News
News
వీడియోలు ఆటలు
X

Janaki Kalaganaledu April 18th: జానకికి వార్నింగ్ ఇచ్చిన మధుకర్- అఖిల్ తో గొడవకు దిగిన జెస్సి

రామ అరెస్ట్ కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

రామ తన పక్కన ఉన్నట్టు ఊహించుకుంటుంది. రామతో జీవితం నిజంగా కంటే కలలోనే బాగుందని అనుకుంటూ ఉండగా జెస్సి వచ్చి పిలుస్తుంది. ఏం తినలేదు కనీసం పాలు అయినా తాగమని బతిమలాడుతుంది. అఖిల్ నిన్ను అన్నేసి మాటలు అన్నాడు. మనసు గాయపడేలా చేశాడు. నీ స్థానంలో వేరే వాళ్ళు ఉంటే తట్టుకోలేరు. ఇంత జరుగుతున్నా నీలో నువ్వు బాధపడుతున్నావ్ కానీ పైకి ఎందుకు చూపించడం లేదు. అఖిల్ చొక్క పట్టుకుని ఎందుకు నిలబడ్డావ్. మంచితనం ఉండాలి కానీ మరి ఇంతగా కాదు అని అంటుంది. కానీ జానకి మాత్రం ఎప్పటిలాగే తన స్టైల్‌లో హితబోధ చేస్తుంది. అవతలి మనిషి అర్థం చేసుకుని మనసు మార్చుకునే దాకా ఓపికగా ఎదురుచూడాలని హితబోధ చేస్తుంది. అఖిల్ కి బుద్ధి చెప్పమని అంటుంది.

సరే నువ్వు చేయకు నేనే చేస్తాను ఇంకోసారి నీగురించి అలా మాట్లాడొద్దని చెప్తానని ఆవేశంగా వెళ్ళిపోతుంది. జ్ఞానంబ ఇంకా పడుకుని ఉంటే జానకి వెళ్తుంది. వచ్చింది వెన్నెల అనుకుని మంచినీళ్లు అడుగుతుంది. రేపటి మీద ఆశ ఉంటేనే జీవితం ఆ ఆశ చచ్చిపోతే ఇక బతికి ఉండి ఏం ప్రయోజనమని బాధగా అంటుంది. జానకి మంచినీళ్లు ఇవ్వడం చూసి వాటిని తీసుకోడానికి నిరాకరిస్తుంది. నేను ఇచ్చే మంచినీళ్లు కూడా తీసుకోరా అని బాధగా అడుగుతుంది.

Also Read: రాజ్ ముందు కావ్యని చెడ్డదాన్ని చేసిన స్వప్న- భార్యని శాశ్వతంగా పుట్టింట్లో వదిలేసి వెళ్లిపోతాడా?

జ్ఞానంబ: నీలా నేను మనసుని రాయి చేసుకోలేదు

జానకి: మీరు నీరసంగా కనిపిస్తున్నారు హాస్పిటల్ కి వెళ్దాం

జ్ఞానంబ: నాకు కావలసింది మందులు కాదు నా రామ నా కళ్ల ముందు ఉండాలి. నా కొడుకు ఎప్పుడు వస్తాడు నేను పోయాక

జానకి: ఎందుకు అంత కఠినంగా మాట్లాడుతున్నారు

జ్ఞానంబ: ఒక అమాయకుడిని అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు. నీ సమస్య ఏంటి ఎందుకు దాస్తున్నావ్. రామ మీద పెట్టిన కేసు మామూలుది కాదు బయటకి రావడం కష్టమని మల్లిక చెప్తుంది కదా. సరే మల్లిక చెప్పేది నమ్మను నీ మాట నమ్ముతాను నా మీద ఒట్టేసి చెప్పు ఎలాంటి శిక్ష పడకుండా రేపో మాపో రామని విడిపించుకుని తీసుకుని వస్తానని

జానకి: ఇంత చిన్న విషయానికి ఒట్టు ఎందుకు

Also Read: వావ్.. ఒక్క పాటలోనే యష్ ని నడిపించేసిన వేద- భార్య ప్రేమ తెలుసుకుని మనసు మార్చుకుంటాడా?

