అన్వేషించండి

హీరో విజయ్ విడాకులు తీసుకుంటున్నారా?

ప్రముఖ తమిళ నటుడు ఇళయదళపతి విజయ్‌ దంపతులు విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఇందులో వాస్తవం ఎంతనేది తెలియాల్సి ఉంది.

‘వారిసు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విజయ్‌ గురించి ఓ విషయం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. విజయ్‌.. తన భార్య సంగీతతో విడిపోవాలని నిర్ణయించుకున్నారట. ఈ మేరకు విడాకులకు దరఖాస్తు చేసుకున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. విజయ్‌, సంగీతలకు వివాహమై 23 ఏళ్లు అవుతోంది. వీరికి కొడుకు జేసన్, కూతురు దివ్య ఉన్నారు.

ఇంతకీ ఈ రూమర్‌ ఎలా మొదలైందంటే.. విజయ్‌కి సంబంధించిన వికిపీడియా పేజీలో వారిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్లు రాసుందట. అంతేకాదు విజయ్‌ నటించిన ‘వారిసు’ సినిమా ఆడియో లాంచ్‌ కార్యక్రమానికి సంగీత రాకపోవడం, ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ, ప్రియ దంపతుల సీమంతం వేడుకకు కూడా విజయ్‌తో పాటు సంగీత రాకపోవడంతో ఈ వార్తలకు మరింత ఊతమిచ్చినట్లైంది.

అయితే సంగీత ప్రస్తుతం పిల్లలతో కలిసి అమెరికాలో విహారయాత్రను ఎంజాయ్‌ చేస్తున్నారని, అందుకే విజయ్‌తో కలిసి ఎటువంటి కార్యక్రమాలకు హాజరుకాలేకపోతున్నారని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. వారిసు ప్రొమోషన్స్‌లో భాగంగా విజయ్‌ తన భార్యతో కలిసి అమెరికా వెళ్లలేకపోయారని, సినిమా విడుదల కాగానే బ్రేక్‌ తీసుకుని భార్య, పిల్లల వద్దకు వెళ్తారని కోలీవుడ్ టాక్‌.

ఇప్పటికే కోలీవుడ్‌లో ధనుష్‌, ఐశ్వర్య దంపతుల విడాకుల విషయం ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేసింది. ప్రొఫెషనల్‌గా ఒకరికొకరు ఎంతో సపోర్ట్‌ ఇచ్చుకునే వారిద్దరూ ఇలా విడాకుల వరకు వెళ్లడం అత్యంత బాధాకరం అని ఫ్యాన్స్ కామెంట్లు చేశారు. అయితే తాము విడాకులు తీసుకోబోతున్నట్లు ఇద్దరూ సోషల్‌ మీడియాలో అధికారికంగా వెల్లడించినప్పటికీ కొన్ని రోజుల తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు సర్దుకున్నాయని, విడాకులు తీసుకోవాలన్న ఆలోచనను విరమించుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. దీని గురించి మాత్రం వారు ఇప్పటివరకు స్పందించలేదు.

ఇక విజయ్‌ దంపతుల విషయానికొస్తే.. అది విజయ్‌ గురించి అధికారికంగా వస్తేనే ఏ విషయం అనేది క్లారిటీగా తెలుస్తుంది. 1996లో వచ్చిన ‘పూవే ఉనక్కగ’ అనే సినిమా సమయంలో విజయ్‌.. సంగీతను మొదటిసారి కలుసుకున్నారు. సంగీత.. విజయ్‌కు వీరాభిమాని. చెన్నైలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోందని తెలిసి ఆమె ఏకంగా యూకే నుంచి విజయ్‌ను చూడటానికి వచ్చారు. తనకోసం అంత దూరం నుంచి వచ్చిన సంగీత అభిమానానికి విజయ్‌ ఫిదా అయిపోయారు. అంతేకాదు.. షూటింగ్ అయిపోయాక ఇంటికి రావాలని కూడా ఆహ్వానించారట. అలా వారిద్దరూ ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకు పెద్దలు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో 1999, ఆగస్ట్‌ 25న క్రైస్తవ, హిందూ సంప్రదాయాల్లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. 

Also Read: స్టేజ్ మీదనే ఎమోషనల్ అయిపోయిన ప్రభాస్ - కన్నీళ్లు ఆపుకోలేక!

ఇకపోతే విజయ్ నటించిన 'వారిసు' 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వంశీ పైడిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. థమన్‌ సంగీతం అందించారు. ఇందులో విజయ్‌కి జంటగా రష్మిక మందన నటించారు. జయసుధ, ప్రకాశ్‌రాజ్‌, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్‌కు మంచి టాక్‌ వచ్చింది. దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాను తెలుగులో 'వారసుడు' టైటిల్‌తో రిలీజ్‌ చేయబోతున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Romantic Web Series OTT : ఓటీటీలోకి OG నటుడి రొమాంటిక్ వెబ్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?... తెలుగులోనూ చూడొచ్చు
ఓటీటీలోకి OG నటుడి రొమాంటిక్ వెబ్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?... తెలుగులోనూ చూడొచ్చు
Suhas : హీరో సుహాస్ రంగు చూసి తెలుగు వారు విమర్శించారా? - తమిళ డైరెక్టర్ కామెంట్స్‌ కాంట్రవర్సీ... నెటిజన్స్ స్ట్రాంగ్ రియాక్షన్
హీరో సుహాస్ రంగు చూసి తెలుగు వారు విమర్శించారా? - తమిళ డైరెక్టర్ కామెంట్స్‌ కాంట్రవర్సీ... నెటిజన్స్ స్ట్రాంగ్ రియాక్షన్
Godavari Serial Today September 18th: 'గోదావరి' సీరియల్: నన్ను పెళ్లి చేసుకో డబ్బు ఇస్తా.. జానుతో సంజయ్‌ డీల్! జాను ఒప్పుకుంటుందా!
'గోదావరి' సీరియల్: నన్ను పెళ్లి చేసుకో డబ్బు ఇస్తా.. జానుతో సంజయ్‌ డీల్! జాను ఒప్పుకుంటుందా!
Irumudi OTT : థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి ఇరుముడి - 250 కోట్ల కలెక్షన్స్... ఎందుకు ఈ మూవీ చూడాలంటే?
థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి ఇరుముడి - 250 కోట్ల కలెక్షన్స్... ఎందుకు ఈ మూవీ చూడాలంటే?

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Human Trafficking Case: బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
AP Congress : ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
Irumudi OTT : థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి ఇరుముడి - 250 కోట్ల కలెక్షన్స్... ఎందుకు ఈ మూవీ చూడాలంటే?
థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి ఇరుముడి - 250 కోట్ల కలెక్షన్స్... ఎందుకు ఈ మూవీ చూడాలంటే?
Hyderabad Crime News: వనస్థలిపురంలో దారుణం.. కత్తితో నరికి పాల వ్యాపారిని హత్య చేసిన దుండగులు
వనస్థలిపురంలో దారుణం.. కత్తితో నరికి పాల వ్యాపారిని హత్య చేసిన దుండగులు
యువతకు నచ్చేలా అపాచీ, రోనిన్‌లో కొత్త టెక్నాలజీ ఫీచర్లు.. ధరలు ఎంతంటే?
యూత్‌ఫుల్‌ Apache, Ronin బైకుల్లో కొత్త వేరియంట్లు, కొత్త టెక్నాలజీ
Laptop Keyboard Cleaning : ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కొబ్బరి పీచు ఉందంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించిన TTD!
శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కొబ్బరి పీచు ఉందంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించిన TTD!
Embed widget