By: ABP Desam | Updated at : 07 Feb 2023 03:41 PM (IST)
యంగ్ టైగర్ ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR Jr), దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) ది సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్. హీరో, దర్శకుడిగా ఈ ఇద్దరూ కలిసి చేసిన 'జనతా గ్యారేజ్' విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాదు, ప్రేక్షకులనూ ఆకట్టుకుంది. అంతే కాదు... భారీ వసూళ్ళు సాధించి అందరికీ లాభాలు అందించింది. అంతకు ముందు ఎన్టీఆర్ 'బృందావనం' చిత్రానికి కొరటాల రచయితగా చేశారు. ఆ సినిమా కూడా హిట్టే. ఇప్పుడు ఇద్దరూ కలిసి మరో సినిమా చేస్తున్నారు.
మార్చిలో చిత్రీకరణ మొదలు...
వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల!
ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వం వహించనున్న తాజా సినిమా మార్చిలో సెట్స్ మీదకు వెళ్ళనుంది. మార్చి 20న రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారా? లేదంటే మార్చి 21, 25లలో చేస్తారా? అనేది కొన్ని రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది. అప్డేట్స్... అప్డేట్స్ అంటూ దర్శక నిర్మాతలపై ఒత్తిడి తీసుకు రావద్దని 'అమిగోస్' ప్రీ రిలీజ్ వేడుకలో అభిమానులకు ఎన్టీఆర్ క్లాస్ పీకారు. యాంకర్ సుమ కనకాల అప్డేట్ అడిగినప్పుడు ఎన్టీఆర్ సీరియస్ అయ్యారు కూడా. అది పక్కన పెడితే... ఇప్పుడీ సినిమా కథా నేపథ్యం గురించైనా ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకు వచ్చింది.
కల్పిత దీవి... ఒక పోర్టులో!
హీరోగా ఎన్టీఆర్ 30వ సినిమా ఇది. అందుకని #NTR30 గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఓ కల్పిత దీవి, పోర్టు నేపథ్యంలో తెరకెక్కుతోందట. కథా నేపథ్యం ఈ ట్వంటీయెత్ సెంచరీ కాదని సమాచారం అందుతోంది. సెమీ పీరియడ్ బ్యాక్ డ్రాప్ సెలెక్ట్ చేశారట కొరటాల శివ. హైద్రాబాదులో ఈ సినిమా కోసం భారీ సెట్ వేస్తున్నారు. భాగ్య నగరంలో కొంత... ఆ తర్వాత విశాఖ, గోవా ఏరియాల్లో మరి కొంత షూటింగ్ చేయాలని ప్లాన్ చేశారట. వీఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువ ఉంటుందని, సీజీ అవసరం అయ్యే సన్నివేశాలను ముందు షూట్ చేసి విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలకు ఇవ్వాలని ప్లాన్ చేశారట.
Also Read : ఫిబ్రవరిలోనే 'పులి - మేక' వెబ్ సిరీస్ విడుదల - ఎప్పుడంటే?
ఆల్రెడీ విడుదల చేసిన సినిమా అనౌన్స్‌మెంట్ టీజర్ ప్రేక్షకుల అందరి దృష్టిని ఆకర్షించింది. ''అప్పుడప్పుడూ ధైర్యానికి కూడా తెలియదు. అవసరానికి మించి తను ఉండకూడదని! అప్పుడు భయానికి తెలియాలి... తాను రావాల్సిన సమయం వచ్చిందని! వస్తున్నా'' అని ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ సూపర్ హిట్ అయ్యింది. ఎన్టీఆర్ 30లో కథానాయికగా తొలుత ఆలియా భట్ పేరు వినిపించింది. అయితే, ఆమె తల్లి కావడంతో పాటు షూటింగ్ లేట్ కావడం వల్ల ఇప్పుడు ఆమెను తీసుకునే ఛాన్స్ లేదు. లేటెస్టుగా అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్, ప్రతినాయకుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, చిత్ర బృందం అధికారికంగా ఏ విషయం చెప్పలేదు.
Also Read : 'అన్‌స్టాపబుల్ 2' ఫైనల్‌కు పవర్ టచ్ - సూసైడ్, డిప్రెషన్‌పై పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్!
నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మిస్తున్న చిత్రమిది. దీనికి యువ సంగీత సంచలన అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించబోతున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ : సాబు సిరిల్, సినిమాటోగ్రాఫర్ : రత్నవేలు.
Shah Rukh Khan Rolls Royce: ఖరీదైన లగ్జరీ కారు కొన్న షారుఖ్ ఖాన్ - ఆ డబ్బుతో నాలుగైదు విల్లాలు కొనేయోచ్చేమో!
Jaya Janaki Nayaka Hindi Dubbed: Image Credits: బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాకు హిందీలో రికార్డు స్థాయిలో వ్యూస్, అందుకే ‘ఛత్రిపతి’ రిమేక్ చేస్తున్నారా?
Ravanasura Trailer : వాడు లా చదివిన క్రిమినల్ - రవితేజ 'రావణాసుర' ట్రైలర్ వచ్చిందోచ్
Nidhi Agarwal: నిధి అగర్వాల్ పూజలు - అవకాశాల కోసమేనా?
Priyanka Chopra: బాలీవుడ్ రాజకీయాలతో విసిగిపోయాను, అందుకే దూరమయ్యా: ప్రియాంక చోప్రా
Mla Rapaka : దొంగ ఓట్లతో గెలిచానని అనలేదు, నా మాటలు వక్రీకరించారు- ఎమ్మెల్యే రాపాక వివరణ
Pulivenudla Shooting : వులివెందులలో వివేకా కేసు అనుమానితుడు భరత్ కాల్పులు - ఒకరు మృతి
Prashanth Reddy: ఆరుగురు మోడీలు ప్రజల డబ్బులు కాజేసి విదేశాల్లో తలదాచుకున్నారు: మంత్రి ప్రశాంత్ రెడ్డి
Delhi Liquor Case: ఎమ్మెల్సీ కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ, ఈడీ ఆఫీస్‌కు లీగల్ అడ్వైజర్ సోమా భరత్