Janaki Kalganaledu October 10th : జెస్సిని వెనకేసుకొచ్చిన జ్ఞానంబ, నోరెళ్ళబెట్టిన మల్లిక - చదువుపై అశ్రద్ధ చేస్తున్న జానకి
జానకి కలగనలేదు సీరియల్ ఈరోజూ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
దసరా నవరాత్రుల పూజలో ఎలా ఉండాలో జానకి జెస్సీకి వివరంగా చెప్తుంది. తెల్లారగానే జెస్సి చక్కగా తల స్నానం చేసి కిచెన్ లో పని చేసేందుకు రెడీ అవుతుంది. అది జ్ఞానంబ చూస్తుంది. దేవుడకి నైవేద్యం సిద్ధం చేస్తుంది. అది మల్లిక చూస్తుంది. వంట చేయడం చూసి జ్ఞానంబ సంతోషిస్తుంది. జెస్సి చేసిన వంటలు చూసి మల్లిక నోరెళ్ళబెడుతుంది. పొద్దునే తలకి గుడ్డ చుట్టి చేస్తున్నావ్ ఏంటి కథ అని అడుగుతుంది. అమ్మవారికి ప్రసాదం చేస్తున్నా అని చెప్తుంది. చేసే పని చెడగొట్టి పోలేరమ్మతో చీవాట్లు పెట్టించాలి అని అనుకుంటుంది. ఈరోజు చేయాల్సిన ప్రసాదాలు ఇవి కాదు కందబం, శాఖాన్నం అని చెప్తుంది. కాదక్క జానకి అక్క నాకు చెప్పింది అని అని నవరాత్రులు ఏం ప్రసాదాలు చేయాలనేది జెస్సి చక్కగా చెప్తుంది. అది విని జ్ఞానంబ మురిసిపోతుంది.
మల్లిక బిత్తరపోతుంది. ఎలాగైనా దీన్ని చెడగొట్టాలి అని అనుకుంటుంది. ఏదైనా తేడా జరిగిందనుకో అత్తయ్యగారు ఊరుకోరు, ఇవన్నీ నీకు ఎందుకు అనవసరంగా తిట్లు తినడానికి కాకపోతే అని చెప్తుంటే జ్ఞానంబ కోపంగా మల్లిక అని అరుస్తుంది. అసలు ఏ విధంగానూ నీ నోటికి తాళం ఉండదా, పెళ్లై ఇన్ని రోజులైనా నీకేమి తెలియదు, తెలుసుకోవాలనే కోరిక లేదు నిన్నగాక మొన్న వచ్చి అన్నీ తెలుసుకుని ఏదో చేస్తుంటే అభినందించాల్సింది పోయి చెడగొట్టాలని అనుకుంటావా. నేను పూజ మొదలు పెట్టాలి అమ్మవారికి మాల కట్టి తీసుకురా అని చెప్తుంది. జానకి సమయం వృధా చేయకు వెళ్ళి చదువుకో అని చెప్తుంది. జెస్సి చాలా సంతోషంగా ఉంటుంది. నువ్వు నీ చదువుని కూడా పక్కన పెట్టి నాకు ఇవన్నీ నేర్పించబట్టి అత్తయ్యగారు నన్ను మంచిగా చూశారు అని అంటుంది. అంటే రాత్రి కూడా జానకి గారు చదువు పక్కన పెట్టారన్న మాట అని రామా మనసులో అనుకుంటాడు.
Also Read: సూపర్ ట్విస్ట్, పూలదండలతో ఇంటికి వచ్చిన రిషిధార- ఖంగు తిన్న దేవయాని
పోలేరమ్మ దృష్టిలో జెస్సి కూడా మంచిది అయిపోతే నా గతి ఏంటి అని అనుకుంటుంది. అఖిల్ ని అస్త్రంగా వాడుకుని జెస్సిని కట్టడి చేయాలని ప్లాన్ వేస్తుంది. అఖిల్ దగ్గరకి వెళ్ళి పుల్లలు వేసేందుకు ట్రై చేస్తుంది. జెస్సి వల్ల నువ్వు మీ అమ్మకి శాశ్వతంగా దూరంగా ఉండాల్సి వస్తుందేమో అని నాకు అనిపిస్తుందని అంటుంది. జెస్సి మీ అమ్మగారికి దగ్గర అవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుందని చెప్తుంది. అత్తయ్యగారి దృష్టిలో మంచిదని అనిపించుకోడానికి ప్రయత్నాలు చేస్తుందని ఎక్కిస్తుంది. తను దగ్గర అవడంలో తప్పు లేదు కానీ ఆ కోపాన్ని తన మీద పోయేలా చేసుకోడానికి తప్పు నీదే అన్నట్లు చేస్తుంది, అలా అయితే మీ అమ్మగారి దృష్టిలో చెడ్డవాడివి అయిపోతావ్, నిజంగా జెస్సి మంచిదే అయితే మిమ్మల్ని దగ్గర చేయాలి కదా కానీ తాను అలా చేయకుండా స్వార్థంగా చేస్తుందని మంట పెట్టేస్తుంది.
రామా జానకి చదువు పక్కన పెడుతుందని అంటాడు. మిగతా వాటితో పాటు ఇంటి పనులు ముఖ్యమే కదా అని చెప్తుంది. సరిగా జానకి పుస్తకాలు తీసుకున్న టైమ్ కి జ్ఞానంబ వస్తుంది. మన ఇంట్లో ఇద్దరు కడుపుతో ఉన్నారు ఈ కుంకుమ పువ్వు వేసుకుని తాగితే పండంటి బిడ్డ పుడతారు. నువ్వే ఇది వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ఇస్తుంది. అదేదో నువ్వే ఇవ్వొచ్చు కదా అని చెప్తుంది. జానకి అయితే బాధ్యతతో రోజు కలిపి ఇస్తుందని చెప్తుంది. మల్లిక జెస్సీల విషయంలో ఇంకొంచెం బాధ్యత తీసుకోవాలని జానకి అనుకుంటుంది.
Also Read: మోనిత కుట్ర తెలుసుకున్న కార్తీక్- చుక్కలు చూపించిన దుర్గ, దీపకి అండగా నిలిచిన రాజ్యలక్ష్మి