అన్వేషించండి

Prabhas Health : జ్వరంతో బాధ పడుతున్న ప్రభాస్ - అందుకే

రెబల్ స్టార్, పాన్ ఇండియా డార్లింగ్ ప్రభాస్ అభిమానులను కొంచెం కలవరపెట్టే వార్త ఇది. అయితే... వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదని సన్నిహితులు చెప్పే మాట. 

రెబల్ స్టార్, పాన్ ఇండియా డార్లింగ్, బాహుబలి ప్రభాస్ (Prabhas) అభిమానులను కాస్త కలవరపాటుకు గురి చేసే అంశమే ఇది. అయితే... వాళ్ళు పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదని సన్నిహితుల నుంచి సమాచారం అందుతోంది. అసలు వివరాల్లోకి వెళితే...

జ్వరంతో ప్రభాస్!
ఇప్పుడు ప్రభాస్ ఆరోగ్యం అంతగా బాలేదు. కొన్ని రోజుల నుంచి ఆయన జ్వరంతో బాధ పడుతున్నట్లు తెలిసింది. ఆ కారణం వల్లే మారుతి దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న సినిమా ఫిబ్రవరి షెడ్యూల్ వాయిదా వేయించారట. ప్రభాస్ (Prabhas Fever) కు వచ్చిన జ్వరం సాధారణమైనది అని, అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.

మారుతి సినిమా సంగతి పక్కన పెడితే... ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రభాస్ థియేటర్లలో సందడి చేయనున్నారు. ఆ సినిమాలు ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే... 

జూన్ 16న 'ఆదిపురుష్'
ప్రభు శ్రీరామ్ పాత్రలో ప్రభాస్ నటించిన సినిమా 'ఆదిపురుష్'. తొలుత గత ఏడాది ఆగస్టు 11న విడుదల చేయాలని భావించారు. అయితే, ఆమిర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' కోసం వాయిదా వేశారు. ఆ తర్వాత సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అనుకున్నారు. అయితే, టీజర్ విడుదలైన తర్వాత వీఎఫ్ఎక్స్ వర్క్ మీద ట్రోల్స్ రావడంతో మళ్ళీ వాయిదా వేశారు. విజువల్ ఎఫెక్ట్స్ మీద రీ వర్క్ చేస్తున్నారు.  

ఫైనల్ రిలీజ్ డేట్ ఏంటంటే... జూన్ 16న! ఆ రోజు  'ఆదిపురుష్'ను విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. వెనక్కి వెళ్ళేది లేదని కూడా యూనిట్ చెప్పారు. సో... ఈ ఏడాది ఫస్ట్ 'ఆదిపురుష్'తో ప్రభాస్ థియేటర్లలోకి వస్తారు. ఆ తర్వాత 'సలార్' విడుదల కానుంది. 

సెప్టెంబర్ 28న 'సలార్' 
జూన్ 16న 'ఆదిపురుష్' విడుదల అవుతుంది కాబట్టి 'సలార్' వాయిదా పడే ఛాన్స్ ఉందని కొందరు అనుకున్నారు. అయితే, హోంబలే ఫిలిమ్స్ సంస్థ సెప్టెంబర్ 28న ఆ సినిమాను విడుదల చేయనున్నట్లు కన్ఫర్మ్ చేసింది. దాంతో ఆ సినిమా కూడా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట.  

Also Read : 'అన్‌స్టాపబుల్ 2' ఫైనల్‌కు పవర్ టచ్ - సూసైడ్, డిప్రెషన్‌పై పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్!  

మారుతి సినిమా తర్వాత ప్రభాస్‌ 'స్పిరిట్' చేయనున్నారు. ఆ సినిమాను టీ సిరీస్ పతాకంపై ప్రముఖ హిందీ నిర్మాత భూషణ్ కుమార్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.''స్పిరిట్' చాలా యూనిక్ సినిమా. ఇదొక కాప్ డ్రామా. ప్రభాస్ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నారు. అయితే, సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు స్పెషల్ స్టైల్ తీసుకు వచ్చారు. మ్యూజిక్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇంతకు ముందు ఎప్పుడూ అటువంటి చూసి ఉండరు'' అని భూషణ్ కుమార్ పేర్కొన్నారు. 'స్పిరిట్' కంటే ముందు 'యానిమల్' విడుదల కానుందని కాబట్టి ప్రభాస్ సినిమా గురించి ఎక్కువ చెప్పడం మాట్లాడటం లేదని ఆయన తెలిపారు.

Prabhas Upcoming Movies : 'ఆదిపురుష్', 'సలార్', మారుతి సినిమాలు కాకుండా... 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ కె' సినిమా సెట్స్ మీద ఉంది. అది సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ ఓ పాన్ ఇండియా సినిమా ప్రొడ్యూస్ చేయనుంది. లేటెస్టుగా 'అన్‌స్టాపబుల్‌ 2'కు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి వచ్చారు. వాళ్ళను ప్రభాస్ సినిమా గురించి బాలకృష్ణ అడగ్గా... కన్ఫర్మ్ చేశారు. పైన చెప్పిన 'స్పిరిట్' ఇంకొకటి. 

Also Read ఫిబ్రవరిలోనే 'పులి - మేక' వెబ్ సిరీస్ విడుదల - ఎప్పుడంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Matka: అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
Which OTT Platform Has Basic Instinct: మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
Andhra News: అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
Sim Cards Blocked: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
Embed widget