Janaki Kalaganaledu January 27th: పరీక్షల్లో ఫెయిలైన జానకి- కొడుకులకి గడ్డి పెట్టిన గోవిందరాజులు
రామా చేసిన అప్పు వల్ల జ్ఞానంబ కుటుంబం కష్టాలు పడుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
తన తల్లి కోరిక నెరవేర్చడంలో సహాయం చేసినందుకుగాను రామా జానకిని మెచ్చుకుంటాడు. అత్త అమ్మలా చూసుకున్నా దూరం వెళ్లిపోవాలని చాలా మంది చూస్తారు. కానీ మా అమ్మ మిమ్మల్ని దూరం పెడుతున్నా ఆమె ప్రేమని క్షేమాన్ని కోరుకుంటున్న మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని రామా అంటాడు. ‘నిజమైన ప్రేమ ఎదుటి వాళ్ళ ద్వేషాన్ని కూడా ప్రేమిస్తుంది. అత్తయ్య మీద నాకున్న ప్రేమకి చాలా కారణాలు ఉన్నాయి. ఆవిడకు కొన్ని పద్దతులు ఉన్నాయి. తనకి చదువు ఇష్టం లేకపోయినా నా కోసం పాతికేళ్ళ పంతాన్ని పక్కన పెట్టారు. నన్ను కాలేజీలో జాయిన్ చేశారు. నాకు అండగా నిలబడ్డారు. అత్త అమ్మగా వేలు పట్టి నడిపించే అదృష్టం నాకు దక్కింది’ అని జ్ఞానంబ గురించి గొప్పగా చెప్తుంది. ఆ మాటలన్నీ జ్ఞానంబ వింటుంది.
Also Read: పండగపూట కలిసిన అన్నాచెల్లెళ్ళు- నిజం తెలిసి తులసి మీద చిందులేసిన నందు
ఈ భార్య దొరకడం నా అదృష్టం అని రామా మురిసిపోతాడు. స్వీట్ షాపులో పని దొరికిందని రామా చెప్తాడు. రేపటి నుంచి కాలేజీకి వెళ్ళమని అంటాడు. పని దొరికిందంటే సమస్యలన్నీ తీరిపోయినట్టే అంటుంది. మరుసటి రోజు జానకి కాలేజీకి వెళ్తుంది. కాలేజీ ప్రిన్సిపల్ జానకిని పిలిచి తను రాసిన టెస్ట్ లో యావరేజ్ మార్కులు వచ్చాయని, కొన్ని పేపర్స్ లో ఫెయిల్ అయ్యావని చెప్తుంది. చదువుకోవడం కుదరదు అంటే వదిలేసి మంచి ఇల్లాలిగా ఉండిపో అని అంటుంది. తన లక్ష్యం తనే దూరం చేసుకుంటునట్టు అవుతుందని జానకి బాధపడుతుంది. మల్లిక నిద్రలేచి కాఫీ కోసం చికితని పిలుస్తుంది. ఆరోగ్యం బాగోలేదని అందరితో పనులు చేయించుకోవడం అలవాటైపోయిందని గోవిందరాజులు అంటాడు. చికిత లేదని ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలని చెప్తాడు.
అబార్షన్ అయ్యేసరికి పని చేయలేకపోతున్నా అని మల్లిక అంటుంది. విష్ణు నిద్రలేచి దుప్పట్లు మడతపెడుతుంటే గోవిందరాజులు చూసి పిలుస్తాడు. ఆ పనులు ఆడవాళ్ళు చేస్తారు, పని వెతుక్కుని నాలుగు డబ్బులు సంపాదించుకోవాలని గడ్డి పెడతాడు. కుటుంబం కోసం కష్టపడమని చెప్తాడు. అది విని మల్లిక నోటికి పని చెప్తుంది. మొన్నటి వరకు మా ఆయన పని చేయలేదా? అని అఖిల్ చూసి ఖాళీగా తిని తిరిగే వాళ్ళని అనమని అంటుంది. ఆ మాటలకి అఖిల్ ఉక్రోషంగా ఉద్యోగం సంపాదించే వరకు ఇంట్లో తిండి కూడా తినను అని కోపంగా వెళ్ళిపోతాడు. విష్ణు, అఖిల్ ప్రవర్తనకి జ్ఞానంబ, గోవిందరాజులు బాధపడతారు. మంచి చెడులు చెప్పాల్సిన బాధ్యత మనదే కదా అని గోవిందరాజులు అంటాడు. చెప్తే విననప్పుడు చెప్పి ఏం ప్రయోజనమని జ్ఞానంబ అంటుంది.
Also Read: మాళవికకి అదిరిపోయే ఝలక్ ఇచ్చిన భ్రమరాంబిక- విన్నీని చూసి కుళ్ళుకుంటున్న యష్
కాలేజీలో మెటీరియల్ తీసుకుందామంటే డబ్బులు లేవని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే రామా ఫోన్ చేసి ప్రిన్సిపల్ ఫోన్ చేసిందని చెప్తాడు. పుస్తకాలు తీసుకోవాలంట కదా డబ్బులు తీసుకొస్తానులే అంటాడు. జానకి తన ఫ్రెండ్ దగ్గర మెటీరియల్ తీసుకుంటుంది. ఇంట్లో రోజు ఏదో ఒక గొడవ చేస్తేనే త్వరగా బయటపడొచ్చని డాన్స్ వేస్తుంది మల్లిక.