News
News
X

Janaki Kalaganaledu September 1st: అబార్షన్ చేయించుకోమన్న అఖిల్, ప్రెగ్నెన్సీ సంగతి తెలుసుకున్న జానకి - విషయం పసిగట్టిన మల్లిక

అఖిల్ జెస్సి ప్రేమాయణం గురించి జానకికి తెలిసిపోతుంది. దీంతో కథనం ఉత్కంఠగా మారింది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 

జెస్సి అఖిల్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా మీ ఇంట్లో మాట్లాడావా, మన పెళ్ళికి ఒప్పించావా అని జెస్సి ఆత్రంగా అడుగుతుంది. చాలా రకాలుగా ఇంట్లో చెప్పడానికి ప్రయత్నించాను కానీ చదువు పూర్తి కాకుండా ఇంట్లో మన పెళ్లి విషయం చెప్తే ఇప్పుడే కాదు తర్వాత కూడా అమ్మ మన పెళ్ళికి ఒప్పుకోదు, మన స్టడీస్ కంప్లీట్ అయ్యాక మన పెళ్ళికి ఒప్పిస్తాను. ఇప్పుడు నువ్వు అబార్షన్ చేయించుకో’ అని చెప్తాడు. ఆ మాటకి జెస్సి షాక్ అవుతుంది. ఇప్పటికే మా అమ్మా నాన్న చాలా కోపంగా ఉన్నారు, వాళ్ళు ఇక నన్ను చంపేస్తారు. ఇంట్లో వాళ్ళ మానసిక పరిస్థితి ఎంతో అర్థం చేసుకో అని జెస్సి బతిమలాడుతుంది. అబార్షన్ చేయించుకోడం కుదరదు  మనం పెళ్లి చేసుకోవడం తప్ప వేరే దారి లేదని జెస్సి అంటుంది.

ఎంత బతిమలాడినా మా అమ్మ ఒప్పుకోదు, అయినా నువ్వు ఇలాగే పట్టుబడితే నాకు చావే గతి. నన్ను ప్రేమించింది నిజం అయితే నేను నీకు కావాలని అనుకుంటే నేను చెప్పినట్టు విను లేదంటే నేను ప్రాణాలు తీసుకోవడం ఖాయం అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ మాటకి జెస్సి ఏడుస్తూ ఉంటుంది. జెస్సి పరధ్యానంగా నడుచుకుంటూ వస్తుంటే కారు ఢీ కొట్టబోతుంది. సమయానికి జానకి చూసి పక్కకి లాగేస్తుంది. ఆడపిల్ల ప్రేమించడం తప్పు కాదేమో కానీ తొందరపడి ప్రెగ్నెన్సి తెచ్చుకోవడం తప్పే అక్కా జెస్సి జానకితో చెప్తుంది. ఏం మాట్లాడుతున్నావ్ జెస్సి అని జానకి అడుగుతుంది అఖిల్ వల్ల నాకు కడుపు వచ్చింది. మేమిద్దరం తొందరపడ్డాం అని ఏడుస్తుంది. తనకి అంటే బుద్ధి లేదు ఆడపిల్లవి నీ బుద్ధి ఏమైందని జానకి తిడుతుంది.

Also Read: మాధవ్ పని అయిపాయే- దొంగ తండ్రి గురించి నిజం తెలుసుకున్న దేవి

అఖిల్ కి ఈ విషయం చెప్పి పెళ్లి చేసుకోమని అడిగితే అబార్షన్ చేయించుకోమని చెప్పాడని చెప్తుంది. అక్కా నేను నెల తప్పిన విషయం మా ఇంట్లో తెలిసిపోయి నన్ను కొట్టారు నువ్వే ఏదో ఒక పరిష్కారం చూడమని జెస్సి ఏడుస్తుంది. నువ్వు ఏడవకు నేనే ఏదో ఒకటి చేస్తాను మీరిద్దరు ప్రేమించుకున్నట్టు ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా అని అడుగుతుంది. జెస్సి అఖిల్ తో దిగిన ఫోటోస్ చూపిస్తుంది. జానకి ఇంటికి వచ్చేసరికి అప్పుడే అఖిల్ కూడా వస్తాడు. అఖిల్ అని కోపంగా పిలుస్తుంది. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావని అడుగుతుంది.. కానీ అఖిల్ తప్పించుకోవాలని చూస్తాడు. ఆకలిగా ఉంది తింటాను వదిన ముందు అనేసి ఇంట్లోకి వెళ్తాడు. నువ్వు వచ్చే వరకు నేను ఇంట్లోకి రాను ఇక్కడే ఉంటాను త్వరగా రమ్మని అంటుంది.  

