Brahmastra Teaser: 'బ్రహ్మాస్త్ర'లో నాగార్జున లుక్ చూశారా? ఇక ఆట మొదలంటూ ప్రోమో
'బ్రహ్మాస్త్ర' ట్రైలర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా 'బ్రహ్మాస్త్ర'. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రణబీర్ కపూర్, అలియాభట్ జంటగా నటించారు. ఈ సినిమాను సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదల కానుంది. పెళ్లి తరువాత అలియా-రణబీర్ జంట నుంచి విడుదల కాబోయే సినిమా ఇదే.
ఇప్పటికే ఈ సినిమా నుంచి చిన్న వీడియోను విడుదల చేశారు. ఇటీవల సినిమాలో 'కుంకుమలా' అంటూ సాగే సాంగ్ ప్రోమోను వదిలారు. త్వరలోనే పూర్తి పాటను విడుదల చేయనున్నారు. ఇక తాజాగా సినిమా ట్రైలర్ ను విడుదల చేయబోతున్నట్లు ప్రోమోను వదిలారు. ఇందులో అలియా, రణబీర్, అమితాబ్, మౌని రాయ్, నాగార్జున కనిపించారు.
మౌనిరాయ్, నాగార్జునల లుక్ కొత్తగా అనిపిస్తుంది. శక్తులున్న వ్యక్తులుగా వీరు కనిపించారు. జూన్ 15న సినిమా ట్రైలర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రోమో అయితే బాగానే ఉంది.. మరి ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రీతం ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దక్షిణాది భాషల్లో దర్శక ధీరుడు రాజమౌళి సమర్పిస్తున్నారు. 'బ్రహ్మాస్త్ర' మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: మహేష్ బాబు ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేసిన త్రివిక్రమ్ అండ్ కో
Also Read: 'సుడిగాలి' సుధీర్ ప్లేస్‌ను రీప్లేస్ చేసిన రష్మీ, ఇద్దరూ అనుకుని చేశారా?
View this post on Instagram