అన్వేషించండి

Rangabali: నేను సినిమా చూశాకే ప్రమోషన్స్ చేస్తా, అవన్నీ వృత్తిలో భాగమే: ‘రంగబలి’పై నాగశౌర్య

జులై 7 న ‘రంగబలి’ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో నాగశౌర్య సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Rangabali: టాలీవుడ్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో నాగశౌర్య ఒకరు. ఆయన చివరిగా ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ సినిమాలో కనిపించారు. ‘ఛలో’ సినిమా తర్వాత నాగ శౌర్య కు సరైన హిట పడలేదనే చెప్పాలి. ఆయన తాజాగా నటించిన సినిమా ‘రంగబలి’. ఈ సినిమాకు పవన్ బసంశెట్టి దర్వకత్వం వహించారు. యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ జులై 7 న విడుదల కానుంది. మూవీ ప్రమోషన్స్ ను కూడా చాలా వినూత్నంగా ప్లాన్ చేశారు మేకర్స్. అవన్నీ సక్సెస్ కావడంతో ‘రంగబలి’ సినిమా గురించి పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలో హీరో నాగశౌర్య ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘రంగబలి’ సినిమా గురించి అలాగే తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 

నేను సినిమా చూశాకే ప్రమోషన్స్ చేస్తాను: నాగ శౌర్య

‘రంగబలి’ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ గురించి మాట్లాడారు నాగశౌర్య. మూవీ ప్రమోషన్స్ బాగా జరుగుతున్నాయని అన్నారు. తాను ప్రమోషన్స్ చేసే ముందు సినిమా మొత్తం చూస్తానని, అప్పుడే ప్రమోషన్స్ చేయాలా వద్దా అనేది చేస్తామని చెప్పారు. ఈ సినిమా బాగా వచ్చిందని అన్నారు. ఆ భరోసాతోనే ప్రమోషన్స్ బాగా చేయగలుగుతున్నామని చెప్పారు. 

ఇది అన్ని సినిమాలకు పనిచేస్తుందని చెప్పలేను..

తాను చేసిన సినిమాలు అన్నీ ఇలా వర్క్ అవుట్ అవుతాయని అనుకోడానికి లేదన్నారు నాగశౌర్య. గతంలో తాను నటించిన కొన్ని సినిమాలను తాను చూడనుకూడాలేదని చెప్పారు. ఒక సినిమా పై దాదాపు వెయ్యి మంది పనిచేస్తారు. అందుకే సినిమా సరిగ్గా రాకపోయినా ఎవరిమీదా నిందలు మోపలేం. అన్ని సినిమాలకు మనం అనుకున్నట్టు జరగదు. అయితే ‘రంగబలి’ సినిమాకు అదృష్టవశాత్తూ అంతా కలసొచ్చిందని చెప్పారు.   

దర్శకుడు పవన్ అనుకున్నది కరెక్ట్ గా చేశాడు..

‘రంగబలి’ సినిమా దర్శకుడు పవన్ బసంశెట్టి మంచి దర్శకుడు అని అన్నారు నాగశౌర్య. నటీనటులకు ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించే వ్యక్తే మంచి దర్శకుడు అవుతాడని తాను నమ్ముతానని, అలాంటి దర్శకుడు పవన్ అని అన్నారు. ఈ సినిమా కోసం పవన్ చాలా కష్టపడ్డాడని అన్నారు. ఇది మంచి స్క్రిప్ట్ అని అందుకే తాను కలుగజేసుకోలేదని అన్నారు. అయితే తన అనుభవం, దర్శకుడి విజన్‌ ​​వల్ల ‘రంగబలి’ బాగా వచ్చిందన్నారు. రంగబలి అనేది సొంతూరు అంటే అభిమానం ఉన్న ఒక సాధారణ మధ్యతరగతి కుర్రాడి కథ అని చెప్పారు. 

దర్శకుల విషయంలో అదే నమ్ముతాను..

తన కెరీర్ లో దాదాపు 18 మంది కొత్త దర్శకులతో పనిచేశానని అన్నారు నాగశౌర్య. అయితే ఆ సినిమాలలో కొన్ని అనుకున్నంత విజయాన్ని అందుకోకపోతే తన నిర్ణయం తప్పు అని కాదని అన్నారు. అయితే ఒక దర్శకుడితో అనుకున్నట్టు సినిమా రాకపోతే మరో విభిన్నమైన కథను ఎంచుకొని ముందుకు వెళ్లాల్సిందేన్నారు. సినిమా అనేది నిరంతర ప్రక్రియ అని చెప్పుకొచ్చారు. 

అవన్నీ వృత్తిలో భాగమే..

ఈ సినిమా షూటింగ్ సమయంలో తాను స్పృహ తప్పి పడిపోయానని, అంబులెన్స్ వచ్చిందని చాలా వార్తలు వచ్చాయన్నారు. అయితే సినిమా కోసం ఒక్కోసారి ఆహార నియమాలు పాటించాల్సి వస్తుందని, అలాంటపుడు ఇలాంటివి జరగడం సహజమేనని అన్నారు. "నేను వచ్చిందే ప్రేక్షకులని మెప్పించడానికి. ఇప్పుడున్న పోటీకి ప్రతి ఒక్కరూ నటన, డాన్స్, యాక్షన్ అన్నీ చేస్తున్నారు. నేనూ ది బెస్ట్ ఇవ్వాలి అనుకున్నాను. ఆ క్రమంలో కొన్నిఆరోగ్య సమస్యలు తెలెత్తుతాయి. మనం ఎంచుకున్న వృత్తిలో ఇవన్నీ భాగమే కదా అయినా కష్టపడితేనే సక్సెస్ వస్తుంది" అని చెప్పారు నాగశౌర్య.

Also Read: దర్శకుడిగా మారిన తమిళ స్టార్ హీరో - గుండు లుక్‌తో షాక్ - D50 అనౌన్స్‌మెంట్!

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 16th: పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
Mammootty : మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
Anupama Parameswaran : కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
Bandla Ganesh : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
Embed widget