Janaki Kalaganaledu December 8th: కడుపు పోయినట్టు నాటకం ఆడిన మల్లిక- రామాకి నిజం చెప్పిన జానకి, మాధురి కేసులో కన్నబాబు పాత్ర
జానకి మాధురి కేసు గురించి ఎంక్వైరీ చేస్తూ ఉండటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
జానకి మాధురి ఘటన జరిగిన ప్రదేశంలో ఉంగరం దొరుకుతుంది. దాన్ని తీసుకుని గోల్డ్ షాప్ కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తుంది. ఒక గోల్డ్ షాపు దగ్గరకి వెళ్ళి డీటైల్స్ అడుగుతుంది, కానీ అతను చెప్పేందుకు నిరాకరిస్తాడు. తను కాబోయే ఐపీఎస్ ఆఫీసర్ అని ఒక అమ్మాయి చావు బతుకుల్లో ఉందని తనకి న్యాయం చేసేందుకు వివరాలు ఇవ్వమని బతిమలాడుతుంది. దీంతో అతను ఉంగరం చూసి అది కార్పొరేటర్ సునంద కొడుకు కన్నబాబు కొన్నట్లు చెప్తాడు. అది విని జానకి షాక్ అవుతుంది. మాధురికి ప్రమాదం జరగడానికి కన్నబాబుకి కారణం ఏంటని ఆ విధంగా ఎంక్వైరీ చెయ్యాలని అనుకుంటుంది.
ఇంట్లో మల్లిక తన దొంగ కడుపు ఎక్కడ బయటపడుతుందో అని టెన్షన్ పడుతూ నీలావతిని రమ్మంటుంది. తనది దొంగ కడుపు అనే విషయం జానకికి తెలిసిందని చెప్పేసరికి నీలావతి భయపడి పారిపోతుంటే మల్లిక అడ్డుపడి ఆపుతుంది. ఇందులో తన పాత్ర ఉందని తెలిస్తే జ్ఞానంబ చంపేస్తుందని నీలావతి వణికిపోతుంది. తను చెప్పినట్టు చేస్తే కడుపు సంగతి తెలియకుండా బయటపడొచ్చని మల్లిక ఏదో ప్లాన్ చెప్తుంది. ఇంట్లో అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉండగా మల్లిక తన ప్లాన్ వర్కౌట్ చెయ్యడానికి రెడీ అవుతుంది. ఎవరు చూడకుండా మల్లిక నెల మీద నూనె పోసి దాని మీద కాలు వేసి జారి పడి పొట్ట మీద డైనింగ్ టేబుల్ కుర్చీ వేసుకుని నాటకం ఆడుతుంది.
Also read: వేద త్యాగాన్ని మెచ్చుకున్న కుటుంబం- మరో కుట్ర ప్లాన్ చేసిన మాళవిక
ఇక్కడ ఎవరో కొబ్బరి నూనె వేశారు కాలు జారి కిందపడిపోయాను అని అరుస్తుంది. పొట్ట పట్టుకుని నొప్పి అని అల్లాడిపోతునట్టు నటిస్తుంది. మల్లిక కిందపడేసరికి ఇంట్లో అందరూ కంగారుపడతారు. అప్పుడే నీలావతి వచ్చి హాస్పిటల్ కి వెళ్దామని తనని తీసుకుని వెళతారు. నీలావతి ఆరెంజ్ చేసిన డాక్టర్ తనని పరీక్ష చేసినట్టు నటిస్తుంది. మల్లికకి ఏమవుతుందో అని అందరూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. కడుపుకి దెబ్బ తగిలిందని విష్ణు చాలా కంగారుపడతాడు. డాక్టర్ బయటకి రాగానే మల్లిక గురించి ఆత్రంగా అడుగుతారు. కడుపుకి బలమైన దెబ్బ తగలడం వల్ల అబార్షన్ అయ్యిందని డాక్టర్ చెప్తుంది. అది విని అందరూ బాధపడతారు. జానకి మాత్రం అబార్షన్ అవడం ఏంటని అడుగుతుంది.
కడుపే లేని మనిషికి అబార్షన్ అవడం ఏంటని జానకి ఆలోచనలో పడుతుంది. నీలావతి డాక్టర్ కి డబ్బులు ఇచ్చి అలా చెప్పమని చెప్తుంది. జానకి నీలావతి వైపు కోపంగా చూస్తుంది. నర్స్ వచ్చి పేషెంట్ ని తీసుకెళ్లవచ్చని చెప్తుంది. కడుపు విషయం బయట పడుతుందని ఇంత డ్రామా ఆడారా అని అనుకుంటుంది. జ్ఞానంబ లోపలికి రాగానే మల్లిక ఏడుస్తున్నట్టు నటిస్తుంది. లేని కడుపు పోయిందని నాటకాలు ఆడి చాలా ఎక్స్ ట్రాలు చేస్తుందని మల్లిక వైపు జానకి కోపంగా చూస్తూ ఉంటుంది. జ్ఞానంబ వాళ్ళు చాలా బాధగా ఉంటారు.
Also Read: మాధురి కేసులో ఊహించని ట్విస్ట్, నేరం చేసిందెవరో కనిపెట్టిన జానకి- మల్లిక చెంప పగలగొట్టిన జ్ఞానంబ
తరువాయి భాగంలో..
మల్లిక కడుపు పోయిందని ఇంట్లో అందరూ చాలా బాధపడుతున్నారని రామా తన బాధని జానకితో పంచుకుంటాడు. అసలు మల్లిక కడుపుతోనే లేదని జానకి రామాకి చెప్పడంతో షాక్ అవుతాడు.