News
News
X

Kamal Haasan: 'ఇండియన్ 2' సినిమాకి కొత్త కష్టాలు.. అసలు ముందుకెళ్తుందా..?

'ఇండియన్ 2' సినిమాకి కొత్త కష్టాలు వచ్చాయి. వాటన్నింటినీ  దాటుకొని ఈ సినిమా ఎప్పటికి పూర్తవుతుందో.. 

FOLLOW US: 

ఈ మధ్యకాలంలో 'ఇండియన్ 2' సినిమాకొచ్చినన్ని కష్టాలు ఏ సినిమాకి రాలేదనే చెప్పాలి. దర్శకుడు శంకర్ ఏ ముహూర్తాన ఈ సినిమాను మొదలుపెట్టారో అప్పటినుంచి ఏదోక అడ్డంకి వస్తూనే ఉంది. సినిమాను పూర్తి చేయాలని ఎంతగా అనుకున్నా.. ఓ పట్టాన తెమలడం లేదు. దీంతో ఇప్పటికీ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి తెగ ఇబ్బందులు పడుతోంది. ముందుగా సినిమా షూటింగ్ సమయంలో క్రేన్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. 

దీంతో షూటింగ్ ను చాన్నాళ్లపాటు వాయిదా వేయాల్సి వచ్చింది. కోర్టు విచారణ, కేసులంటూ నిర్మాతలు తిరగడంతోనే సమయమంతా అయిపోయింది. ఆ గ్యాప్ శంకర్ వేరే సినిమాలకు కమిట్ అయ్యాడు. ఈ విషయం నిర్మాతలకు మరింత కోపం తెప్పించింది. దీంతో శంకర్ పై కేసు పెడుతూ కోర్టుకెళ్లారు. తమ సినిమా పూర్తయిన తరువాత శంకర్ వేరే సినిమాలను పూర్తి చేయాలంటూ కోర్టుకి వినతిపత్రం అందించారు.

ఫైనల్ గా ఈ కేసులు ఇరు వర్గాలు రాజీ పడి.. ఓ అగ్రిమెంట్ కి వచ్చారు. షూటింగ్ చేయడానికి రెడీ అయ్యారు. ఇంతలో సినిమాలో హీరోయిన్ గా అనుకున్న కాజల్ కొన్ని కారణాల వలన ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీంతో కొత్త హీరోయిన్ ను వెతికే పనిలో పడ్డారు. కథ ప్రకారం.. హీరోయిన్ రెండు గెటప్స్ లో కనిపించాల్సి ఉంటుంది. అందులో ఒకటి యంగ్ రోల్ కాగా, మరొకటి వృద్ధురాలి పాత్ర. దీనికోసం కొంతమంది హీరోయిన్లపై ప్రోస్థెటిక్ మేకప్ ట్రై చేస్తున్నారు. త్రిషకు మేకప్ సూట్ అయిందని.. ఆమెని ఫైనల్ చేసే ఛాన్స్ ఉందని అన్నారు. 

ఇప్పుడేమో హీరోయిన్ గా తమన్నా పేరు వినిపిస్తోంది. ఇది కాకుండా సినిమాలో ముఖ్యపాత్రలు కోసం ఎంపిక చేసుకున్న వివేక్, నెడుమూడి వేణు ఇద్దరూ కూడా ఈ ఏడాదిలో సడెన్ గా చనిపోయారు. దీంతో ఆ పాత్రల కోసం వేరే నటుల్ని వెతకాల్సి వస్తోంది. మరోపక్క హీరో కమల్ హాసన్ ఆరోగ్యం ఏమంత బాగాలేదు. రీసెంట్ గా ఆయన కోవిడ్ బారిన పడ్డారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు కానీ.. కాస్త వీక్ గా ఉన్నారని, కొన్నాళ్లపాటు రిస్క్ పనులు చేయకుండా.. రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుందని డాక్టర్లు చెప్పారు. కాబట్టి ఫిట్ నెస్ కోసం కమల్ కూడా గ్యాప్ తీసుకునే ఛాన్స్ ఉంది. వీటన్నింటినీ దాటుకొని ఈ సినిమా ఎప్పటికి పూర్తవుతుందో చూడాలి!

Also Read: 'హరిహర వీరమల్లు'.. జాక్వెలిన్ అవుట్.. నర్గీస్ ఫక్రీ ఇన్..

Also Read: బాలీవుడ్ లో 'అఖండ' రీమేక్.. హీరో ఎవరంటే..?

Also Read: అనసూయ ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ యాంకర్

Also Read: అమ్మాయిలను ఎప్పుడూ అలా చూడలేదా? ఇతర మహిళలకు లేనిది ఏమైనా నాకుందా? - పాయల్ బోల్డ్ రియాక్షన్

Also Read: సిరివెన్నెలకు నా ముద్దు, ఆర్జీవీ ఎమోషనల్ పోస్టు, పాట పాడి మరీ...

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 05 Dec 2021 05:37 PM (IST) Tags: Kajal Director Shankar Kamal Haasan Indian 2 Indian 2 Movie

సంబంధిత కథనాలు

Venkatesh: దేవుడిగా వెంకీ - విశ్వక్ సేన్ సినిమాకి బజ్ వస్తుందా?

Venkatesh: దేవుడిగా వెంకీ - విశ్వక్ సేన్ సినిమాకి బజ్ వస్తుందా?

SitaRamam: 'సీతారామం' కథ ఫస్ట్ విజయ్ దేవరకొండకి చెప్పా - హను రాఘవపూడి కామెంట్స్!

SitaRamam: 'సీతారామం' కథ ఫస్ట్ విజయ్ దేవరకొండకి చెప్పా - హను రాఘవపూడి కామెంట్స్!

Rana-Miheeka: రానా మ్యారీడ్ లైఫ్‌పై రూమర్స్ - క్లారిటీ ఇచ్చిన అతడి భార్య!

Rana-Miheeka: రానా మ్యారీడ్ లైఫ్‌పై రూమర్స్ - క్లారిటీ ఇచ్చిన అతడి భార్య!

Prabhas: 'సీతారామం' ఎఫెక్ట్ - ప్రభాస్ డైరెక్టర్‌ను టార్గెట్ చేసిన ఫ్యాన్స్!

Prabhas: 'సీతారామం' ఎఫెక్ట్ - ప్రభాస్ డైరెక్టర్‌ను టార్గెట్ చేసిన ఫ్యాన్స్!

Bimbisara: 'బింబిసార' రేర్ ఫీట్ - మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్!

Bimbisara: 'బింబిసార' రేర్ ఫీట్ - మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్!

టాప్ స్టోరీస్

కేవలం 12 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ - రియల్‌మీ కొత్త ఫోన్ లాంచ్‌కు రెడీ!

కేవలం 12 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ - రియల్‌మీ కొత్త ఫోన్ లాంచ్‌కు రెడీ!

రాఖీకి మీ సోదరికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా - అయితే ఈ ఆప్షన్లపై ఓ లుక్కేయండి!

రాఖీకి మీ సోదరికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా - అయితే ఈ ఆప్షన్లపై ఓ లుక్కేయండి!

Monkeypox: మంకీపాక్స్ వైరస్ రెండు కొత్త లక్షణాలు ఇవే, కనుగొన్న కొత్త అధ్యయనం

Monkeypox: మంకీపాక్స్ వైరస్ రెండు కొత్త లక్షణాలు ఇవే, కనుగొన్న కొత్త అధ్యయనం

108కు కాల్ చేయడానికి భయమెందుకు? ఈ రోజు ఎవరో, రేపు మీకే ఆ సమస్య వస్తే? ఈ రూల్స్ తెలుసా?

108కు కాల్ చేయడానికి భయమెందుకు? ఈ రోజు ఎవరో, రేపు మీకే ఆ సమస్య వస్తే? ఈ రూల్స్ తెలుసా?