Janaki Kalaganaledu September 2nd: న్యాయం చేస్తానని జెస్సీకి మాటిచ్చిన జానకి- జెస్సీతో కలిసున్న ఫోటోలు జానకి ఫోన్లో డిలీట్ చేసిన అఖిల్
అఖిల్ గర్ల్ ఫ్రెండ్ జెస్సి ప్రగ్నెంట్ అనే విషయం జానకికి తెలిసిపోతుంది. దీంతో కథనం ఉత్కంఠగా మారింది.
జానకిని చూసి అఖిల్ అంతగా టెన్షన్ పడుతున్నాడేంటి సంథింగ్ ఈజ్ రాంగ్ అదేంటో కనిపెట్టాలి అని మల్లిక అనుకుంటుంది. వదినకి ఎంత చెప్తున్న వినడం లేదు ఇప్పుడు ఏం చెయ్యాలని ఆలోచిస్తాడు అఖిల్. క్యారమ్స్ ఆటలో అఖిల్ గెలిచేలాగా రామా చేస్తాడు. అది చూసి జ్ఞానంబ ‘అఖిల్ సంతోషం కోసం రామా వాడికి కావాల్సినవన్నీ వదులుకుంటూనే ఉన్నాడు, అఖిల్ చదువు కోసం తన చదువుని త్యాగం చేసి తనలో వాడిని చూసుకుంటున్నాడు మన కుటుంబ గౌరవాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళతాడని నాతో చాలా సార్లు చెప్పాడు కూడా తమ్ముడు అంటే రామాకి అంత ప్రేమ వాడు బాధపడినా ఓడిపోయిన అసలు తట్టుకోలేడు అని చెప్తుంది.
తప్పు చేసిన వాడే తప్పించుకుని తిరుగుతూ ఉంటాడు, అందుకే అఖిల్ క్యారమ్స్ ఆడుతూ నా నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు అని జానకి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే రామా జానకి కోసం గాజులు బహుమతిగా తీసుకుని వస్తాడు. వాటిని ఇచ్చి నచ్చాయా అని అడుగుతాడు. మీరు ఇంత ఇష్టంగా ఇచ్చినప్పుడు నచ్చకుండా ఎలా ఉంటాయని జానకి అంటుంది. రామానే స్వయంగా ఆ గాజులు జానకి చేతికి తొడిగి ముద్దు పెట్టి మురిసిపోతాడు. జానకి మాత్రం జెస్సి గురించి ఆలోచిస్తే పరధ్యానంగా ఉంటుంది. వాళ్ళు సంతోషంగా ఉండటం చూసి మల్లిక కుళ్ళుకుంటుంది. నేను కూడా నా మొగుడితో గాజులు వేయించుకుంటా అని విష్ణు దగ్గరకి వస్తుంది. విష్ణు గురక పెట్టి నిద్రపోవడం చూసి చెంబుడు నీళ్ళు తీసుకొచ్చి మొహం మీద కొడుతుంది. అమ్మో వాన అని విష్ణు ఉలిక్కిపడి లేస్తాడు. నా మీద మీకు అసలు ప్రేమే లేదని మల్లిక ఏడుపు మొదలుపెడుతుంది. దీంతో విష్ణు తనని బుజ్జగిస్తాడు.
Also Read: గుప్పెడంతమనసులో ఉప్పెనంత ప్రేమ, ఏడిపించేసిన రిషి - ఇక దేవయాని,సాక్షి పనైపోయినట్టేనా!
జెస్సి జానకికి ఫోన్ చేస్తుంది అది అఖిల్ చాటుగా వింటాడు. కడుపుతో ఉన్న నీకు న్యాయం చేస్తాను అని జానకి అంటుంటే విని అబ్బా చెప్పేసిందని అఖిల్ అనుకుంటాడు. ఎలాగైనా ఈ గండం నుంచి నువ్వే బయటపడేయాలని జెస్సి అడుగుతుంది. మీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు నాకు పంపించావ్ కదా వాటిని సాక్ష్యంగా చూపించి ఏదో ఒకటి చేస్తానులే అని జానకి మాట ఇస్తుంది. జెస్సి ప్రగ్నెంట్ అనే విషయం వదినకి తెలిసిపోయింది అందుకే నన్ను కోపంగా చూస్తుంది, మేమిద్దరం కలిసి ఉన్న ఫోటోలు కూడా వదిన ఫోన్లో ఉన్నాయి వాటిని ఎలాగైనా డిలీట్ చెయ్యాలి అని అఖిల్ అనుకుంటాడు. ఫోటోస్ డిలీట్ చెయ్యడానికి అఖిల్ అందరూ నిద్రపోయిన తర్వాత జానకి వాళ్ళ గదిలోకి వస్తాడు. జానకి ఫోన్ తీసుకుని ఆ ఫోటోస్ డిలీట్ చేస్తాడు. జానకి గదిలో నుంచి బయటకి రాగానే అక్కడ జ్ఞానంబ కనిపిస్తుంది. ఈ టైం లో ఇక్కడ ఏం చేస్తున్నావ్ అని అడుగుతుంది. చదువుకుందామని చెప్పి వచ్చాను అని కవర్ చేస్తాడు. అది విని జ్ఞానంబ మురిసిపోతుంది.
Also Read: యష్, వేదని విడదీసేందుకు అభిమన్యు కుట్ర - ఆదిత్యని ఖుషి స్కూల్ లో చేరాడని తెలిసి భయపడుతున్న మాలిని
నేను బాగా చదువుకుంటున్నా అని అమ్మ బాగా నమ్మకంగా ఉంది, పొరపాటున జెస్సి ప్రగ్నెంట్ అని విషయం తెలిసిందంటే నా తోలు వలిచేస్తుందని అఖిల్ భయపడతాడు. అఖిల్ చదువుకుంటున్నాడని అనుకుని టీ తీసుకొచ్చి ఇస్తుంది జ్ఞానంబ.