Janaki Kalaganaledu November 9th: జానకి మీద నిందలు వేసిన రామా- కుప్పకూలిన జ్ఞానంబ, అవకాశంగా మలుచుకుంటున్న మల్లిక
అఖిల్ ని అరెస్ట్ చేయడంతో సీరియల్ కీలక మలుపు తిరిగింది. ఈరోజూ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
తను ఏ తప్పు చేయలేదని తన జీవితం నాశనం అవుతుందని పోలీసులు తీసుకెళ్తే అందరూ తనని నేరస్థుడులాగా చూస్తారని అఖిల్ జానకిని బతిమలాడతాడు. ఆ మాటకి రామా కూడా తప్పు చేయలేదని వాడి కన్నీళ్లే సాక్ష్యం చెప్తున్నాయ్ కేసు వెనక్కి తీసుకోమని జానకిని అడుగుతాడు. తప్పు చేసిన దాని కంటే ఆ తప్పు చేయలేదని తప్పించుకోవడం ఇంకా పెద్ద నేరం, నీ కన్నీళ్ళు ఇంట్లో అందరినీ ఏమార్చగలవేమో కానీ నిజాన్ని దాచలేవు, మాధురి మీద మర్డర్ అటెంప్ట్ చేసినట్టు ఒప్పుకోమని జానకి చెప్తుంది. వదిన ఎందుకు అన్నయ్య ఇలా నన్ను కేసులో ఇరికించాలని చూస్తుందని అఖిల్ రామాని బతిమలాడతాడు. వాడు అంతగా చెప్తున్నాడు కదా ఆలోచించండి అని రామా చెప్తున్నా వినిపించుకోకుండా అఖిల్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్లామని జానకి పోలీసులతో చెప్తుంది.
కానిస్టేబుల్స్ అఖిల్ ని బలవంతంగా తీసుకుని వెళ్లిపోతారు. ఇంట్లో వాళ్ళు ఆగమని చెప్తున్నా వినిపించుకోకుండా అఖిల్ ని లాక్కుని వెళ్లిపోతారు. దీన్ని అడ్డుపెట్టుకుని జానకిని ఒక ఆట ఆడుకోవాలి, అందుకు జెస్సిని బాల్ లా వాడుకోవాలి అని మల్లిక మనసులో అనుకుంటుంది. జెస్సి దగ్గరకి వెళ్ళి కావాలని జానకికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. జానకి తొందరపాటులో ఎవరినో చూసి మన అఖిల్ అని కంప్లైంట్ ఇచ్చి ఉంటుంది, నువ్వు ధైర్యంగా ఉండు నీకు తోడుగా మేము ఉన్నాం అని, జానకి తప్పు చేసిందని నిరూపించగలవు అని ఎక్కిస్తుంది. అఖిల్ మంచివాడో కాదో కానీ చెడ్డవాడు మాత్రం కాదు, ఆడపిల్ల మీద హత్యాప్రయత్నం చేసేంత దుర్మార్గుడు కాదు ఇప్పుడిప్పుడే మారుతున్నాడు, నువ్వే ఎక్కడో పొరపాటు పడి ఉంటావ్ దయచేసి కంప్లైంట్ విత్ డ్రా చేసుకోమని జెస్సి బతిమలాడుతుంది.
Also Read: బాబోయ్ తులసి అరాచకం- ఉసిగొల్పేందుకు చూసిన లాస్య, చురకలేసిన నందు
ఎప్పుడు కుటుంబం గురించి ఆలోచించే మీరు నాతో కూడా చెప్పకుండా ఎందుకు ఇంత ఆవేశపడి అఖిల్ ని అరెస్ట్ చేయించారని రామా అంటాడు. మేము ఇంత బాధపడుతుంటే మీ తొందరపాటు తనం ఎందుకు సమర్ధించుకుంటున్నారని అడుగుతాడు. కేసు వెనక్కి తీసుకోమని చెప్తాడు. అఖిల్ చెడ్డవాడు అనడం లేదు నా బిడ్డలాంటి వాడు, ఎంత కాదు అనుకున్నా ఇది నిజం. మాధురి అనే అమ్మాయిపై దాడి చేయడం నా కళ్ళారా చూశాను బంధం కంటే న్యాయం గొప్పది అందుకే కంప్లైంట్ ఇచ్చాను అంతేకానీ మిమ్మల్ని బాధపెట్టాలని కాదని జానకి చెప్పేసరికి జ్ఞానంబ కుప్పకూలిపోతుంది. అఖిల్ కి ఏమి కాదని అందరూ ధైర్యం చెప్పేందుకు చూస్తారు.
బాధతట్టుకోలేక అమ్మ మాట్లాడలేకపోతుంది, జెస్సి జీవితం కూడా ఆలోచించండి, హంతకుడి కుటుంబం అని మన మీద ముద్రపడితే వెన్నెలకి పెళ్లి కుదరడం కూడా కష్టం అని రామా నచ్చజెప్పడానికి చూస్తాడు. ఒక్కోసారి మనం చూసేది తప్పు అనిపిస్తుంది, మీరు భ్రమపడి అఖిల్ అనుకున్నారు ఏమో పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కేసు వెనక్కి తీసుకుందాం పదండి అని రామా చెప్తాడు. ఎవరు ఎన్ని చెప్పినా కూడా జానకి మాత్రం తన నిర్ణయం మార్చుకోకుండ గదిలోకి వెళ్ళిపోతుంది. రామా గారు కూడా నన్ను అర్థం చేసుకోకుండా ఉంటున్నారు ఎలా నచ్చజెప్పాలి అని జానకి అనుకుంటుంటే రామా వస్తాడు. ఎందుకు కేసు పెట్టారు అని అడుగుతాడు. జానకి కాలేజీలో జరిగిందంతా చెప్తుంది. మీరు చూసిన ఆధారాన్ని బట్టి అఖిల్ ఆ అమ్మాయిని చంపడానికి చూశాడు అనేడానికి గ్యారెంటీ లేదని అంటాడు.
Also Read: 'తప్పు చేస్తున్నావ్ నాన్న' మాధవ్ ని కడిగేసిన చిన్మయి- 'దేవి నా బిడ్డే' సత్యకి చెప్పిన ఆదిత్య