అన్వేషించండి
Ranbir Kapoor: ఎంతమంది హీరోలు ఉన్నా, ప్రభాసే నా ఫేవరెట్ - రణబీర్ కపూర్ కామెంట్స్
ఫాన్స్ తో, యూట్యూబ్ ఇంఫ్లుయెన్సర్లతో మాట్లాడిన రణబీర్ కపూర్ వారి ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

ఎంతమంది హీరోలు ఉన్నా, ప్రభాసే నా ఫేవరెట్ - రణబీర్ కపూర్ కామెంట్స్
టాలీవుడ్ లో తనకెందరో హీరోలు ఫ్రెండ్స్ గా ఉన్నా.. ప్రభాస్ అంటే మాత్రం తనకు బాగా ఇష్టం అన్నారు బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్. తన కొత్త సినిమా 'బ్రహ్మాస్త్ర' మొదటి భాగం సెప్టెంబర్ 9న రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కోసం వైజాగ్ వచ్చారు. మెలోడీ థియేటర్ లో ఏర్పాటు చేసిన ఫ్యాన్స్ మీట్ లో రణబీర్ కపూర్ తో పాటు సినిమా డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ,టాలీవుడ్ జక్కన్న రాజమౌళి పాల్గొన్నారు. ఒక సినిమా ప్రమోషన్ కోసం బాలీవుడ్ స్టార్ వైజాగ్ లో పర్యటించడం ఇదే తొలిసారని రాజమౌళి అన్నారు.
కరణ్ జోహార్ తో ఉన్న సాన్నిహిత్యంతో ఈ సినిమాను దక్షిణాది భాషల్లో ప్రమోట్ చేశానని అయితే.. అయితే ఈ సినిమా డైరెక్టర్ తో మాట్లాడాక ఇది చాలా పెద్ద సక్సెస్ అవుతుందని నమ్మకంతో ఉన్నానని రాజమౌళి అన్నారు. దక్షిణాది భాషల్లో ఈ సినిమాను రాజమౌళినే సమర్పిస్తున్నారు. సినిమా డైరెక్టర్ ముఖర్జీ మాట్లాడుతూ.. బ్రహ్మాస్త్ర అనేది మన భారత దేశ ఇతిహాసాల్లోని కథల ఆధారంగా రూపొందించిన ఫాంటసీ సినిమా అని.. దీన్ని మూడు భాగాలుగా రిలీజ్ చేస్తామని చెప్పారు.
తరువాత ఫాన్స్ తో, యూట్యూబ్ ఇంఫ్లుయెన్సర్లతో మాట్లాడిన రణబీర్ కపూర్ వారి ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అందులో భాగంగా ప్రభాస్ తన డార్లింగ్ అని అన్నారు రణబీర్. ఇక చరణ్, తారక్ లాంటి తెలుగు హీరోలతో సన్నిహితంగా ఉంటానన్న ఆయన సౌత్ లో రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల సినిమాలంటే తనకు ఇష్టమని తెలిపారు.
ఈ సందర్బంగా బ్రహ్మాస్త సినిమా ట్రైలర్ జూన్ 15 న రిలీజ్ అవుతుందని ప్రకటించారు. ఇక రణబీర్ కపూర్ ను స్వయంగా కలిసే అవకాశం రావడంతో చాలామంది ఫాన్స్ ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమాలో రణబీర్ కపూర్ కు జోడీ గా అలియా భట్ నటించగా ప్రత్యేక పాత్రల్లో బాలీవుడ్ బాద్షా అమితాబ్ బచ్చన్, కింగ్ నాగార్జున, మౌని రాయ్ నటిస్తున్నారు. అనివార్య కారణాల వల్ల వైజాగ్ ఈవెంట్ కు రాలేకపోయిన నాగార్జున, అలియా భట్ లు ఫాన్స్ కు తమ వీడియో సందేశాలు పంపుతూ.. టీమ్ కు విషెస్ తెలిపారు.
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
జాబ్స్
అమరావతి
రాజమండ్రి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement


Nagesh GVDigital Editor
Opinion