Hero Marriage: మరో హీరో పెళ్లి పీటలెక్కబోతున్నాడా? అక్కినేని వారి ఇంట పెళ్లి బాజాలు?
తెలుగు హీరో సుశాంత్ పెళ్లికి రెడీ అవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
తెలుగు హీరోల్లో మరో కథానాయకుడు పెళ్లికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అతను పెట్టిన సోషల్ మీడియా పోస్టు చూస్తే ఎవరికైనా ఈ అనుమానం రాకమానదు. కాళిదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో సుశాంత్ అనుమోలు. అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. అప్పట్నించి నిలదొక్కుకునేందుకు చాలా ప్రయత్నాలు చేసినా పెద్దగా కలిసిరాలేదు. కరెంట్, అడ్డా, ఆటాడుకుందాంరా... ఇలా ఏడెనిమిది సినిమాలు చేసినా ఒక్కటి హిట్ కొట్టలేదు. అల వైకుంఠపురం సినిమా హిట్ కొట్టినప్పటికీ అందులో ఆయన కేవలం ఒక సైడ్ క్యారెక్టర్లో నటించాడు. ఇక తాజా చిత్రం గతేడాది విడుదలైన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ఈ సినిమా ఓటీటీలో విడుదలైంది, కానీ మంచిటాక్ సంపాదించలేకపోయింది. ప్రస్తుతం సుశాంత్ చేతిలో మంచి ప్రాజెక్టులేవీ లేవు.
అతడు తాజాగా పెట్టిన పోస్టు వైరల్ గా మారింది. ఒకమ్మాయి తన చేయి పట్టుకున్న ఫోటోను పెట్టి, త్వరలో పూర్తి వివరాలు చెబుతాను అని క్యాప్షన్ పెట్టాడు. ‘న్యూ బిగినింగ్స్... నా సొంత నియమాలను బద్దలు కొట్టుకుని, మొదటిసారిగా ఒకటి కన్నా ఎక్కువ మార్గాల్లో ప్రయాణించబోతున్నా. మీ ఆశీస్సులు కావాలి’ అని రాసుకొచ్చారు. అక్కినేని అభిమానులు ‘పెళ్లి చేసుకోబోతున్నారు కదా, మాకు తెలుసు’ అంటూ కామెంట్లు పెట్టడం మొదలుపెట్టారు. ‘కంగ్రాట్యులేషన్స్’ అని మరికొందరు కామెంట్ చేశారు. మొత్తమ్మీద సుశాంత్ పెళ్లి కబురు చెబుతాడో, లేక ఇలాంటి సోషల్ పోస్టులతో జనాలను వెర్రోళ్లని చేసిన సెలెబ్రిటీలలో ఒకరిగా అవుతాడో చూడాలి.
New Beginnings!
— Sushanth A (@iamSushanthA) March 9, 2022
Breaking my own patterns and doing something for the first time in more ways than one!
Need your wishes 😊🙏
Details soon enough! pic.twitter.com/5aHZHo0ZzY
View this post on Instagram