అన్వేషించండి

Unstopabble With NBK: స్టేజ్ మీదనే ఎమోషనల్ అయిపోయిన ప్రభాస్ - కన్నీళ్లు ఆపుకోలేక!

అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే రెండో సీజన్‌లో ప్రభాస్, గోపిచంద్ ఎపిసోడ్ రెండో భాగం విడుదల అయింది.

అన్‌స్టాపబుల్ రెండో సీజన్‌లో మోస్ట్ అవైటెడ్ ప్రభాస్ ఎపిసోడ్ రెండో భాగం వచ్చేసింది. మొదటి భాగం పూర్తిగా ఫన్ మోడ్‌లో సాగగా, రెండో భాగం మాత్రం ఫన్‌తో పాటు ఎమోషనల్‌గా కూడా సాగింది. ముఖ్యంగా రెబల్ స్టార్ కృష్ణంరాజు ప్రస్తావన వచ్చినప్పుడు ప్రభాస్ కూడా స్టేజీ మీద ఎమోషనల్ అయిపోయాడు. ప్రభాస్‌తో పాటు బాలకృష్ణ కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి.

గోపిచంద్ స్టేజీ మీదకు ఎంటర్ అవ్వడంతో ఈ ఎపిసోడ్ ప్రారంభం అవుతుంది. గోపిచంద్‌ను ప్రభాస్ పెళ్లి గురించి బాలకృష్ణ అడగ్గా, వచ్చే సంవత్సరం ఉండవచ్చేమో అని గోపిచంద్ సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత ప్రభాస్, గోపిచంద్‌లతో బాలకృష్ణ ఒక గేమ్ ఆడారు.

గోపిచంద్ తండ్రి టి.కృష్ణ ప్రస్తావన కూడా వచ్చింది. దీంతో పాటు ఫెయిల్యూర్స్‌లో ఉన్నప్పుడు ప్రభాస్, గోపిచంద్ ఎలా ఆలోచించారనే దానిపై కూడా బాలకృష్ణ ప్రశ్నించారు. మొదటి ఎపిసోడ్‌కు ఏ మాత్రం తగ్గని విధంగా ఆసక్తికరంగా ఈ రెండో ఎపిసోడ్ కూడా సాగింది.

ఈరోజు తాము ఈ పరిస్థితిలో ఉన్నామంటే పెదనాన్న వల్లే అని ప్రభాస్ అన్నారు.. ఆయనకు తామంతా రుణపడి ఉన్నామని ఎమోషనల్ అయ్యారు. తమ కుటుంబం అంతా పెదనాన్న మిస్ అవుతోందని ప్రభాస్ తెలిపారు. కృష్ణంరాజు అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో నెల రోజులు ఉన్నారని ప్రభాస్ తెలిపారు. అప్పుడు తానూ ఆసుపత్రిలో ఉన్నానని, నిరంతరం వైద్యులతో సంప్రదింపులు జరిపానని ప్రభాస్ పేర్కొన్నారు.

కృష్ణంరాజు మరణించిన సమయంలో తాను టర్కీలో ఉన్నారని బాలకృష్ణ తెలిపారు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'వీర సింహా రెడ్డి' చిత్రీకరణలో ఉండటంతో భారతదేశానికి ఆయన రాలేకపోయారు. ఆ విషయాన్ని గుర్తు చేసిన బాలకృష్ణ 'నాకు విషయం తెలియగానే కంట్రోల్ చేసుకోలేకపోయా. వెంటనే ఏడుపు వచ్చేసింది' అని చెప్పారు.

