అన్వేషించండి

Jatadhara Movie: బుల్లెట్ మీద సుధీర్ బాబు, వెనుక కాళికామాత ప్రళయ రూపం- కళ్లు చెదిరేలా ‘జటాధర’ సెకండ్‌ పోస్టర్

Jatadhara Movie Poster: సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘జటాధర’. సూపర్ థ్రిల్లర్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమా నుంచి రెండో పోస్టర్ రిలీజ్ అయ్యింది.

Sudheer Babu's New Poster From Jatadhara: సరికొత్త కథాంశాలతో సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు న‌వ ద‌ళ‌ప‌తి సుధీర్ బాబు. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సూప‌ర్ నేచుర‌ల్ థ్రిల్ల‌ర్ ‘జటాధర’ (Jatadhara Movie). ఈ సినిమా వచ్చే ఏడాది శివరాత్రికి రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా, తాజాగా మరో పోస్టర్ విడుదల అయ్యింది. పౌరాణిక‌, ఫాంట‌సీ, డ్రామా మేళవింపుగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు ఈ పోస్టర్ చూస్తే అర్థం అవుతోంది. బుల్లెట్ మీద సుధీర్ బాబు వెళ్తుండగా, ఆయన వెనుక వైపున కాళికాదేవి ఉగ్రరూపంలో కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. సూప‌ర్ నేచుర‌ల్ శ‌క్తితో సుధీర్ బాబు అగ్రెసివ్ గా కనిపిస్తున్నారు. పోస్టర్ లోనే ఇలా ఉంటే సినిమాలో ఎంత పవర్ ఫుల్ గా ఉంటారో? అని ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sudheer Babu (@isudheerbabu)

ఫస్ట్ లుక్ పోస్టర్ కు వచ్చిన ఆదరణ చూసి ఆశ్చర్యపోయా-సుధీర్ బాబు

‘జటాధర’ సినిమా తన కెరీర్ లో వెరీ వెరీ స్పెషల్ గా ఉండబోతున్నట్లు సుధీర్ బాబు చెప్పారు. “‘జటాధర’ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ కు వ‌చ్చిన ఆద‌ర‌ణ చూసి ఆశ్చ‌ర్య‌పోయాను. ప్రేక్షకుల నుంచి ఇంత గొప్ప స్పందన రావడం సంతోషం కలిగించింది. ఈ సినిమా నాకు ఓ స‌రికొత్త ప్ర‌పంచాన్ని ప‌రిచ‌యం చేసింది. నా జీవితంలో మర్చిపోలేని అనుభవం. శాస్త్రీయ‌త‌, పౌరాణిక అంశాల క‌ల‌యికతో ఈ కథను రాశారు. ఈ రెండు జోన‌ర్స్‌ కు చెందిన ప్రపంచాలు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి. ఆడియెన్స్ ఈ సినిమా చూసి సరికొత్త అనుభూతి చెందుతారు.  ఈ మూవీకి సంబంధించిన సెకండ్ పోస్ట‌ర్ పౌరాణిక ప్రపంచాన్ని తెలియజేస్తుంది. ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచే అంశాలు ఎన్నో ఈ సినిమాలో ఉండ‌బోతున్నాయి” అని సుధీర్ బాబు వెల్లడించారు. 

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘జటాధర’

‘జటాధర’ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. నిర్మాత‌లు ప్రేర‌ణ అరోరా, శివివ‌న్ నారంగ్‌, నిఖిల్ నంద‌, ఉజ్వ‌ల్ ఆనంద్ ఈ సినిమా కోసం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఖర్చు చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అటు నెగెటివ్ రోల్ కు సంబంధించి కూడా బాలీవుడ్ యాక్టర్ ను తీసుకుంటున్నట్లు సమాచారం. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. 

ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ‘జటాధర’

‘జటాధర’ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వెంకట్ కల్యాణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్  త్వ‌ర‌లో హైద‌రాబాద్‌లో ప్రారంభం కానుంది.  ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నారు. 2025లో విడుద‌లకు సిద్ధ‌మ‌వుతున్న ‘జటాధర’ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఇప్పటి నుంచే రెడీ అవుతున్నారు. రీసెంట్ గా ‘హరోం హర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు సుధీర్ బాబు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా ఆడింది.  అక్టోబ‌ర్ 11న ‘మా నాన్న సూప‌ర్ హీరో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకురానున్నారు.

Read Also: ‘దేవర’ చివరి 30 నిమిషాలు మరో లెవల్... ఆలియాతో ఎన్టీఆర్ ఇంటర్వ్యూ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manchu Family Issue: మంచు ఫ్యామిలీలో చల్లారని వివాదం- మరోసారి పోలీస్‌స్టేషన్‌కు మనోజ్‌
మంచు ఫ్యామిలీలో చల్లారని వివాదం- మరోసారి పోలీస్‌స్టేషన్‌కు మనోజ్‌
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
AP CM Chandra Babu: పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
ఏపీలో పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manchu Family Issue: మంచు ఫ్యామిలీలో చల్లారని వివాదం- మరోసారి పోలీస్‌స్టేషన్‌కు మనోజ్‌
మంచు ఫ్యామిలీలో చల్లారని వివాదం- మరోసారి పోలీస్‌స్టేషన్‌కు మనోజ్‌
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
AP CM Chandra Babu: పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
ఏపీలో పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
PV Sindhu Meets Pawan Kalyan: సార్‌, పెళ్లికి రండీ! డిప్యూటీ సీఎం పవన్‌ను ఆహ్వానించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు
సార్‌, పెళ్లికి రండీ! డిప్యూటీ సీఎం పవన్‌ను ఆహ్వానించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు
Upcoming 5G Smartphones: వచ్చే వారం మార్కెట్లోకి మూడు బడ్జెట్ ఫోన్లు - రూ.9 వేలలోపే 5జీ మొబైల్ కూడా!
వచ్చే వారం మార్కెట్లోకి మూడు బడ్జెట్ ఫోన్లు - రూ.9 వేలలోపే 5జీ మొబైల్ కూడా!
Allu Arjun Meets Chiranjeevi: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
Embed widget