(Source: ECI/ABP News/ABP Majha)
Janaki Kalaganaledu February 15th: ఊహించని నిర్ణయం తీసుకున్న జ్ఞానంబ- జానకి, రామ సరసాలు
రామ చేసిన అప్పు తీర్చడం వల్ల జ్ఞానంబ కుటుంబం మళ్ళీ తమ సొంత ఇంటికి వచ్చేస్తుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
రామ అప్పు తీర్చడంతో పాత ఇంటికి మళ్ళీ అందరూ చేరతారు. జ్ఞానంబ సంతోషంగా ఇంట్లోకి వెళ్తుంది. మల్లిక మాత్రం తన ప్లాన్ ఫెయిల్ అయినందుకు ఏడుపు మొహం పెడుతుంది. మలయాళంకి ఇల్లు శుభ్రం చేయమని గోవిందరాజులు చెప్తాడు. నేను కూడానా అని మల్లిక అమాయకంగా అడుగుతుంది. నీకు హెల్త్ బాగోలేదు కదా అందుకే కర్ర తీసుకుని ఇల్లు శుభ్రంగా తుడవమని చెప్తాడు. ఇల్లంతా బూజు పట్టి ఉంటుంది. జ్ఞానంబ రాముడు, సీత విగ్రహాలు బూజు పట్టి ఉండటం చూసి వాటిని తీసుకుని తన చీర కొంగుతో క్లీన్ చేస్తుంది. అది చూసి జానకి వాళ్ళు సంతోషిస్తారు. వాళ్ళని క్షమించిందని సింబాలిక్ గా చూపించారు.
విష్ణు మల్లికకి చీపురు తీసుకొచ్చి ఇచ్చి మొదలుపెట్టు అని ఇచ్చేసి వెళ్ళిపోతాడు. పని నుంచి ఎలా తప్పించుకోవాలా అని మల్లిక ఆలోచిస్తూ అతి కష్టంగా పనులు చేస్తుంది. రామా, జానకి తమ గది క్లీన్ చేస్తూ ఉంటారు. విష్ణు మళ్ళీ వచ్చి చీపురు తీసుకుని ఇల్లు తుడిచే కర్ర ఇచ్చి తుడమని చెప్తాడు. తుడుస్తూ కాలు జారి కింద పడి కుయ్యో మొర్రో అని అంటుంది. విష్ణు వచ్చి జారి పడ్డావా ఏం కాలేదు కదా వెళ్ళి తుడువు ఏం కాదులే అంటాడు. జ్ఞానంబ మళ్ళీ విష్ణుని పిలిచి గొడవపడుతున్నారా, పని చేస్తున్నారా అని అడుగుతుంది. ఇదంతా జానకి వల్లే హాయిగా వేరు కాపురం పెడదామని అనుకుంటే ఈ జానకి టైమ్ కి వచ్చి ఆపేసిందని తిట్టుకుంటుంది.
Also Read: రాహుల్ స్కెచ్ సక్సెస్ పెళ్లి చూపుల నుంచి ఎస్కేప్ అయిన స్వప్న- ఎంట్రీ ఇచ్చిన కావ్య
ఇల్లు శుభ్రం చేస్తుంటే జానకి ఒంటికి రంగు అంటుకుంటుంది. అది తుడుస్తూ రామ కాసేపు పెళ్ళాంతో రొమాన్స్ చేస్తాడు. ప్రేమికుల రోజు గులాబీ పూలు ఇస్తే కాదని అత్తయ్య గారి మొహంలో సంతోషం కావాలని అడిగారు కదా ఇచ్చాను మరి నచ్చిందా అని అడుగుతుంది. చాలా రోజుల తర్వాత అమ్మ మొహంలో సంతోషం చూశాను చాలా థాంక్స్ అని చెప్తాడు. తనకి థాంక్స్ వద్దు ఒక హగ్ ఇచ్చి ముద్దు పెట్టి ఐ లవ్యూ చెప్పమని అడుగుతుంది. రామ జానకిని కౌగలించుకుని ప్రేమగా ముద్దు పెట్టి సిగ్గు పడుతూ ఐ లవ్యూ జానకి అని అంటాడు. తర్వాత జానకిని ముద్దు పెట్టమని అడుగుతాడు. పెట్టె టైమ్ కి జ్ఞానంబ పిలుస్తుంది.
ఇంట్లో దీపాలు వెలిగించమని జ్ఞానంబ కోడళ్లకి చెప్తుంది. ఈ ఇంటికి వెలుగు రావాలంటే మీరే వెలిగించాలని గోవిందరాజులు కూడా అంటాడు. ఇంటి పెద్ద కోడలిగా జానకి ముందుగా దీపం పెట్టి తర్వాత మల్లిక, జెస్సిలు పెడతారు. ఆనందంగా మన ఇంటి మీద ఎవరి కన్ను పడిందో వీధిన పడ్డాం, మాటలు పడ్డాం , జీవితం మనకు గుణపాఠం నేర్పించిందని జ్ఞానంబ అంటుంది. మళ్ళీ అలాంటి పరిస్థితి రాకూడదని ఒక నిర్ణయం తీసుకున్నట్టు జ్ఞానంబ చెప్తుంది. ఉమ్మడి కుటుంబంలో ఒకరి నిర్ణయాలు మరొకరికి నచ్చడం లేదని అందుకే వేర్వేరు కాపురం పెట్టిస్తున్నా, మీ గదుల్లో మీ కాపురాలు మీవి, గుమ్మం ఒకటే అయినా ఎవరి కాపురం వాళ్ళది, మీ జీతాలు మీ ఇష్టం.. ఉమ్మడిగా ఉన్న విడివిడిగా ఉందామని జ్ఞానంబ చెప్పేసరికి రామ వాళ్ళు షాక్ అవుతారు. కానీ మల్లిక మాత్రం సంబరపడుతుంది. నిర్ణయం మార్చుకోమని జానకి రామ అడుగుతారు కానీ నిర్ణయం మార్చుకునేది లేదని అంటుంది.
Also Read: నందు ప్లాన్ గోవిందా..! తులసికి కొన్న నెక్లెస్ లాస్య మెడలోకి
ఈ క్షణం నుంచి మీరు వేరుగానే ఉంటారు, మిగిలిన రోజుల్లో ఎలా ఉన్నా వారంలో ఒక్క రోజైనా అందరం కలిసి భోజనం చేయాలని చెప్తుంది. అందరూ ఎవరి పాటికి వాళ్ళు ఉండండి అని గోవిందరాజులు రామతో అంటాడు. మన ఇంటికి మనం వచ్చేశాం ఎప్పటిలాగా ఆనందంగా ఉంటాంఅని అనుకుంటే ఇలాంటి నిర్ణయం తీసుకున్నరేంటి అని జానకి వాళ్ళు బాధపడతారు.