అన్వేషించండి

SS Karthikeya: రెండు దశాబ్దాల రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్, పులికి వందనం అంటూ ‘దేవర‘పై కార్తికేయ ప్రశంసలు

SS Karthikeya Tweet: ‘దేవర’ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను అద్భుతంగా అలరిస్తోంది. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో రాజమౌళి కొడుకు కార్తికేయ ఆసక్తికర ట్వీట్ చేశారు.

SS Karthikeya About Devara Movie: రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించారు. 23 ఏండ్ల తన తండ్రి ఫ్లాప్ సెంటిమెంట్ ను తారక్ బద్దలు కొట్టారంటూ అభినందించారు. ‘స్టూడెంట్ నెం.1’ సినిమాతో మొదలైన ఆ మిత్ ‘దేవర’తో బ్రేక్ అయ్యిందంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. “23 ఏండ్ల మిత్ ఫైనల్ గా బ్రేక్ అయ్యింది. ఏ వ్యక్తితో  మొదలైందో, మళ్లీ అదే వ్యక్తితో బద్దలైంది. చిన్ననాటి నుంచి అతడి    ఎదుగుదలను, సక్సెస్ ను దగ్గరగా చూస్తూ పెరిగాను. ఇప్పుడు ఆయన చేసే వండర్స్ ను చూస్తున్నాను. తెలుగు సినిమా పరిశ్రమకు ఆయన  ఎంతో కృషి చేస్తున్నారు. ప్రస్తుతం నాకు మాటలు రావట్లేదు. ఫ్యాన్స్ అంతా కలిసి వేడుక చేసుకునేందుకు ఆయన ఇచ్చిన గిఫ్ట్ ఈ సినిమా. ఇప్పుడు మ్యాడ్ నెస్ కూడా మాట్లాడుతున్నది. అందరం కలిసి పులికి వందనం చెప్పుదాం” అంటూ ఎన్టీఆర్ తో దిగిన ఫోటోను షేర్ చేశారు.   

‘స్టూడెంట్ నెంబర్ 1’ నుంచి కొనసాగుతున్న ఫ్లాప్ సెంటిమెంట్

దర్శకధీరుడు రాజమౌళితో సినిమా అంటే మామూలుగా ఉండదు. ఇండస్ట్రీ హిట్ పక్కా. ఏ హీరో అయినా రాజమౌళితో సినిమా చేయాలని కలలు కంటారు. ఒకవేళ ఆయనతో మూవీ చేసే ఛాన్స్ వస్తే ఫుల్ ఖుషీ అవుతారు. సినిమా చేసిన తర్వాతే అసలు కథ మొదలవుతుంది. రాజమౌళితో కలిసి పని చేసిన ఏ హీరో కూడా వెంటనే హిట్ అందుకోలేకపోయారు. బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడ్డ సందర్భాలే ఉన్నాయి. ‘స్టూడెంట్ నెంబర్ 1’తో మొదలుకొని ‘RRR’ వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. ఇండస్ట్రీలో రాజమౌళి ఫ్లాప్ సెంటిమెంట్ అలాగే ఉండిపోయింది. కానీ, ఇప్పుడు ఆ సెంటిమెంట్ ను యంగ్ టైగర్ బద్దలు కొట్టారు. ‘దేవర’ సినిమాతో ఊహించని ఆదరణ దక్కించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కార్తికేయ ఎన్టీఆర్ ను ప్రశంసింస్తూ పోస్టు పెట్టారు. ఎన్టీఆర్ తో మొదలైన సెంటిమెంట్ ఎన్టీఆర్ తోనూ బ్రేక్ అయ్యిందన్నారు. రాజమౌళి, ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కిన ‘స్టూడెంట్ నెం 1’ 2001 సెప్టెంబర్ లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పుడు దేవర కూడా సెప్టెంబర్ లోనే విడుదలై అద్భుత విజయాన్ని అందుకుంది.  

‘దేవర’ కర్నాటక రిలీజ్ రైట్స్ కొనుగోలు చేసిన కార్తికేయ

ఇక ‘దేవర’ మూవీకి సంబంధించి కర్నాటకలో రిలీజ్ రైట్స్ ను కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి ఎస్ఎస్ కార్తికేయ కొనుగోలు చేశారు. కన్నడ, తెలుగుతో పాటు ఇతర భాషల వెర్షన్లను కర్నాటకలో విడుదల చేసే రైట్స్‌ దక్కించుకున్నారు.  కర్నాటక థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్‌ లో భాగం అయినందుకు సంతోషంగా ఉందంటూ ఇప్పటికే కార్తికేయ ట్వీట్ చేశారు. 'ప్రేమలు' సినిమాతో కార్తికేయ డిస్ట్రిబ్యూషన్‌ ను మొదలుపెట్టారు.   

 ‘దేవర’కు మిక్స్ డ్ టాక్!

‘దేవర’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. చాలా మంది పాజిటివ్ గా రివ్యూ ఇస్తున్నా, మరికొంత మంది నెగెటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఫస్ట్ హాఫ్ తో పోల్చితే సెకెండాఫ్ అనుకున్న స్థాయిలో ఆకట్టుకోవట్లేదంటున్నారు. ఎండింగ్ ట్విస్ట్ కూడా అనుకున్న స్థాయిలో లేదనే టాక్ వినిపిస్తోంది. 'దేవర' మూవీని ఎన్టీఆర్  ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. యంగ్ సంగీత దర్శకుడు అనిరుధ్ మ్యూజిక్ అందించారు.  

Read Also:  దేవర రివ్యూ: ఎన్టీఆర్‌కు 'ఆర్ఆర్ఆర్' రేంజ్ హిట్ వస్తుందా? కొరటాల శివ తీసిన సినిమా ఎలా ఉందంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
World Chess Champion: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
Viral News: ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ !  వీడియో
ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ ! వీడియో
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

విజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీరాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే నామినేషన్!ప్రియుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్, ఫొటోలు వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
World Chess Champion: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
Viral News: ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ !  వీడియో
ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ ! వీడియో
Happy Birthday Rajinikanth: మాస్ డ్యాన్స్‌తో ఇరగదీసిన తలైవర్ - ‘కూలీ’ నుంచి చికిటు వైబ్ వచ్చేసింది!
మాస్ డ్యాన్స్‌తో ఇరగదీసిన తలైవర్ - ‘కూలీ’ నుంచి చికిటు వైబ్ వచ్చేసింది!
Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో పడిన బండరాళ్లు - భక్తులను అలర్ట్ చేసిన టీటీడీ
తిరుమల ఘాట్ రోడ్డులో పడిన బండరాళ్లు - భక్తులను అలర్ట్ చేసిన టీటీడీ
Mohan Babu discharge: ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
Mahindra Thar Discount: మహీంద్రా థార్‌పై భారీ ఆఫర్ - ఏకంగా రూ.మూడు లక్షల వరకు తగ్గింపు!
మహీంద్రా థార్‌పై భారీ ఆఫర్ - ఏకంగా రూ.మూడు లక్షల వరకు తగ్గింపు!
Embed widget