Janaki Kalaganaledu July 28th Update: చనిపోయేందుకు సిద్ధపడ్డ రామా, జానకి- మల్లిక చిందులు- జ్ఞానంబ వాళ్ళని క్షమిస్తుందా?
జానకి ఐపీఎస్ చదువుతున్న విషయం జ్ఞానంబకి తెలియడంతో కథనం ఉత్కంఠగా మారింది. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
నీకు ఈ అమ్మ బాధ అర్థం అయితే ఇంత దారుణంగా మోసం చేస్తావరా అని రామాని నిలదిస్తుంది జ్ఞానంబ. నీ బాధ అర్థం అయ్యింది నీకిచ్చిన మాట కోసమే జానకి గారిని చదివిస్తున్నాను అని రామా చెప్పడంతో ఏంటి నాకిచ్చిన మాట అని జ్ఞానంబ అడుగుతుంది. నీ భార్య ఇష్టాలేంటో తెలుసుకుని వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత నీ మీద ఉంది తను కంట తడి పెడితే భర్తగా నువ్వు ఒడిపోయినట్టే అని నువ్వు చెప్పావ్. ఐపీఎస్ అవ్వాలని తన చిన్న నాటి కోరికమ్మా పెళ్లి పేరుతో తన కలని నిలువునా కూలిపోయిందని తను ఎంతలా ఏడ్చినదో నేను కళ్ళారా చూశాను. ఐపీఎస్ కల దూరం అయితే తన ప్రాణం పోయినంతగా బాధపడింది. తను ఐపీఎస్ అవ్వకపోతే బతికినంత కాలం కంట తడి పెట్టుకుంటూనే ఉంటారు. అప్పుడు నేను ఒడిపోయినట్టే కదా అని రామా చెప్తాడు.
జ్ఞానంబ: నేను నీకు చెప్పింది భార్యని బాగా చూసుకోమని రా అందుకోసం అమ్మ భయంతో ఆడుకోమని కాదు. నువ్వు ఒకవేళ నువ్వు నా మాటకి కట్టుబడి ఉంటే తనని చదివిస్తున్న విషయం నాకు చెప్పి ఉండేవాడివి. నన్ను అబద్ధాలతో మభ్యపెట్టి మోసం చేసేవాడివి కాదు
జానకి: ఈ విషయం మీకు చెప్పాలని చాలాసార్లు అనుకున్నాం అత్తయ్యగారు.. కానీ ఒకవైపు పరిస్థితులు అనుకూలించకపోవడం అని అంటుంటే జ్ఞానంబ మాట్లాడకు అని అరుస్తుంది.
జ్ఞానంబ: నువ్వు అస్సలు మాట్లాడకు. చదువు అని నీ మనసులోకి కూడా రానివ్వని అని నాకు మాట ఇచ్చి తప్పి మోసం చేశావ్ అలాంటి నీకు మాట్లాడే అర్హత లేదు
రామా: జానకి గారి చదువు గురించి నీకు ముందే చెప్పాలని అనుకున్నాం కానీ నువ్వు ఎక్కడ ఒప్పుకోకపోతే తన ఐపీఎస్ కల ఎక్కడ కన్నీళ్లమయం అవుతుందేమో అని ఆగిపోయాను. అమ్మా నాకు ఒకే ఒక్క నమ్మకం ఉంది. తనని ఐపీఎస్ చెయ్యడం కోసం వాళ్ళ నాన్న ఎంత తపన పడ్డారో చెప్తే నువ్వు అర్థం చేసుకుంటావని. ప్రాణం పొయ్యే క్షణంలో కూడా వాళ్ళ నాన్నగారు ప్రాణం పోతున్నందుకు బాధపడలేదమ్మా తను లేకపోతే తన కూతురు భవిష్యత్ ఏమైపోతుందో అని భయపడ్డారు. కన్న పేగు బాధపడితే ఎలా ఉంటుందో నువ్వు అర్థం చేసుకుంటావని నా నమ్మకం అందుకే అమ్మా తన చదువు అయిపోయిన తర్వాత నీకు చెప్పాలని అనుకున్నాను. అంటే తప్ప నిన్ను మోసం చెయ్యాలని కాదు.
జ్ఞానంబ: ఆ రామచంద్రుడు ఈ తల్లి మాట జవదాటడు అని నమ్మకంతో ఉన్నా.. నా కొడుకు నాతో అబద్ధం చెప్పాడు ప్రాణం పోయిన ఇలా చేస్తాడు అనుకోలేదు. కానీ నా నమ్మకాన్ని ఒమ్ము చేశావు.
రామా: దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొమ్మా కోపం తెచ్చుకోకమ్మా
జ్ఞానంబ: కోపం కాదు నా పెంపకం మీద నాకే నమ్మకం పోయిందని అంటుంది. నా కొడుకు నా మాట దాటి ప్రవర్తించడానికి కారణం నువ్వే నా భయాన్ని అర్థం చేసుకోకపోవడానికి కారణం నువ్వే అని జానకిని అంటుంది.
Also Read: ఆదిత్య దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్న రుక్మిణిని దేవి చూస్తుందా? తండ్రిపై ద్వేషంతో రగిలిపోతున్న దేవి
రామా ఎంత చెప్పినా జ్ఞానంబ వినదు. దీంతో రామా చనిపోయేందుకు వెళ్లబోతుంటే జానకి ఆపేందుకు చూస్తుంది కానీ రామా వినడు. అత్తయ్యగారు వెనక్కి వచ్చేయమని చెప్పండి పిలవండి అని జానకి జ్ఞానంబ కాళ్ళ మీద పడి బతిమలాడుతుంది. అయిన జ్ఞానంబ కరగకపోవడంతో జానకి కూడా చావు అయిన బతుకయిన మీతోనే రామా గారు అని తన వెనకాలే వెళ్తుంది. ఆ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. రామా మునిగిపోయేందుకు సిద్దపడుతుంటే జ్ఞానంబ రామా.. అని పిలిచి వెనక్కి రమ్మని అంటుంది. ఇక ఇంట్లో జ్ఞానంబ కోసం అందరూ టెన్షన్ పడుతూ ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే జానకి, రామా, జ్ఞానంబ ఇంటికి వస్తారు.
కోపంగా జ్ఞానంబ వెళ్ళి తలుపేసుకుని బాధపడుతుంది. పోలేరమ్మ వీళ్ళని క్షమించేసిందేమో అని అనుకున్నా కానీ అలా జరగలేదు ఈ కోపం చాలు చిచ్చుపెట్టి చెలరేగిపోవడానికి అని మల్లిక మనసులో సంబరపడుతుంది. తన గదిలోకి వచ్చి డాన్స్ వేస్తూ తెగ సంతోషిస్తుంది. విష్ణు వచ్చి అది చూసి తిడతాడు. పెద్ద కోడలికి ప్రాధాన్యం ఇస్తూ చిన్న కోడలికి ప్రాధాన్యం ఇవ్వకపోతే ఎలా ఉంటుందో తెలుసా అని మల్లిక అంటుంది.
Also Read: పగిలిన మాళవిక బోనం, వేద కాలికి గుచ్చుకున్న గాజుపెంకు - అమ్మవారు ఎవరిని ఆశీర్వదించారు?