అప్పుడే వెన్నెల జానకి ఫోన్ తీసుకొచ్చి ఇస్తుంది. ఫోన్ తీసుకుని టెన్షన్ గా పక్కకి వెళ్తుంది. ఆలోచించుకోవడానికి టైమ్ కావాలని అంటుంది. నీ మొగుడ్ని రక్షించుకోమని అవకాశం ఇస్తే నన్ను ఇరికించాలని చూస్తావ్ ఏంటి అది నీ వల్ల కాదని మధుకర్ అంటాడు. నన్ను బెదిరించినంత మాత్రాన ఆటలు సాగవని జానకి హెచ్చరిస్తుంది. నువ్వు రిజైన్ చేసిన వెంటనే నా వెంచర్ లో డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఇస్తానని ఆశ చూపిస్తాడు. గడువు ఇచ్చే వరకు ఆగమని చెప్తుంది కానీ మధుకర్ మాత్రం పని అయ్యేదాక చేస్తూనే ఉంటానని అంటాడు. జానకి ఎవరితో ఫోన్లో మాట్లాడిందా అని మల్లిక ఆలోచిస్తుంది. ఏదో జరుగుతుంది జానకి టెన్షన్ పడుతున్నప్పుడు ఇంట్లో ఉపద్రవం వస్తుందని అనుకుంటుంది.

జెస్సి బట్టలు సర్దుకుంటుంటే ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతాడు. పుట్టింటికి వెళ్లిపోతున్నా నన్ను అడ్డం పెట్టుకుని జానకి అక్కని ఎందుకు తిడుతున్నావని నిలదీస్తుంది. జెస్సి, అఖిల్ పోట్లాడుకోవడం విని జ్ఞానంబ, జానకి వాళ్ళు వస్తారు. వదిన మన మధ్య దూరుతుందని అంటాడు. జానకి వచ్చి ఏంటి జెస్సి అంటే ఇది మా భార్యాభర్తల మధ్య సమస్య ఎవరు కల్పించుకోవద్దని చెప్తుంది. నన్ను పరాయి వాడిలా చూస్తున్నారు నేను నీ కడుపున పుట్టానా లేదంటే దొరికానా అని అఖిల్ తల్లిని నిలదీస్తాడు. మా అమ్మానాన్నలకు నన్ను దూరం చేశావ్, అన్నయ్యకి దూరం చేశావ్. ఇప్పుడు నా భార్యని దూరం చేసి నా కాపురం కూలుస్తావా వదిన అని జానకిని తిడతాడు.

Published at : 18 Apr 2023 10:52 AM (IST) Tags: janaki kalaganaledu serial today episode Janaki Kalaganaledu Serial Written Update Janaki Kalaganaledu Serial Janaki Kalaganaledu Serial April 18th Update

సంబంధిత కథనాలు

Vimanam Movie Review - 'విమానం' రివ్యూ : ఏడిపించిన సముద్రఖని, వేశ్యగా అనసూయ - సినిమా ఎలా ఉందంటే?

Vimanam Movie Review - 'విమానం' రివ్యూ : ఏడిపించిన సముద్రఖని, వేశ్యగా అనసూయ - సినిమా ఎలా ఉందంటే?

రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కలిసిన సమంత, ‘సిటాడెల్’ టీమ్ - ఇండియాలో కాదు

రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కలిసిన సమంత, ‘సిటాడెల్’ టీమ్ - ఇండియాలో కాదు

హీరో విజయ్ కీలక నిర్ణయం - ఆ విద్యార్థులకు సాయం

హీరో విజయ్ కీలక నిర్ణయం - ఆ విద్యార్థులకు సాయం

Ranbir Kapoor: రణబీర్ కపూర్ మంచి మనసు - వారికి 'ఆదిపురుష్' టికెట్లు ఫ్రీ!

Ranbir Kapoor: రణబీర్ కపూర్ మంచి మనసు - వారికి 'ఆదిపురుష్' టికెట్లు ఫ్రీ!

Leo Movie: విజయ్ ‘లియో’లో కమల్ హాసన్ - లోకేష్ కనగరాజ్ కొత్త ప్లాన్?

Leo Movie: విజయ్ ‘లియో’లో కమల్ హాసన్ - లోకేష్ కనగరాజ్ కొత్త ప్లాన్?

టాప్ స్టోరీస్

Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం

Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం

Ambati Rayudu : జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?

Ambati Rayudu :  జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?

CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం