LAKSHYA Trailer: పడి లేచిన వాడితో పందెం చాలా ప్రమాదకరం... 'లక్ష్య' ట్రైలర్ చూశారా?
'లక్ష్య' సినిమాతో డిసెంబర్ 10న నాగశౌర్య థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అయ్యారు. ఈ రోజు సినిమా ట్రైలర్ విడుదల చేశారు.
నాగశౌర్య విలుకాడిగా నటిస్తున్న సినిమా 'లక్ష్య'. క్యారెక్టర్ కోసం ఆయన వీలు విద్యలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. ఎయిట్ ప్యాక్ బాడీ బిల్డ్ చేశారు. విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా ఈ రోజు సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది. 'లక్ష్య' ట్రైలర్ చూస్తే... ఫుల్ కమర్షియల్ ప్యాకేజ్ కింద ఉంది. విలువిద్య కాన్సెప్ట్ తెలుగుకు కొత్త అని చెప్పాలి. కొత్త కాన్సెప్ట్‌కు తోడు... లవ్ ఉంది. హీరోయిన్ పాత్రకు మంచి ప్రాముఖ్యం ఉన్నట్టు అర్థం అవుతోంది. 'వాడు నిన్ను తప్పించి గెలవాలని అనుకున్నాడు. నువ్వు తప్పుడు దారిలో గెలవాలని అనుకున్నావ్. ఇద్దరూ ఒక్కటేగా!' అని హీరోకి హీరోయిన్ క్లాస్ పీకడం చూస్తుంటే... ఆమెది హీరోను దారిలోకి తీసుకొచ్చే పాత్రలా ఉంది. సినిమాలో ఫైట్స్ ఉన్నాయి. 'నేను వంద మందికి నచ్చక్కర్లేదు సార్. కానీ, నన్ను ఇష్టపడే ఒక్క వ్యక్తి కూడా నన్ను వద్దని అనుకుంటే... ఇక నేను గెలిచేది దేనికి సార్?' అని హీరో డైలాగ్ చెప్పారు. 'పడి లేచిన వాడితో పందెం చాలా ప్రమాదకరం' అని జగపతి బాబు చెప్పే డైలాగ్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసింది. ట్రైలర్‌లో నాగశౌర్య ఎయిట్ ప్యాక్ కూడా చూపించారు.
Looks like a winner already!👍🏻#LakshyaTrailer🏹
— Venkatesh Daggubati (@VenkyMama) December 1, 2021
▶️ https://t.co/cKzOzRCplH
All the best Team🤝🏻😊#Lakshya #LakshyaonDec10th@IamNagashaurya #KetikaSharma @IamJagguBhai @SVCLLP @nseplofficial @Santhosshjagar1 @kaalabhairava7 @AsianSuniel @sharrath_marar @RaamDop @adityamusic pic.twitter.com/nzX9CgOcEq
నాగశౌర్యకు జంటగా కేతిక శర్మ నటించిన ఈ సినిమాలో జగపతి బాబు కీలక పాత్రలో నటించారు. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ సంస్థలపై నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్న చిత్రమిది. దీనికి సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. కాలభైరవ సంగీతం దర్శకుడు. డిసెంబర్ 10న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
'లక్ష్య' ట్రైలర్:
Also Read: 'ఆషికీ' సాంగ్ లో ఫేక్ షాట్స్.. ఇదేంటి రాధా..? అంటూ ట్రోల్స్..
Also Read: కారులో కూర్చుని కథలు చెప్పారు... రోజాకు దొరికేశారు!
Also Read: కమల్ హాసన్ ఆరోగ్యంపై లేటెస్ట్ హెల్త్ అప్‌డేట్... ఇప్పుడు ఆయనకు ఎలా ఉందంటే?
Also Read: థియేటర్లు దొరక్క... పదిహేను రోజులు వెనక్కి వెళ్లిన పూర్ణ సినిమా
Also Read: ‘రాధేశ్యామ్’ సాంగ్.. ‘నన్ను ప్రేమిస్తే చస్తావ్’ ఇదో రొమాంటిక్ వార్నింగ్!
Also Read: 'సిరివెన్నెల' సాహిత్యాన్ని విశ్లేషించడమా!? వినడమా!? ఏం చేద్దాం??
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి