By: ABP Desam | Updated at : 04 Jul 2022 05:19 PM (IST)
'ఇక్కడ రాక్షసుడైనా భగవంతుడైనా ఈ బింబిసారుడు ఒక్కడే'
నందమూరి కల్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram) హీరోగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ .కె నిర్మిస్తున్న సినిమా 'బింబిసార (Bimbisara Movie). ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్... అనేది ఉపశీర్షిక. ఈ సినిమాతో వశిష్ఠ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హీరోగా కల్యాణ్ రామ్ 18వ చిత్రమిది (NKR18). ఈ సినిమాను ఆగస్టు 5న (Bimbisara On August 5th, 2022) విడుదల చేయనున్నట్టు తెలిపారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
ట్రైలర్ లో కళ్యాణ్ రామ్ రెండు గెటప్స్ లో కనిపించారు. బింబిసారుడి గెటప్ లో కళ్యాణ్ రామ్ పెర్ఫార్మన్స్ ఓ రేంజ్ లో ఉంది. ఆయన డైలాగ్స్, యాక్షన్ సీన్స్ టెరిఫిక్ గా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్ లో ఎలివేట్ అయింది. 'ఇక్కడ రాక్షసుడైనా భగవంతుడైనా ఈ బింబిసారుడు ఒక్కడే', 'ఓ యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూస్తారు' అంటూ ట్రైలర్ లో వినిపించిన డైలాగ్స్ మాములుగా లేవు. మొత్తానికి ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ హిట్టు కొట్టేలానే ఉన్నాడు.
'బింబిసార' సినిమాలో కేథరిన్ ట్రెసా (Catherine Tresa), సంయుక్తా మీనన్ (Samyuktha Menon), వరీనా హుస్సేన్ (Warina Hussain) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి, వరికుప్పల యాదగిరి పాటలు రాస్తున్నారు. ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి నేపథ్య సంగీతం అందిస్తున్నారు. చిరంతన్ భట్ స్వరాలు అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫర్.
ఇక్కడ రాక్షసుడైనా భగవంతుడైనా ఈ బింబిసారుడు ఒక్కడే 🔥
— NTR Arts (@NTRArtsOfficial) July 4, 2022
Regal #BimbisaraTrailer out now!
-https://t.co/ZDQpkP7toQ#BimbisaraOnAugust5th #HappyBirthdayNKR@NANDAMURIKALYAN @DirVassishta @CatherineTresa1 @iamsamyuktha_ @Warina_Hussain @mmkeeravaani @ChirantannBhatt pic.twitter.com/cM7s5jjWHP
All set for the Grand #BimbisaraTrailer Launch event 💥💥
— NTR Arts (@NTRArtsOfficial) July 4, 2022
Watch Live here!
▶️ https://t.co/RymXSGZCEd #BimbisaraOnAugust5th@NANDAMURIKALYAN @DirVassishta @CatherineTresa1 @iamsamyuktha_ @Warina_Hussain @actorysr @mmkeeravaani @ChirantannBhatt @AnilPaduri pic.twitter.com/Yvxb8onBtC
Anasuya: 'నా మాటలను రాజకీయం చేయొద్దు' - నెటిజన్లకు అనసూయ రిక్వెస్ట్!
Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?
Wanted PanduGod Review: వాంటెడ్ పండుగాడ్ రివ్యూ: సుధీర్, అనసూయ, సునీల్ల పండుగాడు మెప్పించాడా?
Highway Movie Review - హైవే రివ్యూ : విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ విజయం అందుకున్నారా? లేదా?
చీర కట్టుకుంటా, బీచ్లో బికినీ వేసుకుంటా - ట్రోలర్స్కు పూనమ్ కౌర్ దిమ్మతిరిగే ఆన్సర్!
High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
Google Maps: మీకు కావాల్సిన వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకోవాలా? జస్ట్ ఇలా చేస్తే సరిపోతుంది..
Raashii Khanna: అమ్మ బ్రహ్మ దేవుడో ఎంత గొప్ప సొగసురో- హాట్ ఫోజుల్లో హీట్ పెంచేస్తున్న రాశీ ఖన్నా
టాటా నెక్సాన్ ఈవీలో కొత్త మోడల్ - ధర మ్యాక్స్ కంటే తక్కువే!