింది. ఈ సినిమా కోసం తన ఆస్తులను కుదువపెట్టి డబ్బులు తెచ్చినట్లు తెలిపింది. ఈ సినిమా తనకు ఓ పునర్జన్మ అని పేర్కొంది.
Read Also: నా జీవితంలో అద్భుత ఘట్టం చివరి దశకు చేరింది - ‘ఎమర్జెన్సీ‘పై కంగనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్