By: ABP Desam | Updated at : 15 May 2022 08:12 PM (IST)
కమల్ హాసన్ 'విక్రమ్' ట్రైలర్
స్టార్ హీరో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో దర్శకుడు లోకేష్ కనకరాజ్ రూపొందిస్తోన్న యాక్షన్ ఎంటర్టైనర్ 'విక్రమ్'. ఇంతకు ముందు కార్తీ హీరోగా 'ఖైదీ', విజయ్ హీరోగా 'మాస్టర్' చిత్రాలకు లోకేష్ దర్శకత్వం వహించారు. తెలుగులోనూ 'ఖైదీ' భారీ విజయం సాధించింది. 'మాస్టర్' సినిమాకు తెలుగులో కంటే తమిళంలో ఎక్కువ ఆదరణ లభించింది. భారీ వసూళ్లు సాధించింది. విజయ్ స్టార్‌డమ్‌ను దృష్టిలో పెట్టుకుని లోకేష్ సినిమా తీశారని పేరొచ్చింది. ఇప్పుడు 'విక్రమ్'తో మరో విజయంపై ఆయన గురి పెట్టారు.
ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్లు, టీజర్లు అభిమానులను ఆకట్టుకున్నాయి. తాజాగా సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ లో యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. కమల్ హాసన్, ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతిల పాత్రలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అందరిని సమానంగా చూపిస్తూ ట్రైలర్ కట్ చేశారు దర్శకుడు. అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ ఓ రేంజ్ లో ఎలివేట్ అయింది.
చాలా కాలం తరువాత కమల్ నటించిన సినిమా కావడం.. పైగా స్టార్ హీరోలు ఉండడంతో బజ్ ఓ రేంజ్ లో ఏర్పడింది. ఈ సినిమాలో హీరో సూర్య కూడా కనిపించబోతున్నారు. కానీ ట్రైలర్ లో ఆయన క్యారెక్టర్ ను చూపించలేదు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శివాని నారాయణన్, కాళిదాస్ జయరామ్, అర్జున్ దాస్ తదితరులు నటిస్తున్నారు. జూన్ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: ఆయన మాటలంటే నీ సంస్కారం ఏమైంది? బిందుని ప్రశ్నించిన నాగ్!
Also Read: హరీష్ శంకర్ లిస్ట్ లో క్రేజీ ఆఫర్ - సల్మాన్ తో సినిమా?
Khushbu Sundar: మీనా భర్త మృతిపై తప్పుడు ప్రచారం - నటి ఖుష్బూ ఫైర్!
Aamir Khan: అసోం ప్రజల కోసం విరాళం ప్రకటించిన అమీర్ ఖాన్, ఆ మంచి మనసును మెచ్చుకోవాల్సిందే
Happy Birthday Movie Trailer: గన్స్, గ్యాంగ్స్, గర్ల్స్ - 'హ్యాపీ బర్త్ డే' ట్రైలర్ చూశారా?
Ram Pothineni: ‘నే హైస్కూల్కు వెళ్లలే’ - పెళ్లిపై రామ్ పోతినేని క్రేజీ కామెంట్స్!
Virata Pravam OTT Release Date: నెట్ ఫ్లిక్స్ లో 'విరాటపర్వం' - రిలీజ్ ఎప్పుడంటే?
GST Rate Increase: ప్యాక్ చేసిన పెరుగు, లస్సీపై జీఎస్టీ - ఆస్పత్రి బెడ్స్, గ్రైండర్లపై పన్ను మోత!
GST Rate Cut: ప్రభువుల వారు కరుణించారు! జీఎస్టీ తగ్గించిన వస్తువుల జాబితా!
Shock For AP Employees : అమరావతి ఉద్యోగులకు ప్రభుత్వం మరో షాక్ - గత ప్రభుత్వం కల్పించిన ఆ సౌకర్యం ఎత్తివేత !
Anchor Suma: యాంకర్ సుమ బాధపడుతోంది ఈ వింత వ్యాధితోనే, ఇది వారసత్వంగా వస్తుందట