JioCinema: నెట్‌ఫ్లిక్స్, డిస్నీల బాటలో ‘జియో సినిమా’ - ఇక యూనివర్సల్ కంటెంట్‌తో పిచ్చెక్కించేస్తారట!
‘‘జియో సినిమా అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరు, ఇకపై యూనివర్శల్ కంటెంట్ విషయంలో తగ్గేదేలే’’ అంటున్నారు ముఖేష్ అంబానీ. ఇక నెట్‌ఫ్లిక్స్, డిస్నీలకు గట్టిపోటీ తప్పదేమో!
ముఖేష్ అంబానీకి చెందిన ఓటీటీ సంస్థ జియో సినిమా కొత్తగా ప్రకటించిన 'జియో సినిమా ప్రీమియం' SVOD (సబ్‌స్క్రిప్షన్ వీడియో ఆన్-డిమాండ్) టైర్‌లో వచ్చే నెల నుంచి NBCU సంస్థకు చెందిన కంటెంట్ ప్రసారం చేయనుంది. ఈ మేరకు NBC యూనివర్సల్ (NBCU), జియో సినిమా, Viacom18 స్ట్రీమింగ్ సర్వీస్ కలిసి ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం భారత్ లో NBCUకు సంబంధించిన సినిమాలు, టీవీ సిరీస్‌లను జియో సినిమా ప్రసారం చేయనుంది.
ఇకపై జియో సినిమలో NBC యూనివర్సల్ కంటెంట్
OTT ప్లాట్ ఫారమ్ కామ్‌కాస్ట్ NBC యూనివర్సల్ కు సంబంధించిన కంటెంట్ ను జియో ప్రసారం చేయనుంది. యూనివర్సల్ టెలివిజన్, UCP, యూనివర్సల్ ఇంటర్నేషనల్ స్టూడియోస్, యూనివర్సల్ టెలివిజన్ ఆల్టర్నేటివ్ స్టూడియో, స్కై స్టూడియోస్, డ్రీమ్‌వర్క్స్ యానిమేషన్, యూనివర్సల్ పిక్చర్స్, ఫోకస్ ఫీచర్స్, బ్రావో సంస్థలకు సంబంధించిన కంటెంట్ కూడా తమ వినియోగదారులకు అందుబాటులో ఉంచనుంది జియో సినిమా.
డ్వేన్ జాన్సన్ నటించిన ‘యంగ్ రాక్’ లాంటి డైలీ సీరియల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. యాక్షన్ థ్రిల్లర్ ‘ది లాజరస్ ప్రాజెక్ట్’, ‘ది లవర్స్’, డార్క్ రొమాంటిక్ కామెడీ డ్రామా చూసే అవకాశం ఉంటుంది. విల్ స్మిత్ నటించిన 90వ దశకంలోని కామెడీ సిరీస్ ‘బెల్-ఎయిర్’తో సహా భారతీయ ప్రేక్షకులు పీకాక్ ఒరిజినల్స్ ను కూడా ఆనందించవచ్చు. ‘పిచ్ పర్ఫెక్ట్: బంపర్ ఇన్ బెర్లిన్’, ‘స్పిన్-ఆఫ్’ సిరీస్ కూడా అందుబాటులో ఉంటుంది. ‘డౌన్ టౌన్ అబే’, ‘సూట్స్’, ‘ది ఆఫీస్’, ‘పార్క్స్ అండ్ రిక్రియేషన్’, ‘ది మిండీ’ ప్రాజెక్ట్ తో సహా NBCUకు సంబంధించిన పలు డ్రామాలు, కామెడీ సిరీస్ లను కూడా జియో సినిమా అందుబాటులో ఉంచనుంది. అంతేకాదు, ‘ది రియల్ హౌస్‌వైవ్స్ ఆఫ్ బెవర్లీ హిల్స్’,’వాండర్‌పంప్ రూల్స్’, ‘ఫ్యామిలీ కర్మ’తో ‘ది జెంటిల్ ఆర్ట్ ఆఫ్ స్వీడిష్ డెత్ క్లీనింగ్’ అనే సిరీస్ లు కూడా ఉన్నాయి.
ఇక ఈ కంటెంట్ లాంచ్ లో జియో సినిమా SVOD లైనప్‌కు హాలీవుడ్ స్టూడియో సహకారం అందించనుంది. సినిమాల స్ట్రీమింగ్ ఈ స్టూడియో నుంచే జరగనుంది. ఇక హాలీవుడ్ స్టూడియోకు సంబంధించి ఆస్కార్ కు నామినేట్ అయిన ‘పస్ ఇన్ బూట్స్: ది లాస్ట్ విష్’, ‘ది కంజురింగ్’, ‘M3GAN’ చిత్రాలను కూడా జియో సినిమా స్ట్రీమింగ్ చేయనుంది. ‘జురాసిక్’, ‘బోర్న్’,’ ష్రెక్’, ‘ది మమ్మీ’, ‘పిచ్ పర్ఫెక్ట్’ ఫ్రాంచైజీలు కూడా అందుబాటులోకి రానున్నాయి. అలాగే, కొత్తగా విడుదలైన ‘ఫాస్ట్ ఎక్స్’ని కలిగి ఉన్న ‘ఫాస్ట్’ ఫ్రాంచైజీ జియోసినిమాలో భారతీయ స్ట్రీమింగ్‌లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది.
జియో సినిమా దెబ్బకు ప్రత్యార్థి సంస్థల్లో గుబులు
ఇతర ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ తో పోల్చితే జియో సినిమా ప్రీమియం సంవత్సరానికి కేవలం 12 డాలర్లు( భారతీయ కరెన్సీలో సుమారు రూ.999) మాత్రమే. ఇకపై NBCU కంటెంట్ అందుబాటులోకి వస్తుండటంతో వినియోగదారులు జియో సినిమా వైపు ఎక్కువగా మొగ్గుచూపే అవకాశం ఉంది. మిగతా ప్రత్యర్థి ఓటీటీ సంస్థలు నెట్ ఫ్లిక్స్, డిస్నీకి జియో సినిమా నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.
Read Also: వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్, ఇకపై మీ స్క్రీన్ ఇతరులకు షేర్ చెయ్యొచ్చు!