News
News
X

Bimbisara: 'బింబిసార' సినిమాను రిజెక్ట్ చేసిన రవితేజ?

'బింబిసార' కథ ముందుగా రవితేజ దగ్గరకు వెళ్లిందట. నేరేషన్ విన్న తరువాత ఆయన నో చెప్పినట్లు తెలుస్తోంది.

FOLLOW US: 

నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) కథానాయకుడిగా నటించిన 'బింబిసార' (Bimbisara) సినిమా ఆగస్టు 5న థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజు నుంచే ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చింది. తొలిరోజు ఆరున్నర కోట్లు రాబట్టిన ఈ సినిమా.. రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.4. కోట్లు వసూళ్లు రాబట్టింది. రెండు రోజులకు కలిపి వరల్డ్ వైడ్ గా రూ.12.37 కోట్లు సాధించినట్లు సమాచారం. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మరో నాలుగు కోట్లు సాధిస్తే సరిపోతుంది. కానీ ఈ సినిమా జోరు చూస్తుంటే అంతకుమించి కలెక్షన్స్ రావడం ఖాయమనిపిస్తుంది.

ఈ బ్లాక్ బస్టర్ కథ ముందుగా రవితేజ దగ్గరకు వెళ్లిందట. నేరేషన్ విన్న తరువాత ఆయన నో చెప్పినట్లు తెలుస్తోంది. రవితేజకి కథ నచ్చినప్పటికీ.. కొత్త దర్శకుడు ఎలా హ్యాండిల్ చేస్తాడనే భయం ఉందట. అలానే నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించడం రిస్క్ అనిపించిందట. ఆ కారణంగానే 'బింబిసార' సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదట. ఇదివరకు కూడా రవితేజ చాలా సినిమాలను రిజెక్ట్ చేశారు. 'పోకిరి', 'పటాస్', 'ఊసరవెల్లి' లాంటి సినిమా కథలను ముందుగా రవితేజకి వినిపించారు. కానీ ఆయన రిజెక్ట్ చేయడంతో వేరే హీరోల దగ్గరకు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు 'బింబిసార' విషయంలో కూడా అలానే జరిగింది. ఫైనల్ గా దర్శకుడు వశిష్ట.. కళ్యాణ్ రామ్ ని సంప్రదించగా.. ఆయన ఓకే చెప్పారు. 

భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఇప్పుడు హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ హిట్ గనుక రవితేజకి పడి ఉంటే వేరేలా ఉండేది. 'క్రాక్' తరువాత ఇప్పటివరకు రవితేజ మరో హిట్ కొట్టలేకపోయారు. రీసెంట్ గా విడుదలైన 'రామారావు ఆన్ డ్యూటీ' కూడా వర్కవుట్ కాలేదు. ప్రస్తుతం ఆయన చేతిలో 'టైగర్ నాగేశ్వరావు', 'ధమాకా', 'రావణాసుర' సినిమాలు ఉన్నాయి. అలానే మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలతోనైనా రవితేజ సక్సెస్ అందుకుంటారేమో చూడాలి!

ఇక 'బింబిసార' సినిమా విషయానికొస్తే.. ఇందులో కళ్యాణ్ రామ్ డ్యూయల్ రోల్ చేశారు. బింబిసారుడిగా, దేవదత్తుడిగా... నటుడిగా రెండు పాత్రలో వైవిధ్యం చూపించారు. కేథ‌రిన్ ట్రెసా (Catherine Tresa), సంయుక్తా మీన‌న్ (Samyuktha Menon), వరీనా హుస్సేన్ (Warina Hussain) హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి, వరికుప్పల యాదగిరి పాటలు రాశారు. ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి నేపథ్య సంగీతం అందించారు. చిరంతన్ భట్ స్వరాలు అందించారు. ఈ చిత్రానికి ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫర్. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ ప‌తాకంపై హ‌రికృష్ణ‌ .కె ఈ సినిమాను నిర్మించారు. 

Also Read: బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇంట తీవ్ర విషాదం - రెండో పెళ్లి చేసుకోబోతున్న హృతిక్ మాజీ భార్య!

Also Read: పండుగాడి యూఫోరియా - 'పోకిరి' స్పెషల్ షోలకి షాకింగ్ బుకింగ్స్!

Published at : 07 Aug 2022 06:20 PM (IST) Tags: raviteja Kalyan Ram Bimbisara Vasishta

సంబంధిత కథనాలు

Bandla Ganesh: 'భార్యని, బిడ్డల్ని ప్రేమించనోడు అసలు మనిషేనా' - పూరీ జగన్నాథ్‌పై బండ్ల గణేష్ కామెంట్స్!

Bandla Ganesh: 'భార్యని, బిడ్డల్ని ప్రేమించనోడు అసలు మనిషేనా' - పూరీ జగన్నాథ్‌పై బండ్ల గణేష్ కామెంట్స్!

Bigg Boss: బిగ్ బాస్ షోలో అశ్లీలత - ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు!

Bigg Boss: బిగ్ బాస్ షోలో అశ్లీలత - ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు!

The Ghost: 'డబ్బు, సక్సెస్, సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది' - 'ది ఘోస్ట్' కొత్త ట్రైలర్!

The Ghost: 'డబ్బు, సక్సెస్, సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది' - 'ది ఘోస్ట్' కొత్త ట్రైలర్!

Megastar Chiranjeevi: మరో రీమేక్‌పై చిరు ఫోకస్ - డైరెక్టర్ ఫైనల్ అయినట్లేనా?

Megastar Chiranjeevi: మరో రీమేక్‌పై చిరు ఫోకస్ - డైరెక్టర్ ఫైనల్ అయినట్లేనా?

Masooda Release Date : మూడు భాషల్లో సంగీత హారర్ డ్రామా 'మసూద' - విడుదలకు అంతా రెడీ

Masooda Release Date : మూడు భాషల్లో సంగీత హారర్ డ్రామా 'మసూద' - విడుదలకు అంతా రెడీ

టాప్ స్టోరీస్

Revant Vs KTR : తెలంగాణ ఉద్యమంలో మీరెక్కడ ? సోషల్ మీడియాలో రేవంత్ వర్సెస్ కేటీఆర్ !

Revant Vs KTR :  తెలంగాణ ఉద్యమంలో మీరెక్కడ ? సోషల్ మీడియాలో రేవంత్ వర్సెస్ కేటీఆర్ !

5G Launch India: 5G సేవల్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ఆవిష్కరణ

5G Launch India: 5G సేవల్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ఆవిష్కరణ

Kanpur News: హాస్టల్‌లో అమ్మాయిల న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసిన స్వీపర్!

Kanpur News: హాస్టల్‌లో అమ్మాయిల న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసిన స్వీపర్!

Ponniyin Selvan Review - 'పొన్నియిన్ సెల్వన్' రివ్యూ : 'బాహుబలి' చూసిన కళ్ళకు నచ్చుతుందా? లేదా?

Ponniyin Selvan Review - 'పొన్నియిన్ సెల్వన్' రివ్యూ : 'బాహుబలి' చూసిన కళ్ళకు నచ్చుతుందా? లేదా?