![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ramesh Babu: రమేష్ బాబు హఠాన్మరణం.. సంతాపం ప్రకటించిన చిరు, వెంకీ
ఘట్టమనేని రమేష్ బాబు ఆకస్మిక మరణం సినీ అభిమానులను, ప్రముఖులను షాక్ కు గురిచేసింది.
![Ramesh Babu: రమేష్ బాబు హఠాన్మరణం.. సంతాపం ప్రకటించిన చిరు, వెంకీ I was shocked to hear of this sudden death ... Hero Chiranjeevi and hero Venkatesh mourned Ramesh Babu: రమేష్ బాబు హఠాన్మరణం.. సంతాపం ప్రకటించిన చిరు, వెంకీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/09/ad97ee5538cd1b3c4909d9d26633d9c3_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు శనివారం ఆకస్మికంగా మరణించారు. ఆయన కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆ వ్యాధి విషమించడంతో శనివారం రాత్రి మరణించారు. ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు జరిగాయి. రమేష్ బాబు మరణవార్త విని పలువురు ప్రముఖ నటులు స్పందించారు. ట్విట్టర్లో తమ సంతాపాన్ని ప్రకటించారు.
సినీ హీరోలు చిరంజీవి, వెంకటేష్ సోషల్ మీడియాలో తమ సంతాపాన్ని ప్రకటించారు. చిరు ట్వీట్ చేస్తూ ‘రమేష్ బాబు హఠాన్మరణం నన్ను షాక్ కు గురిచేసింది. తీవ్ర బాధలో ముంచివేసింది. కృష్ణ గారు, మహేష్ బాబు కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. అలాగే హీరో వెంకటేష్ ‘రమేష్ బాబు గారు హఠాత్తుగా మరణించడం షాక్‌కు గురి చేసింది. అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. మహేష్ బాబు, అతని కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా’ అని ట్వీట్ చేశారు.
Shocked and deeply saddened by the demise of Shri.G.Ramesh babu. My heartfelt condolences to Shri.Krishna garu ,@urstrulyMahesh and all the family members. May the Almighty give strength to the family to cope with the tragic loss.
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 9, 2022
Extremely shocked and saddened by the demise of Ramesh babu Gaaru. My sincere condolences to @urstrulyMahesh and all the family members. May his soul rest in peace 🙏🏼
— Venkatesh Daggubati (@VenkyMama) January 9, 2022
Also read: హీరోగా గాలి జనార్థన రెడ్డి కొడుకు, పాన్ ఇండియా స్థాయిలో సినిమా
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)