అఖిల్ ఇంట్లో వాళ్ళతో సరదాగా ఆడుకుంటూ ఉంటాడు. అఖిల్ కోసం జానకి ఇంటి బయటే ఉండిపోతుంది. ఎంతకీ రాకపోయేసరికి జానకి ఇంట్లోకి వచ్చేస్తుంది. లోపలికి వచ్చి ఆడుతున్న అఖిల్ చెంప చెల్లుమనిపిస్తుంది. అది చూసి అంతా షాక్ అవుతారు. జానకి అని జ్ఞానంబ పిలుస్తుంది. రామా వచ్చి జానకి మీద చెయ్యి వేసేసరికి అప్పుడే అదంతా కల అనుకుంటుంది. జానకిని చూసి అఖిల్ ఇబ్బంది పడటాన్ని మల్లిక పసిగట్టేస్తుంది.

Also Read: యష్ ప్రాజెక్ట్ అభి చేతికి- స్కూల్ లో యష్ ని చూసి కోపంతో అలిగిన ఖుషి, వేద

Published at : 01 Sep 2022 10:19 AM (IST) Tags: Janaki Kalaganaledu Serial Today Episode Written Update Janaki Kalaganaledu Serial Janaki Kalaganaledu Serial Today Janaki Kalaganaledu September 1st

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: జంబలకిడి పంబలా శ్రీహాన్, పిచ్చోడిలా సూర్య, ఫైమాకు సీక్రెట్ టాస్క్ - బిగ్‌బాస్ హౌస్‌లో ఫన్ మామూలుగా లేదు

Bigg Boss 6 Telugu: జంబలకిడి పంబలా శ్రీహాన్, పిచ్చోడిలా సూర్య, ఫైమాకు సీక్రెట్ టాస్క్ - బిగ్‌బాస్ హౌస్‌లో ఫన్ మామూలుగా లేదు

Nagarjuna Bigg Boss 6 : 'బిగ్ బాస్ 6' టీఆర్పీపై నాగార్జున కామెంట్

Nagarjuna Bigg Boss 6 : 'బిగ్ బాస్ 6' టీఆర్పీపై నాగార్జున కామెంట్

ఎన్టీఆర్ సినిమాలు చూసి నేర్చుకోండి - ‘ఆదిపురుష్’ దర్శకుడిపై ‘కేజీఎఫ్’ నటి ఆగ్రహం

ఎన్టీఆర్ సినిమాలు చూసి నేర్చుకోండి - ‘ఆదిపురుష్’ దర్శకుడిపై ‘కేజీఎఫ్’ నటి ఆగ్రహం

Dussehra 2022 Celebrations: కేజ్రీవాల్‌తో కలిసి రావణ సంహారం చేయనున్న 'ఆదిపురుష్'!

Dussehra 2022 Celebrations: కేజ్రీవాల్‌తో కలిసి రావణ సంహారం చేయనున్న 'ఆదిపురుష్'!

Adipurush Teaser Controversy: ‘ఆదిపురుష్’ దర్శకుడిపై హోం మంత్రి ఆగ్రహం - ఆ సీన్లు తొలగించకపోతే చర్యలు తప్పవు

Adipurush Teaser Controversy: ‘ఆదిపురుష్’ దర్శకుడిపై హోం మంత్రి ఆగ్రహం - ఆ సీన్లు తొలగించకపోతే చర్యలు తప్పవు

టాప్ స్టోరీస్

Munugode TRS : మునుగోడులో మోహరించనున్న 86 మంది ఎమ్మెల్యేలు - హరీష్ రావుకే కీలక బాధ్యతలిచ్చిన కేసీఆర్ !

Munugode TRS :  మునుగోడులో మోహరించనున్న 86 మంది ఎమ్మెల్యేలు - హరీష్ రావుకే కీలక బాధ్యతలిచ్చిన కేసీఆర్ !

IND vs SA 3rd T20: మూడో టీ20 టాస్‌ మనదే! రోహిత్‌ ఏం ఎంచుకున్నాడంటే?

IND vs SA 3rd T20: మూడో టీ20 టాస్‌ మనదే! రోహిత్‌ ఏం ఎంచుకున్నాడంటే?

Jio 5G Launch: జియో దసరా ధమాకా! బుధవారమే 4 నగరాల్లో 5జీ స్టార్ట్‌! వెల్‌కం ఆఫర్‌ ఇదే!

Jio 5G Launch: జియో దసరా ధమాకా! బుధవారమే 4 నగరాల్లో 5జీ స్టార్ట్‌! వెల్‌కం ఆఫర్‌ ఇదే!

EC On Freebies : ఉచిత హామీల కట్టడికి ఈసీ కార్యాచరణ - నిధులెక్కడి నుంచి తెస్తారో కూడా చెప్పాల్సిందే !

EC On Freebies : ఉచిత హామీల కట్టడికి ఈసీ కార్యాచరణ - నిధులెక్కడి నుంచి తెస్తారో కూడా చెప్పాల్సిందే !