గతవారం విడుదల అయిన బాహుబలి ఎపిసోడ్ మొదటి భాగం స్ట్రీమింగ్ ప్రారంభమైన కాసేపటికే ఆహా సర్వర్లు క్రాష్ అయ్యాయి. ఎపిసోడ్ చూడాలని ఎంత ప్రయత్నించినా అభిమానులకు యాప్ ఓపెన్ కాలేదు. ఆ తర్వాత అర్థరాత్రి దాటాక సర్వర్లు రీస్టోర్ అయ్యాయి. అయితే రెండో ఎపిసోడ్‌తో ఆ ప్రమాదం రాలేదు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ahavideoin (@ahavideoin)

టాప్ హెడ్ లైన్స్

Renu Desai : 'అలా చేయడం ఇంకా అమానుషం' - రేణూ దేశాయ్ లేటెస్ట్ పోస్ట్ వైరల్
'అలా చేయడం ఇంకా అమానుషం' - రేణూ దేశాయ్ లేటెస్ట్ పోస్ట్ వైరల్
This Week OTT Web Series : ఈ వారం ఓటీటీ వెబ్ సిరీస్‌లు - తెలుగులో ఇది డోంట్ మిస్
ఈ వారం ఓటీటీ వెబ్ సిరీస్‌లు - తెలుగులో ఇది డోంట్ మిస్
Pawan Anna Konidela Divorce : పవన్ కల్యాణ్ అన్నా కొణిదెల డివోర్స్ - ఆమె బ్యాగ్రౌండ్, ఆస్తుల విలువ ఎంతంటే?
పవన్ కల్యాణ్ అన్నా కొణిదెల డివోర్స్ - ఆమె బ్యాగ్రౌండ్, ఆస్తుల విలువ ఎంతంటే?
This Week OTT Movies : శుక్రవారం ఓటీటీల్లో 12 సినిమాలు స్ట్రీమింగ్ - జైలర్ 2 To రణబాలి... ఇవి డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీల్లో 12 సినిమాలు స్ట్రీమింగ్ - జైలర్ 2 To రణబాలి... ఇవి డోంట్ మిస్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PRC ఆలస్యం..ఉద్యోగుల్లో అసంతృప్తి.. కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి!
PRC ఆలస్యం..ఉద్యోగుల్లో అసంతృప్తి.. కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి!
YSRCP On Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయవద్దు: క్యాడర్‌కు వైసీపీ అధినేత ఆదేశాలు
పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయవద్దు: క్యాడర్‌కు వైసీపీ అధినేత ఆదేశాలు
KA Paul: నేను ఆ పని చేస్తే వారం రోజుల్లోగా రేవంత్ రెడ్డి సీఎం పదవి పోతుంది: కేఏ పాల్ సంచలనం
నేను ఆ పని చేస్తే వారం రోజుల్లోగా రేవంత్ రెడ్డి సీఎం పదవి పోతుంది: కేఏ పాల్ సంచలనం
Makhana Benefits : రోజూ మఖానా తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే.. డైట్‌లో ఇలా చేర్చుకోండి
రోజూ మఖానా తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే.. డైట్‌లో ఇలా చేర్చుకోండి
Pawan Kalyan Divorce: పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకుల ప్రకటన ఇప్పుడు ఎందుకు చేశారంటే !
పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకుల ప్రకటన ఇప్పుడు ఎందుకు చేశారంటే !
Car Engine Problems: మిస్‌ఫైరింగ్ నుంచి 'చెక్ ఇంజిన్' లైట్ వరకు.. ఇంజిన్‌కు ప్రమాదం తెచ్చే 3 సమస్యలు ఇవే
కారు ఇంజిన్‌లో ఈ 3 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. సర్వీస్ సెంటర్‌కు మాత్రమే వెళ్లండి
Weight Loss Recipe : బరువు తగ్గాలనుకునేవారి నోరూరించే టేస్టీ రెసిపీ.. పనీర్, వెజిటెబుల్స్​తో ఈ రైస్ ట్రై చేయండి
బరువు తగ్గాలనుకునేవారి నోరూరించే టేస్టీ రెసిపీ.. పనీర్, వెజిటెబుల్స్​తో ఈ రైస్ ట్రై చేయండి
Congress Politics: 9 సార్లు ఛాన్స్ ఇచ్చిన కాంగ్రెస్.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా చిన్నారెడ్డి! అసలేం జరుగుతోంది?
9 సార్లు ఛాన్స్ ఇచ్చిన కాంగ్రెస్.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా చిన్నారెడ్డి! అసలేం జరుగుతోంది?
Embed widget