Janaki Kalaganaledu January 31st: జానకిని మెచ్చుకున్న గోవిందరాజులు - అసూయ పడుతున్న అఖిల్, మల్లిక
రామా చేసిన అప్పు వల్ల జ్ఞానంబ కుటుంబం కష్టాలు పడుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
రామా, జానకి స్వీట్ బండి పెట్టి వ్యాపారం మొదలుపెడతారు. ఇద్దరు వ్యక్తులు వచ్చి కాసేపు రామా, జానకిని పొగిడి స్వీట్స్ తీసుకుని వెళ్లిపోతారు. అది చూసి జానకి మురిసిపోతుంది. బండి గురించి ఆలోచిస్తూ చదువు మానేయవద్దు అని రామా అంటాడు. అది అదే ఇది ఇదే మధ్యలో చదువుకుందామని బుక్స్ కూడా తీసుకొచ్చాను అంటుంది. గోవిందరాజులు టైమ్ కి వేసుకోవాల్సిన మందులు అయిపోయాయని వెన్నెల చెప్తుంది. అన్నయ్య దగ్గరకి వెళ్ళి తీసుకుంటానులే అని అంటుంటే జ్ఞానంబ మాత్రం వద్దని అంటుంది. ఎందుకు వద్దంటున్నావ్ అని వెన్నెల అడుగుతుంది. సరే చిన్నన్నయ్యని అడుగుతాను అంటే గోవిందరాజులు వద్దని ఆపుతాడు.
ఇంట్లో రామా తప్ప మిగతా వాళ్ళు అందరూ బాధ్యత లేకుండా ఉంటున్నారు. పేరుకే కొడుకులు భారంగా బతకడం తప్ప బాధ్యతగా బతకడం తెలియని అప్రయోజకులు. ప్రతిదాన్ని రామాని అడగటం మంచిది కాదు. ఒక్కరోజు మందులు మింగకపోతే ఏమి చచ్చిపోనులే అని బాధగా అంటాడు. జానకి బండి దగ్గరే చలిలో కూర్చుని వీధి దీపం వెలుగులో చదువుకుంటూ ఉంటుంది. అది చూసి ఈ చలిలో ఎందుకు ఇంటికి వెళ్ళమని చెప్తాడు. అయితే నన్ను పంపించడం ఎందుకు చలిని పంపించండి అని అంటుంది. దీంతో రామా తన చేతులు రుద్ది వేడి పెడతాడు. తరవాత వేడి వేడి టీ తీసుకొచ్చి తనకి ఇస్తాడు. తన పట్ల భర్త చూపిస్తున్న ప్రేమకి జానకి మురిసిపోతుంది. బంగారం అని మెచ్చుకుంటుంది.
Also Read: మాళవిక చెంప పగలగొట్టిన వేద- భ్రమరాంబిక ముందు నిజం బట్టబయలు
ఇక ఇంటికి వెళ్దామని వచ్చిన డబ్బులు లెక్కపెడతారు. మొదటి రోజు మంచి వ్యాపారం జరిగిందని అనుకుంటారు. రామా వాళ్ళు రాకముందే ఇంట్లో అందరూ భోజనం చేస్తూ ఉండగా వెన్నెల మాత్రం అన్నావదిన కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అది చూసి ఎవరూ పట్టించుకోలేదని మనం పట్టించుకున్నట్టు కలరింగ్ ఇద్దామని అనుకుని వెన్నెలని భోజనానికి పిలుస్తుంది. అది చూసి మీకు జానకి వాళ్ళంటే చాలా ప్రేమ అని దెప్పుతుంది. అప్పుడే రామా, జానకి వస్తారు. ఈరోజు సంపాదన అని రామా డబ్బులు తల్లికి ఇస్తుంటే తను తీసుకోదు. ఇది మీ తొలిసంపాదన ఇవ్వాల్సింది నాకు కాదు నీ భార్య జానకి చేతికి అని చెప్తుంది. దీంతో రామా ఆ డబ్బులు జానకికి ఇస్తాడు. ఈ ఇంటి ఆడపడుచుకి ఇస్తాను అని వెన్నెలకి ఆ డబ్బులు ఇస్తుంది.
Also Read: దివ్యకి ఎమోషనల్ సెండాఫ్ ఇచ్చిన తులసి ఫ్యామిలీ- ఆస్తి కావాలని అడిగిన నందు
అది చూసి అఖిల్ తిట్టుకుంటాడు. మేము చేతగాని వాళ్ళం అని నిరూపించడానికి కావాలని వదిన ఇలా చేస్తుందని మనసులో అనుకుంటాడు. జానకి వంట చేస్తూ ఉంటుంది. గోవిందరాజులు తనని చూసి మెచ్చుకుంటాడు. తన లక్ష్యం కోసం చదువుకుంటుంది, భర్తకి సాయం చేస్తుంది, పెద్ద కోడలిగా బాధ్యతలు చేస్తుందని వెన్నెల అంటుంది. జానకి లాంటి కోడలు అదృష్టం చేసుకుంటే గాని రాదని అంటాడు. వంట చేసుకుని జానకి రామాకి క్యారేజీ తీసుకుని వెళ్తున్న అని చెప్తుంది. వెన్నెల సాయం కూడా తీసుకోవచ్చు కదా అని గోవిందరాజులు అంటాడు. ఇంటి ఆడపడుచు కష్టపడటం అంత మంచిది కాదని జానకి చెప్తుంది. అడిగినా కూడా మీ అత్తయ్య ఆశీర్వదించలేదు కదా అని అంతే గుళ్ళో దేవత చేతులు పెట్టె ఆశీర్వదిస్తుందా మనసుతో చేసే ఆశీర్వాదం గొప్పదని అంటుంది. జానకి రోడ్డు మీద వెళ్తుంటే తన స్నేహితురాలు కనిపిస్తుంది. వీల్ చైర్ లో కూర్చుని ఉన్న వాళ్ళని కూడా డాక్టర్ బాగు చేయగలడని చెప్తుంది.