Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?
ఈ వారం కూడా బిగ్ బాస్ హౌస్ నుంచి ఒకరు ఎలిమినేట్ కానున్నారు. నామినేషన్లలో మొత్తం తొమ్మిది మంది నిలిచారు.
బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్(Bigg Boss). ఇప్పటికే ఐదు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు ఆరో సీజన్ ను మొదలుపెట్టింది. ఈ సీజన్ మరింత రసవత్తరంగా సాగుతుంది. హౌస్ లోకి ఎంటర్ ఆయిన మొదటిరోజు నుంచే హౌస్ మేట్స్ గొడవ పడడం మొదలుపెట్టారు. ఐదు సీజన్లను చూసి షోలోకి రావడంతో చిన్న చిన్న విషయాలను కూడా గేమ్ పరంగా చూస్తున్నారు. కొంతమంది షోలోకి ఎంటర్ అయినప్పుడే గేమ్ మొదలెట్టేశారు. మరికొందరు మాత్రం ఇంకా పరిస్థితులను గమనిస్తూనే ఉన్నారు.
ఇప్పటికే రెండు వారాలను పూర్తి చేసుకుంది ఈ షో. మొదటి వారం ఎలిమినేషన్ లేనప్పటికీ.. రెండు వారం డబుల్ ఎలిమినేషన్ తో షాకిచ్చారు బిగ్ బాస్. షాని, అభినయ శ్రీ షో నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు మూడో వారం పూర్తి కాబోతుంది. ఈ వారం కూడా హౌస్ నుంచి ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ఈ వారం నామినేషన్లలో మొత్తం తొమ్మిది మంది నిలిచారు. వారెవరంటే.. వాసంతి, బాలాదిత్య, చంటి, ఆరోహి, నేహా చౌదరి, ఇనయా, శ్రీహాన్, రేవంత్, గీతూ.
వీరిలో రేవంత్, గీతూ తమ ఆటతీరుతో ఎక్కువ ఓట్లు సంపాదించుకున్నారు. బాలాదిత్యకి ఉన్న ఫాలోయింగ్ తో ఈ వారం ఆయన సేవ్ అయ్యే ఛాన్స్ ఉంది. చలాకీ చంటికి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి తెలిసిందే. కాబట్టి ఈ వారం ఆయన సేఫ్ అవ్వడం ఖాయం. శ్రీహాన్ కూడా ఓట్లు సంపాదించడంలో ముందంజలో ఉన్నారు. ఇక ఆరోహి, నేహా, ఇనయాలలో ఆరోహి కాస్తో కూస్తో తన ఆటతో జనాలను మెప్పించడానికి ప్రయత్నిస్తుంది.
Neha Chowdary Likely to be eliminated this week: ఇనయా అయితే తన ఆర్గ్యుమెంట్స్ తో కాస్త విసుగు తెప్పిస్తుంది. గేమ్ ఆమె చేసే గొడవ మాములుగా ఉండదు. నేహా చౌదరి అయితే తన పాయింట్ చెప్పడానికి ప్రయత్నిస్తుంది కానీ గేమ్ లో అతడి యాక్టివ్ గా ఉండడం లేదు. ముచ్చట్లు చెప్పే బ్యాచ్ లోనే ఆమె ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వారం ఇనయా ఎలిమినేట్ అవుతుందేమోనని అందరూ అనుకున్నారు కానీ ఊహించని విధంగా నేహా చౌదరి ఎలిమినేట్ అయిందని ప్రచారం జరుగుతుంది. అందరికంటే ఆమెకి తక్కువ ఓట్లు పడ్డాయని.. ఈసారి ఆమె హౌస్ ని వీడక తప్పదని అంటున్నారు. ఎవరు ఎలిమినేట్ కానున్నారో రేపటి ఎపిసోడ్ లో తేలనుంది.
నేహా కోసం బ్రియన్ లారా:
నేహా చౌదరిని కాపాడడం కోసం లెజండరీ క్రికెటర్ బ్రియన్ లారా రంగంలోకి దిగారు. సోషల్ మీడియా వేదికగా నేహాకి ఓట్లు వేయాలని కోరారు. బ్రియన్ లారా లాంటి స్టార్ క్రికెటర్ నేహా చౌదరికి సపోర్ట్ చేయడమేంటని.. అందరూ ఆశ్చర్యపోతున్నారు. వీరిద్దరికి ఎలా పరిచయం ఏర్పడి ఉంటుందా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. నేహా చౌదరి ఇదివరకు యాంకర్ గా, స్పోర్ట్స్ ప్రెజంటర్ గా పని చేశారు. ఇండియా క్రికెట్ మ్యాచ్ లకు తెలుగు కామెంట్రీ చేసే వ్యక్తుల్లో నేహా కూడా ఉన్నారు. అలా కామెంట్రీ చెప్పే సమయంలోనే బ్రియన్ లారాతో నేహాకి పరిచయం ఏర్పడి ఉంటుంది. అందుకే ఇప్పుడు ఆమెని సపోర్ట్ చేయడానికి బ్రియన్ లారా ముందుకొచ్చారు. మరి బ్రియన్ లారా సపోర్ట్ నేహాను కాపాడుతుందేమో చూడాలి!
Also Read : బాబాయ్ వెంకీ తలకి గన్ గురి పెట్టిన రానా- క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ 'రానా నాయుడు' టీజర్ రిలీజ్
Also Read : లక్ష్మీ మంచు ఈజ్ బ్యాక్ - త్వరలో 'షెఫ్ మంత్ర 2' షురూ!