(Source: ECI/ABP News/ABP Majha)
Shouryuv: ‘హాయ్ నాన్న’కు నాగార్జున సినిమాకు సంబంధం లేదు - దర్శకుడు శౌర్యువ్ ఇంటర్వ్యూ
Shouryuv: నేచురల్ స్టార్ నాని, నూతన దర్శకుడు శౌర్యువ్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం 'హాయ్ నాన్న'. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో దర్శకుడు కీలక విషయాలు వెల్లడించారు.
Director Shouryuv About Hi Nanna Movie: నేచురల్ స్టార్ నాని, అందాల నటి మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా 'హాయ్ నాన్న'. బేబీ కియారా ఖన్నా కీలక పాత్రలో కనిపించనుంది. వైర ఎంటర్టైన్మెంట్స్ తొలి ప్రొడక్షన్ వెంచర్ గా రూపొందిన ఈ చిత్రంతో శౌర్యువ్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు చక్కటి ఆదరణ దక్కించుకున్నాయి. సినిమాపై ఓ రేంజిలో అంచనాలు పెంచాయి. ఈ సినిమా డిసెంబర్ 7న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు శౌర్యువ్ కీలక విషయాలు వెల్లడించారు.
మెడిసిన్ వదిలేసి ఇండస్ట్రీలోకి వచ్చా- శౌర్యువ్
సినిమాల మీద ఉన్న ఇష్టంతో మెడిసిన్ ను వదిలేసి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినట్లు శౌర్యువ్ వెల్లడించారు కన్నడ, తెలుగు సినిమా ‘జాగ్వార్’, ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ తో పాటు ఆదిత్యవర్మ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసినట్లు చెప్పారు. నాలుగేళ్ల క్రితం రాసుకున్న కథను వైర ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్స్ కి చెప్పినపుడు నచ్చిందన్నారు. హీరో నానికి కూడా నచ్చడంతో సినిమా చేస్తానని చెప్పినట్లు వెల్లడించారు. 6 నెలల ప్రీ ప్రొడక్షన్ వర్క్ తర్వాత షూటింగ్ మొదలు పెట్టినట్లు వెల్లడించారు. నాని కథ విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోలేదని చెప్పిన ఆయన, తానే కొన్ని మార్పులు చేయాల్సి వచ్చిందని చెప్పారు.
ఎమోషనే 'హాయ్ నాన్న' మూవీ ప్రధాన బలం
'హాయ్ నాన్న' సినిమాలో ప్రధాన బలం ఎమోషన్ అని చెప్పారు దర్శకుడు. తండ్రి కూతురు మధ్య అనుబంధం, మృణాల్ పాత్రలో వున్న బాండింగ్ ఆకట్టుకుంటుందన్నారు. ఎమోషన్ కారణంగానే నాని ఈ కథని ఒప్పుకున్నారని భావిస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ చిత్రానికి ‘సంతోషం’ సినిమాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. సింగిల్ ఫాదర్ మళ్ళీ ప్రేమలో పడ్డాడనగానే చాలా సినిమాలు గుర్తుకు వస్తాయన్నారు. ‘హాయ్ నాన్న’ మాత్రం కంప్లీట్ డిఫరెంట్ గా వుంటుందన్నారు. జీవితంలో, సమాజంలోని చాలా అంశాలు ఈ సినిమాలో కనిపిస్తాయన్నారు.
అందరి లాగే లవ్ స్టోరీ రాసుకున్నా- శౌర్యువ్
ఇక ప్రతి తొలి సినిమా దర్శకుడి మాదిరిగానే తానూ ప్రేమ కథ రాసుకున్నట్లు చెప్పారు శౌర్యువ్. అయితే, ‘హాయ్ నాన్న’ చిత్రం మాములు ప్రేమకథ మాదిరిగా కాకుండా, ఎమోషన్స్ హై పిచ్ ఉంటుందన్నారు. అయితే, అందరికీ ప్రేమకథలే వర్క్ అవుట్ అవుతాయని చెప్పలేమన్న ఆయన, శ్రీకాంత్ ఓదెల ‘దసరా’ని కంప్లీట్ కమర్షియల్ సినిమాగా అద్భుతంగా చేశాడని చెప్పారు. మృణాల్ చాలా స్వీట్ అని చెప్పిన శౌర్యువ్, ‘హాయ్ నాన్నతో’ అందరూ ప్రేమలో పడిపోతారని చెప్పిందన్నారు. సినిమాపై నమ్మకంతోనే ఆమె ఆ మాట చెప్పారని వెల్లడించారు. ఇక ఈ సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగులు, హింసలేదన్నారు. క్లీన్ ఎమోషనల్ ఫ్యామిలీ మూవీగా రూపొందినట్లు చెప్పారు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ ను తీసుకోవాలని తానే అనుకున్నట్లు చెప్పారు. మృణాల్ ‘తుపాన్’ చూసి ఆమెను తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాలో మృణాలో ఏడిస్తే కూడా అందంగా కనిపిస్తుందన్నారు. ఇక చిన్నారి కియారా ఖన్నా సూపర్ ట్యాలెంటెడ్ అని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ నిద్రలో లేపి అడిగినా తన డైలాగులన్నీ అనర్గళంగా చెప్పేస్తుందన్నారు. ఇక ఈ సినిమాలో శ్రుతి హాసన్ పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఈ సినిమను హైదరాబాద్, గోవా, ముంబై, కునూర్ లో చిత్రీకరించినట్లు వివరించారు. 97 రోజుల వ్యవధిలో షూట్ కంప్లీట్ అయినట్లు వివరించారు.
Also Read: 'యానిమల్' బోల్డ్ సీన్‌తో పాపులారిటీ - ఈ అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలుసా?
ఇక ఈ సినిమాకు సంగీత దర్శకుడు హేషమ్ ని నాని సజెస్ట్ చేసినట్లు చెప్పారు. ఈ చిత్రానికి పాటలతో పాటు చాలా అద్భుతమైన నేపధ్య సంగీతం ఇచ్చారని చెప్పారు. ఒకొక్క పాత్ర, ఎమోషన్ కి తగ్గట్టు మ్యూజిక్ చేశారని వెల్లడించారు. ఈ సినిమా తర్వాత ఆయన మరో మెట్టు ఎదుగుతారని వెల్లడించారు.
Read Also: ఇప్పటి 20 సార్లు పెళ్లి చేసుకున్నా అస్సలు బోర్ కొట్టలేదు - అవికా గోర్
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply