By: Satya Pulagam | Updated at : 07 Feb 2023 02:45 PM (IST)
లావణ్యా త్రిపాఠి, ఆది సాయి కుమార్
'అందాల రాక్షసి'తో తెలుగు తెరకు పరిచయమైన సొట్టబుగ్గల సుందరి లావణ్యా త్రిపాఠి (Lavanya Tripathi). తర్వాత 'మనం', 'భలే భలే మగాడివోయ్', 'సోగ్గాడే చిన్ని నాయనా', 'అర్జున్ సురవరం', 'చావు కబురు చల్లగా' వంటి హిట్ సినిమాలు చేశారు. ఫర్ ద ఫస్ట్ టైమ్... ఆమె ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు. అదే 'పులి - మేక'. యువ హీరో ఆది సాయి కుమార్ (Aadi Sai Kumar) నటిస్తున్న తొలి వెబ్ సిరీస్ కూడా ఇదే!
ఫిబ్రవరి 24న 'పులి - మేక' విడుదల
Puli Meka Web Series Release Date : పోలీస్ శాఖ నేపథ్యంలో 'పులి - మేక' వెబ్ సిరీస్ రూపొందించారు. ఆల్రెడీ షూటింగ్ అంతా కంప్లీట్ అయ్యింది. ఒకరి తర్వాత మరొకరు... పోలీస్ శాఖలో వ్యక్తులను టార్గెట్ చేస్తూ చంపేస్తుంటాడు ఓ సీరియల్ కిల్లర్. అతడిని ఎలా పట్టుకున్నారు? ఎవరు పట్టుకున్నారు? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఇదొక సీరియల్ కిల్లర్ థ్రిల్లర్ సిరీస్ అని చెప్పవచ్చు. పోలీస్ శాఖతో పాటు ఆస్ట్రాలజీతో మిళితమైన కథతో సిరీస్ తెరకెక్కించారని తెలిసింది. ఈ నెల 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 'జీ 5' ఓటీటీ కోసం ఎక్స్‌క్లూజివ్‌గా రూపొందిన సిరీస్ ఇది.
లావణ్యకు ఫస్ట్ పోలీస్ రోల్
'పులి - మేక' వెబ్ సిరీస్ (Puli Meka Web Series First Look On Feb 17th) ఫస్ట్ లుక్ ఈ నెల 17న విడుదల చేయనున్నారు. ఇందులో లావణ్యా త్రిపాఠి పోలీస్ ఆఫీసర్ రోల్ చేశారు. అందాల రాక్షసి ఖాకీ చొక్కా వేయడం ఇదే తొలిసారి. ఆది సాయి కుమార్ రోల్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందట. సిరీస్ మొత్తంలో ఎవరు పులి? ఎవరు మేక? అనేది ఆసక్తి రేపుతుందని, ప్రతి మలుపు ప్రేక్షకులను తర్వాత ఏం జరుగుతుంది? అని ఆసక్తి కలిగించేలా ఉంటుందని యూనిట్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
గోపీచంద్ 'పంతం' తీసిన దర్శకుడే!
'పులి - మేక'కు కె. చక్రవర్తి రెడ్డి దర్శకత్వం వహించారు. మ్యాచో స్టార్ గోపీచంద్ కథానాయకుడిగా 'పంతం' సినిమాకు దర్శకత్వం వహించినది ఆయనే. చక్రవర్తి రెడ్డికీ ఇదే తొలి వెబ్ సిరీస్. ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ (Kona Venkat) కు చెందిన కోన ఫిలిం కార్పోరేషన్ సంస్థతో కలిసి జీ 5 ఓటీటీ ఈ సిరీస్ నిర్మించింది. త్వరలో విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు. ఫస్ట్ లుక్ విడుదల రోజున మోషన్ పోస్టర్ లేదా చిన్న టీజర్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది.
Also Read : తెలుగింటి కోడలు కాబోతున్న లావణ్యా త్రిపాఠి - త్వరలో ఆ హీరోతో పెళ్లి!
సుమన్, 'బిగ్ బాస్' సిరి హనుమంతు, 'ముక్కు' అవినాష్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న 'పులి - మేక' వెబ్ సిరీస్‌కు ఛాయాగ్రహణం : సూర్య కళా, కూర్పు : చోటా కె. ప్రసాద్, కళా దర్శకత్వం : బ్రహ్మ కడలి, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు : గిరిధర్ మామిడిపల్లి, కౌముది నేమాని, సంగీతం : ప్రవీణ్ లక్కరాజు, రచన : కోన వెంకట్, వెంకటేష్ కిలారు, దర్శకత్వం : కె. చక్రవర్తి రెడ్డి.
Also Read : 'అన్‌స్టాపబుల్ 2' ఫైనల్‌కు పవర్ టచ్ - సూసైడ్, డిప్రెషన్‌పై పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్!
బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్
Kajal Aggarwal: బాలయ్య సరసన కాజల్ - రావిపూడి సినిమాలో హీరోయిన్‌గా కన్ఫర్మ్!
Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్
BB Jodi Grand finale: ‘BB జోడీ’ గ్రాండ్ ఫినాలే - రూ.25 లక్షల ప్రైజ్ మనీ కోసం 5 జంటల మధ్య పోటీ, గెలిచేదెవరు?
Nikhil Siddhartha: నిఖిల్ కు ఐకానిక్ గోల్డ్ అవార్డు, ‘కార్తికేయ 2‘లో నటనకు గాను ప్రతిష్టాత్మక పురస్కారం
KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం
MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!
Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!
KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !