అన్వేషించండి

Project K: నాకు నేను చిన్నగా కనిపించేవాడిని, చాలా బోర్ కొట్టింది: ‘ప్రాజెక్ట్ కె’పై ప్రభాస్ కామెంట్స్

అమెరికాలో జరిగిన ‘ప్రాజెక్ట్ కె’ గ్లింప్స్ ఈవెంట్ లో ప్రభాస్ కు ఒక వింత ప్రశ్న ఎదురైంది. దానికి ప్రభాస్ చెప్పిన సమాధానం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

Project K: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘ప్రాజెక్ట్ కె’. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోణ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల అయిన ప్రచార చిత్రాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఇక ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న మూవీ గ్లింప్స్ కూడా రానే వచ్చేసింది. అమెరికా శాన్ డియాగో కామిక్ కాన్ 2023 ఈవెంట్ లో జరిగిన ఓ వేడుకలో ఈ మూవీ గ్లింప్స్ ను విడుదల చేశారు మేకర్స్. మూవీ టీమ్ అంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే గ్లింప్స్ విడుదల అయిన తర్వాత ప్రభాస్ ను మూవీ షూటింగ్ గురించి ఓ ప్రశ్న అడిగారు. దానికి ఆయన చెప్పిన సమాధానం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.  

ముందు నాక్కూడా బోర్ కొట్టింది: ప్రభాస్

ఈ ఈవెంట్ సందర్భంగా అక్కడ ప్రభాస్ ను ఒక ఇంట్రస్టింగ్ ప్రశ్న అడిగారు. అదేంటంటే.. ‘‘మీరు బాహుబలి, ఆదిపురుష్, సాహో, సాలార్, కల్కి 2898 AD వంటి భారీ బడ్జెట్ చిత్రాలలో నటిస్తున్నారు ఇందులో రియల్ సెట్స్ కంటే బ్లూ స్క్రీన్ సన్నివేశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి కదా బ్లూ స్క్రీన్ పట్ల బోర్ కొట్టిందా?’’ అని ప్రశ్నించారు. అయితే దానికి ప్రభాస్ స్పందిస్తూ.. ‘‘అవును మొదట్లో నాకు కూడా బోర్ కొట్టింది. అంత పెద్ద బ్లూ స్క్రీన్ ముందు నేను చిన్నగా కనిపించేవాడ్ని. అయితే గ్లింప్స్ చూసిన తర్వాత బాగానే అనిపిస్తుంది’’ అని సరదాగా సమాధానం చెప్పారు. దీంతో వేదికపై నవ్వులు విరిశాయి. ప్రభాస్ అభిమానులు కూడా ప్రభాస్ సమాధానం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 

‘ప్రాజెక్ట్ కె’ పేరు ‘కల్కి 2898 ఏడి’..

అమెరికాలో నిర్వహించిన వేడుకలో ‘ప్రాజెక్ట్ కె’ మూవీ గ్లింప్స్ ను విడుదల చేశారు. అయితే ఈ గ్లింప్స్ వీడియోలోనే మూవీ పేరును కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. ‘ప్రాజెక్ట్ కె’ కు ‘కల్కి 2898 ఏడీ’ అని పేరును ఖరారు చేశారు. 'కల్కి' గ్లింప్స్ విషయానికి వస్తే.. సినిమా అంతా సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా సాగుతుందని తెలుస్తోంది. మూవీలో విజువల్స్ భారీ స్థాయిలో చూపించారు. ఇందులో టైమ్ ట్రావెల్ కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రపంచాన్ని ఒక దుష్టశక్తి ఆవహించినపుడు ఒక శక్తి ఉద్భవిస్తుందని ‘కల్కి’లో చూపించారు. అలాగే భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయిందనే టాక్ వస్తోంది. ఈ వీడియో విడుదల తర్వాత ప్రభాస్ అభిమానులు, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని చెప్పవచ్చు. మొత్తంగా ప్రస్తుతం కల్కి – 2898 AD ఫస్ట్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంటూ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. ఇక మూవీను వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేస్తారని సమాచారం. కామిక్-కాన్‌లో గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌కు ప్రభాస్, కమల్ హాసన్, రానా దగ్గుబాటి, అశ్విని దత్, నాగ్ అశ్విన్, స్వప్నా దత్ తదితరులు హాజరయ్యారు. లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ ఆన్లైన్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Also Read: బిగ్ బ్రేకింగ్ - 'ప్రాజెక్ట్ కె' గ్లింప్స్ వచ్చేసింది, టైటిల్ కూడా చెప్పేశారు!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget