By: ABP Desam | Updated at : 20 Jan 2023 05:11 PM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@RRR Movie/twitter
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘RRR’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. వసూళ్ల పరంగానే కాకుండా, ప్రతిష్టాత్మక అవార్డుల పరంగానూ దుమ్మురేపుతోంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్ సహా పలు అవార్డులను దక్కించుకున్న ఈ చిత్రం ఆస్కార్ అవార్డుల కోసం ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో ‘RRR’ టీమ్ కు అదిరిపోయే వార్త చెప్పింది ‘యుఎస్ఏ’ టుడే. ఆస్కార్ రేసులో నిలిచిన టాప్ 10 హీరోస్ లిస్టులో జూ.ఎన్టీఆర్‌కు నెంబర్ వన్ స్థానాన్ని ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా జూ.ఎన్టీఆర్ పేరు మార్మోగుతోంది.
ఇండియా నుంచి ‘RRR’ మూవీ అధికారికంగా ఎంట్రీ దక్కించుకోలేకపోయినా, ఇండిపెండెంట్ కేటగిరీలో నామినేట్ అయ్యింది. ప్రస్తుతం ఆస్కార్ ఓటింగ్ కొనసాగుతోంది. ఆస్కార్ ఓటర్లు తమ నామినేషన్స్ ను అకాడమీ అవార్డులకు పంపుతున్నారు. ఇప్పటికే ఏఆర్ రెహమాన్ సైతం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆస్కార్ నామినేషన్స్ అధికారికంగా ప్రకటించడానికి ముందు అమెరికాకు చెందిన పలు మీడియా సంస్థలు సర్వేలు నిర్వహించి ఆస్కార్ నామినేషన్ జాబితాలను విడుదల చేస్తున్నాయి.
Oscar voters have their nomination ballots in hand. But hear us out: We've got some dark horses for their consideration.
Here are 10 performances from deserving folks we hope are remembered in this year's Oscar race. https://t.co/HPyfxPNSRv— USA TODAY (@USATODAY) January 19, 2023
తాజాగా యుఎస్ఎ టుడే పోర్టల్ ఆస్కార్ రేసులో నిలిచే టాప్ 10 హీరోల లిస్టును విడుదల చేసింది. ఇందులో ఎన్టీఆర్ కు టాప్ ప్లేస్ ఇచ్చింది. అమెరికాలోనే ప్రముఖ పత్రికగా కొనసాగుతున్న యుఎస్ఎ టుడే ఇండియన్ యాక్టర్ కు టాప్ ర్యాంక్ ఇవ్వడం సంచలనం కలిగిస్తోంది.
1. జూ.ఎన్టీఆర్(ఆర్ఆర్ఆర్)
2. టామ్ క్రూజ్ (టాప్ గన్: మావెరిక్)
3. పాల్ డానో (ద బ్యాట్‌మేన్)
4. మియా గోత్ (పెర్ల్)
5. నైనా హాస్ (టార్)
6. జియో క్రావిట్జ్ (కిమి)
7. లాషనా లించ్(ద ఉమెన్ కింగ్, మటిల్డా ద మ్యూజికల్)
8. పాల్ మెస్కల్ (ఆఫ్టర్‌సన్)
9. కెకె పామర్ (నోప్)
10. జెరెమీ పోప్ (ద ఇన్‌స్పెక్షన్)
ఈ సందర్భంగా ‘RRR’ మూవీపై USA Today పోర్టల్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ చిత్రాన్ని యాక్షన్ ప్యాక్డ్ మ్యూజికల్ అడ్వెంచర్ గా ప్రకటించింది. ఈ సినిమాను ఇద్దరు ఇండియన్ యాక్టర్స్ ఆడియన్స్ ఫ్రెండ్లీ పవర్ హౌస్‌గా మార్చారని ప్రశంసించింది. ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అద్భుతంగా ఫైట్లు, డాన్సులు చేశారని తెలిపింది. అయినప్పటికీ, ఇద్దరిలో ఒక్కరిని మాత్రమే సెలెక్ట్ చేయాలి కాబట్టి.. క్రూర జంతువులను పోషించడం, మోటార్ సైకిల్ లాంటి అడ్వెంచర్స్ చేయడం వల్ల జూ.ఎన్టీఆర్ ను నామినేట్ చేసినట్లు వెల్లడించింది.
Read Also: బొమ్మల పుస్తకంగా ‘RRR’ సినిమా, కొడుకుపై ప్రేమతో ఆ తండ్రి ఏం చేశాడో చూడండి
Kalyan Ram in Suma Adda: హీరోయిన్ ను పక్కనబెట్టి యాంకర్ సుమకు ప్రపోజ్ చేసిన కళ్యాణ్ రామ్!
Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!
Unstoppable 2: నర్సుపై వివాదాస్పద కామెంట్స్, క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ
Madhavan Audition Clip: ‘3 ఇడియట్స్’ సినిమా కోసం మాధవన్ చేసిన ఆడిషన్ వీడియో చూశారా?
‘రైటర్ పద్మభూషణ్’ మూవీపై మహేష్ బాబు ట్వీట్ - సుహాస్ భావోద్వేగం!
Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!
Majilis Congress : మజ్లిస్‌ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ - వర్కవుట్ అవుతుందా ?
Man Marries Triplets: ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు- టైం టేబుల్ వేసుకొని భర్తతో కాపురం!
Adani Group : అదానీకి మరో షాక్, రూ.5400 కోట్ల బిడ్ రద్దు చేసిన యూపీ డిస్కమ్