Kangana Emergency Movie: నా జీవితంలో అద్భుత ఘట్టం చివరి దశకు చేరింది - ‘ఎమర్జెన్సీ‘పై కంగనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
కంగనా రనౌత్ తాజాగా నటిస్తున్న సినిమా ‘ఎమర్జెన్సీ‘. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ సందర్భంగా ఆమె చేసిన కామెంట్స్ ఆసక్తిని కలిగిస్తున్నాయి.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఏ విషయాన్ని అయినా ముక్కుసూటిగా కుండ బద్దలుకొట్టినట్లు చెప్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినిమాలతో పాటు రాజకీయాలపైనా స్పందిస్తుంటుంది. తను చేసే కామెంట్స్ కారణంగా నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఏకంగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు సవాల్ విసిరి గట్స్ ఉన్న నటిగా గుర్తింపు తెచ్చుకుంది. మహారాష్ట్రకు వస్తే మీ అంతు చూస్తూమని హెచ్చరించిన శివసేన పార్టీకి, అడుగుపెట్టి మరీ చూపించింది. కాంట్రవర్శియల్ హీరోయిన్ గా గుర్తింపు పొందినా, తనలోని ధైర్యాన్ని మెచ్చుకోకతప్పదు. తను అనుకున్నది సాధించడంలో ఏమాత్రం వెనక్కి తగ్గనని పలుమార్లు నిరూపించుకుంది.
కష్టాన్ని వివరించిన కంగనా
తాజాగా ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న సినిమా ‘ఎమర్జెన్సీ’. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ తాజాగా పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి, ఈ సినిమా కోసం తను పడిన కష్టం గురించి సోషల్ మీడియా వేదికగా వివరించింది. సినిమా షూటింగ్ సమయంలో తీసిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది.
నాకు పునర్జన్మ లాంటిది
కంగనా పోస్టులో ఎన్నో విషయాలను ప్రస్తావించింది. “ఒక నటిగా ఈ రోజు ఎమర్జెన్సీ సినిమా షూటింగ్ పూర్తి చేశాను. నా జీవితంలో అద్భుతమైన ఘట్టం చివరి దశకు చేరుకుంది.ఈ సినిమా కోసం నేను ఎలాంటి ఇబ్బంది పడలేదని చాలామంది భావిస్తున్నారు. కానీ వాస్తవం వేరు. ఈ మూవీ కోసం నాకు సంబంధించిన ఆస్తులన్నింటినీ బ్యాంకులో మార్టిగేజ్ చేశాను. తొలి షెడ్యూల్ వేళ డెంగీతో చాలా బాధపడ్డాను. రక్తకణాల సంఖ్య భారీగా పడిపోయింది. అయినా నేను షూట్ లో పాల్గొన్నాను. ఈ ‘ఎమర్జెన్సీ’ మూవీ నా జీవితంలో ఎంతో కష్టాన్ని కలిగించింది. కాకపోతే ఈ సినిమా నాకు పునర్జన్మ లాంటిది” అంటూ రాసుకొచ్చింది.
View this post on Instagram
చీకటి రోజులుగా ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎమర్జెన్సీ’
ఇక కంగనా ‘ఎమర్జెన్సీ’ సినిమా, స్వతంత్ర భారతదేశంలో చీకటి రోజులుగా పిలిచే ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను ఆధారంగా చేసుకుని రూపొందుతోంది. కంగనా స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో కంగనా ‘ఎమర్జెన్సీ’ నాటి ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో నటిస్తోంది. ‘మణికర్ణిక’ సినిమా తర్వాత కంగనా దర్శకత్వంలో రూపొందుతున్నసినిమా ఇదే. ఈ సినిమాకు కంగనా నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. అన్నీ తానై తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
View this post on Instagram
Read Also: ఆస్కార్ రేసులో ఎన్టీఆర్ దూకుడు, హాలీవుడ్ స్టార్స్‌ను సైతం వెనక్కి నెట్టి...