Janaki Kalaganaledu November 10th: జానకి గురించి చెడుగా చెప్పిన అఖిల్- అబద్ధం చెప్పి న్యాయం చేయమన్న రామా, కుమిలిపోతున్న జ్ఞానంబ
జానకి అఖిల్ మీద కేసు పెట్టి అరెస్ట్ చేయిస్తుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
మీరు చూసింది నిజమే కానీ అఖిల్ వంద శాతం ఆ నేరం చేశాడు అనడం కరెక్ట్ కాదని రామా జానకితో చెప్తాడు. ఈ ఇంటి కోడలిగా, అఖిల్ వదినగా ధర్మంగా ఆలోచించి ఒక అబద్ధం ఆడటంలో తప్పు లేదని అంటాడు. పురాణాల్లోనే ధర్మాన్ని గెలిపించడం కోసం అబద్ధాలు ఆడారు, మీరు కూడా ఇప్పుడు అదే ధర్మాన్ని పాటించాల్సిన అవసరం వచ్చింది, పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కేసు వెనక్కి తీసుకుందామని అంటాడు. కానీ జానకి అందుకు ఒప్పుకోవడం లేదు మీరేమి అనుకోవద్దని తెగేసి చెప్తుంది. జ్ఞానంబ, జెస్సి అఖిల్ కోసం బాధపడుతూ ఉంటారు. జానకి వచ్చి జ్ఞానంబతో మాట్లాడటానికి చూస్తుంది. మీరు ట్యాబ్లెట్స్ వేసుకోవాలి భోజనం చెయ్యాలి రండి అని పిలుస్తుంది. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ కటకటాల్లో ఉంటే నాకు ఎలా గొంతు దిగుతుంది, తనకేమి తినాలని అనిపించడం లేదని అంటుంది.
Also Read: నందు వాళ్ళని బకరాల్ని చేసిన పరంధామయ్య- సామ్రాట్ ని ఫుట్ బాల్ ఆడుకున్న పెద్దాయన
జానకి గోవిందరాజులు దగ్గరకి వెళ్తుంది కానీ ఆయన కూడా భోజనం వద్దని చెప్తాడు. చేసింది అంతా చేసి తినమంటే ఎవరి మాత్రం తినగలరు జానకి అని మల్లిక దెప్పిపొడుస్తుంది. అందరినీ తినడానికి రమ్మని ఒప్పించమని రామాని అడిగితే మా బాధ మీకు పట్టదు మీ సిద్ధాంతాలు మీకు ముఖ్యం కదా మీరే వెళ్ళి తినండి అని రామా వెళ్ళిపోతాడు. అఖిల్ జరిగిన దాని గురించి ఆలోచిస్తూ జానకిని తిట్టుకుంటాడు. రామా అఖిల్ ని కలిసేందుకు స్టేషన్ కి వస్తాడు. అఖిల్ ని సెల్ లో చూసి రామా ఎమోషనల్ అవుతాడు. నువ్వు వస్తే నన్ను ఇంటికి తీసుకెళ్లాడానికి అనుకున్నా ఓదార్చడానికా అని ఏడుస్తు నటిస్తాడు. చేయని తప్పుకి అరెస్ట్ అవ్వడం తట్టుకోలేకపోతున్నా అని బతిమలాడతాడు.
పెద్ద వదిన్ని నేను అమ్మ తర్వాత అమ్మ అనుకున్న కానీ తనకి ఎందుకు నా మీద కోపం, మొన్న మేము వేరుపడతాము అనేసరికి మమ్మల్ని చాలా మాటలు అన్నది. మాదేముంది మేము ఎలాగైనా బతికేస్తాము, విష్ణు మల్లిక వాళ్ళకి షాప్ ఉంది. మరి నువ్వు జెస్సిని, పుట్టబోయే బిడ్డని ఎలా చూసుకుంటావ్ అని నా మీద ఒత్తిడి తీసుకొచ్చింది. మంచికే కదా చెప్పింది అని నేను ఆలోచించాను. నేను ఎంతో నమ్ముకున్న వదిన ఇలా చేస్తుంటే మనసుకి చాలా కష్టంగా ఉందని అఖిల్ జానకికి వ్యతిరేకంగా మాట్లాడతాడు. నిన్ను ఎలాగైనా విడిపించుకుంటాను అని రామా అంటాడు. జానకిని ఒప్పించి కంప్లైంట్ వెనక్కి తీసుకునేలా చేస్తాను కేసు పెట్టొద్దని ఎస్సైని అడుగుతాడు.
Also read: అభిమన్యుని బ్లాక్ మెయిల్ చేసిన మాళవిక- నిజం తెలుసుకున్న వేద ఏం చేయబోతుంది?
మల్లిక ఆకలికి తట్టుకోలేక తింటుంటే విష్ణు వచ్చి తిడతాడు. నా కోసం కాదు కడుపులో బిడ్డ కోసం తింటున్నా అని నాటకం ఆడుతుంది. జ్ఞానంబ, గోవిందరాజులు అఖిల్ గురించి తలుచుకుని చాలా బాధపడుతూ ఉంటారు. తన భర్త తనని అపార్థం చేసుకున్నాడని జానకి కన్నీళ్ళు పెట్టుకుంటుంది. అప్పుడే రామా గదిలోకి వచ్చి జానకిని చూసి మాట్లాడకుండా వెళ్లిపోతాడు.