Jr NTR: ‘RRR’ను కాదని ‘లాస్ట్ ఫిల్మ్ షో’ను ఆస్కార్ కు ఎందుకు పంపించారంటే? జూ. ఎన్టీఆర్, రాంచరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
Jr NTR: అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీకి ‘RRR’ భారత్ నుంచి ఆస్కార్ కోసం అధికారిక ఎంట్రీకి ఎంపిక కాలేదు. ఎందుకు ఎంపిక కాలేదు? అనే విషయంపై తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
RRR Oscar Entry:
దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటింది. రూ. 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రూ. 1200 కోట్లు వసూళు చేసింది. తాజాగా 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లోనూ సత్తా చాటింది. ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డును అందుకుంది. ‘RRR’ టీమ్ ఇప్పుడు ఆస్కార్ నామినేషన్ కోసం ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.
‘RRR’ సినిమా భారత్ నుంచి అధికారికంగా ఆస్కార్ ఎంట్రీకి వెళ్తుందని అందరూ భావించారు. కానీ, చివరకు పాన్ నలిన్ తెరకెక్కించిన గుజరాతీ మూవీ ‘లాస్ట్ ఫిల్మ్ షో’ ఉత్తమ అంతర్జాతీయ సినిమా కేటగిరీలో ఎంపికైంది. తాజాగా ఇదే అంశం గురించి ‘RRR’ నటుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. హిందీ జాతీయ భాష కావడం వల్లే అలా చేసి ఉండవచ్చన్నారు. ‘RRR’ తెలుగు సినిమా అయినా ప్రపంచ స్థాయిలో గర్వించేలా చేసిందన్నారు. ఆస్కార్‌కి భారత్ నుంచి ఎంట్రీ పంపించారా..? లేదా? అనే పట్టింపు తమకు లేదన్నారు.
ఆ కారణంగానే ఆస్కార్ ఎంట్రీకి పంపించకపోయి ఉండవచ్చు- జూనియర్ ఎన్టీఆర్
"ఏ సినిమాలు ఎంట్రీకి వెళ్లాలి అనే విషయంలో రాజకీయాలు జరుగుతున్నాయని నేను అనుకోను. అక్కడ కూర్చున్న ప్యానల్ సభ్యులు బాగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు అని నేను అనుకుంటున్నాను. హిందీ ప్రాథమికంగా జాతీయ భాషగా ఉంది. చాలా కాలంగా ఆ భాషకు ప్రాధాన్యత ఏర్పడింది. అందుకే ‘RRR’ను ఎంచుకొని ఉండకపోవచ్చు. అయినా ‘RRR’ మమ్మల్ని గర్వించేలా చేసింది” అని జూ. ఎన్టీఆర్ అన్నారు. " జూనియర్ ఎన్టీఆర్ నిజంగా వినయపూర్వకంగా ఉంటాడు. కానీ, నాకు గోల్డెన్ గ్లోబ్ తో పాటు ఆస్కార్ అవార్డు కూడా కావాలి. ‘RRR’ భారత్ తరఫున అధికారికంగా ఆస్కార్ కు ఎంపిక కాకపోవడాన్ని మేము తప్పు బట్టడం లేదు” అని రాంచరణ్ తెలిపారు.
ఆస్కార్ నామినేషన్ కోసం ఎదురు చూస్తున్న ‘RRR’ టీమ్
అటు గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకల్లో, SS రాజమౌళి ‘RRR’ మూవీ ఉత్తమ నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిల్మ్ అవార్డును దక్కించుకోలేకపోయింది. ఈ అవార్డును ‘అర్జెంటీనా 1985’ అనే అర్జెంటీనా మూవీ గెలుచుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘RRR’ మూవీలోని నాటు నాటు పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకుంది. సంగీత దర్శకుడు కీరవాణి ఈ అవార్డును తీసుకున్నారు. అటు ఆస్కార్ నామినేషన్ కోసం ‘RRR’ టీమ్ ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
View this post on Instagram
Read Also: హృతిక్ పై పొరపాటుగా ఆ కామెంట్స్ చేశాను, పాత వివాదంపై జక్కన్న వివరణ!