News
News
X

Hit 2 Update: 'హిట్' సినిమా యూనివర్శ్ - కన్ఫర్మ్ చేసిన డైరెక్టర్!

'హిట్2' సినిమా టీజర్ ను నవంబర్ 3న విడుదల చేయనున్నారు. 

FOLLOW US: 

అడివి శేష్(Adivi Sesh) కథానాయకుడిగా నటించిన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'హిట్ 2' (HIT - Homicide Investigation Team). విశ్వక్ సేన్(Vishwak Sen) హీరోగా 2020లో వచ్చిన 'హిట్' చిన్న సినిమాగా వచ్చి పెద్ద సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా 'హిట్ 2'ని ఉంటుందని.. రిలీజ్ సమయంలోనే ప్రకటించారు. పార్ట్ 2లో కూడా విశ్వక్ సేన్ హీరోగా నటిస్తారని అనుకున్నారు. అయితే కొన్ని కారణాల దృష్ట్యా అడివి శేష్ హీరోగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

శైలేష్ కొలను దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నేచురల్ స్టార్ నాని సమర్పణలో ప్రశాంత్ త్రిపిర్‌నేని 'హిట్' ఫ్రాంచైజీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి హీరోయిన్. మొదట జూలైలో ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కుదరలేదు. ఇప్పుడు డిసెంబర్ 2న సినిమా రిలీజ్ కానుంది. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ షురూ చేశారు. 

Hit 2 verse unveiled with a stunning video: ఇప్పుడు టీజర్ ను విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఒక వీడియోను వదిలారు. అందులో దర్శకుడు శైలేష్.. కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. హిట్ సినిమా ఫ్రాంచైజీలో చాలా మంది హీరోలు కనిపిస్తారని.. కథను బట్టి సినిమా స్పాన్ పెరుగుతుందని అన్నారు. ఒక పెద్ద కేసుని అందరు హీరోలు కలిసి సాల్వ్ చేస్తారని చెప్పారు. అంటే హిట్ సినిమాలో యూనివర్శ్ లో చాలా మంది హీరోలు పోలీస్ ఆఫీసర్స్ గా కనిపిస్తారన్నమాట.   

News Reels

రీసెంట్ గా ఇదే విషయాన్ని హీరో విశ్వక్ సేన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మొదటి భాగంలో విక్రమ్ రుద్రరాజు పాత్రలో విశ్వక్ సేన్ నటించగా.. హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కింది. రెండో భాగం మాత్రం ఆంధ్రప్రదేశ్ బ్యాక్‌డ్రాప్‌లో రానుంది. ఈ హిట్ 2లో కృష్ణదేవ్ అలియాస్ కేడీ అనే పోలీస్ ఆఫీసర్ గా అడివిశేష్ కనిపించనున్నారు. ఈ సినిమా టీజర్ నవంబర్ 3న రిలీజ్ కానుంది.  

కాగా.. ఇటీవల 'మేజర్' సినిమాతో ప్రేక్షకులను అలరించారు అడివి శేష్. ఈ సినిమాలో అడివిశేష్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ముంబై ఉగ్రదాడుల్లో కన్నుమూసిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. శశికిరణ్ తిక్కా దర్శకుడు. 20 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా భారీ లాభాలను తీసుకొచ్చింది. మరి 'హిట్2'తో శేష్ కి ఎలాంటి హిట్ వస్తుందో చూడాలి!

Also Read: 'ఫ్యాన్స్ నన్ను కొడతారు' - ప్రభాస్‌తో సినిమాపై మారుతి కామెంట్స్!

View this post on Instagram
 
A post shared by Sesh Adivi (@adivisesh)

Published at : 31 Oct 2022 08:32 PM (IST) Tags: Adivi Sesh HIT 2 Hit 2 verse Hit 2 teaser sailesh kolanu

సంబంధిత కథనాలు

Pushpa The Rise: రష్యాలో కూడా తగ్గేదే లే - రిలీజ్ ఎప్పుడంటే?

Pushpa The Rise: రష్యాలో కూడా తగ్గేదే లే - రిలీజ్ ఎప్పుడంటే?

Prabhas Kriti Sanon: ప్రభాస్ ప్రేమలో కృతి సనన్ - గుట్టురట్టు చేసిన వరుణ్ ధావన్, ఆందోళనలో అనుష్క ఫ్యాన్స్!

Prabhas Kriti Sanon: ప్రభాస్ ప్రేమలో కృతి సనన్ - గుట్టురట్టు చేసిన వరుణ్ ధావన్, ఆందోళనలో అనుష్క ఫ్యాన్స్!

Yadamma Raju Engagement: ఓ ఇంటివాడు కాబోతున్న కమెడియన్ యాదమ్మ రాజు, ఎంగేజ్మెంట్ పోటోలు వైరల్

Yadamma Raju Engagement: ఓ ఇంటివాడు కాబోతున్న కమెడియన్ యాదమ్మ రాజు, ఎంగేజ్మెంట్ పోటోలు వైరల్

Gautham Karthik-Manjima Mohan Marriage: కోలీవుడ్ లవ్ బర్డ్స్ పెళ్లి సందడి, మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన గౌతమ్, మంజిమా

Gautham Karthik-Manjima Mohan Marriage: కోలీవుడ్ లవ్ బర్డ్స్ పెళ్లి సందడి, మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన గౌతమ్, మంజిమా

Pavitra Lokesh: నరేష్ భార్య రమ్య రఘుపతిపై పవిత్రా లోకేష్ ఫిర్యాదు

Pavitra Lokesh: నరేష్ భార్య రమ్య రఘుపతిపై పవిత్రా లోకేష్ ఫిర్యాదు

టాప్ స్టోరీస్

Minister Ambati Rambabu : పవన్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్ - మంత్రి అంబటి రాంబాబు

Minister Ambati Rambabu : పవన్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్ - మంత్రి అంబటి రాంబాబు

IT Politics : ఐటీ ఎదుట హాజరైన మల్లారెడ్డి కుటుంబీకులు - విచారణ తర్వాత ఫుల్ కాన్ఫిడెన్స్ !

IT Politics : ఐటీ ఎదుట హాజరైన మల్లారెడ్డి కుటుంబీకులు -  విచారణ తర్వాత ఫుల్ కాన్ఫిడెన్స్ !

TS New DGP : నూతన డీజీపీ నియామకంపై తెలంగాణ సర్కార్ కసరత్తు, రేసులో ఆ ముగ్గురు!

TS New DGP : నూతన డీజీపీ నియామకంపై తెలంగాణ సర్కార్ కసరత్తు, రేసులో ఆ ముగ్గురు!

AP: ఏపీలో 6,511 పోలిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

AP: ఏపీలో 6,511 పోలిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల