అన్వేషించండి

D50 Look: దర్శకుడిగా మారిన తమిళ స్టార్ హీరో - గుండు లుక్‌తో షాక్ - D50 అనౌన్స్‌మెంట్!

తమిళ స్టార్ హీరో ధనుష్ దర్శకత్వం వహిస్తున్న రెండో సినిమాను అధికారికంగా ప్రకటించారు.

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఎన్నో టాలెంట్స్ ఉన్న వ్యక్తి. నటుడిగా, నిర్మాతగా, పాటల రచయతగా, గాయకుడిగా ఎన్నో రంగాల్లో తన పట్టు నిరూపించుకున్నాడు. అంతే కాకుండా గతంలో ‘పవర్ పాండి’ అనే సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. ఆ తర్వాత తెలుగు హీరో నాగార్జున కీలక పాత్రలో ఒక సినిమా ప్రారంభించినా, అది మధ్యలోనే ఆగిపోయింది. అయితే ఇప్పుడు మరోసారి ధనుష్ మెగాఫోన్ పట్టుకోవడానికి సిద్ధం అయ్యాడు. తన కెరీర్‌లో ప్రతిష్టాత్మకమైన 50వ చిత్రానికి తనే దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయింది. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టును ‘D50’ అని పిలుస్తున్నారు. అయితే ‘రాయన్’ అనే టైటిల్‌ను ఇప్పటికే ఫిక్స్ చేసినట్లు సమాచారం.

సన్‌పిక్చర్స్ నిర్మాణంలో...
సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సినిమా షూటింగ్ ప్రారంభం అయిన విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టర్ ద్వారా ప్రకటించారు. ధనుష్ ఈ సినిమాలో గుండుతో కనిపించనున్నారు. ధనుష్ లుక్‌కు సంబంధించి చిన్న టీజ్ కూడా చేశారు. షర్ట్ లేకుండా గుండుతో, చేతిలో కత్తితో ఉన్న ధనుష్‌ను వెనుక నుంచి చూపించారు.

సందీప్ కిషన్ కూడా...
ఈ సినిమా స్టార్ కాస్ట్ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ధనుష్‌కు ఎస్‌జే సూర్య అన్నయ్యగా, సందీప్ కిషన్ తమ్ముడిగా నటించనున్నారని ప్రచారం జరుగుతుంది. సందీప్ కిషన్‌కు జోడిగా ‘ఆకాశం నీ హద్దురా’ ఫేమ్ అపర్ణ బాలమురళి నటించనున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఉత్తర చెన్నై నేపథ్యంలో అన్నదమ్ముల మధ్య సాగే గ్యాంగ్‌స్టర్ డ్రామానే ఈ ‘రాయన్’ అని తెలుస్తోంది.

సందీప్ కిషన్, ధనుష్ ఇప్పటికే ‘కెప్టెన్ మిల్లర్’ సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇద్దరి పోర్షన్లు పూర్తయ్యాయి. ధనుష్ పూర్తిగా ‘కెప్టెన్ మిల్లర్’ లుక్ నుంచి బయటకు వచ్చేయగా, సందీప్ కిషన్ షూటింగ్ పార్ట్ కూడా పూర్తయిందని ‘కెప్టెన్ మిల్లర్’ డైరెక్టర్ అరుణ్ మతీశ్వరన్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు.

వరుస సినిమాలతో...
‘కెప్టెన్ మిల్లర్’ 2023 చివర్లోనూ, ‘D50 (రాయన్)’ 2024 ప్రారంభంలోనూ విడుదల కానున్నాయి. బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో ‘తేరే ఇష్క్ మే’ అనే సినిమాను కూడా ధనుష్ ఇటీవలే ప్రకటించాడు. 2024లో ఈ సినిమా విడుదల కానుంది. తెలుగులో కూడా ధనుష్.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. 2024 ప్రారంభంలో ఆ సినిమా ప్రారంభం కానుందని తెలుస్తోంది.

ధనుష్ ఇప్పటికే ‘సార్’ ద్వారా స్ట్రయిట్ తెలుగు సినిమా చేసి బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. అలాగే వెట్రిమారన్ దర్శకత్వంలో కూడా ధనుష్ రెండు సినిమాలు చేయాల్సి ఉంది. వీటిలో ఒకటి 2018లో వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘వడచెన్నై’కి సీక్వెల్. అలాగే ధనుష్ తన అన్నయ్య సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ‘యుగానికి ఒక్కడు 2’ని కూడా ప్రకటించారు. ఆ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియరాలేదు. ప్రస్తుతానికి ధనుష్ చేతి నిండా సినిమాలతో ఇండియాలోనే బిజీగా ఉన్న హీరోల్లో ఒకరిగా ఉన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Varanasi Plot : వారణాసి స్టోరీ లీక్ - ఈ ప్లాట్ అస్సలు ఊహించలేదు... రాజమౌళి చెప్పిన సీక్రెట్స్ ఏంటంటే?
వారణాసి స్టోరీ లీక్ - ఈ ప్లాట్ అస్సలు ఊహించలేదు... రాజమౌళి చెప్పిన సీక్రెట్స్ ఏంటంటే?
Jyothika Munirathnam: బుల్లితెరపై విలన్ రోల్, రియల్ లైఫ్‌లో మోడ్రన్ క్వీన్.. జ్యోతిక మునిరత్నం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
బుల్లితెరపై విలన్ రోల్, రియల్ లైఫ్‌లో మోడ్రన్ క్వీన్.. జ్యోతిక మునిరత్నం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Suhasini: వెండి తెర నుంచి బుల్లితెరకు.. తొలి సినిమా, సీరియల్ హిట్.. సుహాసిని గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
వెండి తెర నుంచి బుల్లితెరకు.. తొలి సినిమా, సీరియల్ హిట్.. సుహాసిని గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Sambarala Yeti Gattu: సాయి దుర్గా తేజ్ SYGలో బాలీవుడ్ టాప్ స్టార్... రిలీజ్ అప్డేట్ ఇచ్చిన టీమ్
సాయి దుర్గా తేజ్ SYGలో బాలీవుడ్ టాప్ స్టార్... రిలీజ్ అప్డేట్ ఇచ్చిన టీమ్

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Embed widget