News
News
X

Jabardasth Varsha: కారులో కూర్చుని కథలు చెప్పారు... రోజాకు దొరికేశారు!

ఆర్టిస్టులు ఎక్కడికి వెళ్లినా... ఏదో ఒక కెమెరా కన్ను వెంటాడుతూ ఉంటుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. 

FOLLOW US: 

'ఎక్స్ట్రా జబర్దస్త్' కార్యక్రమంలో కమెడియన్ ఇమ్మాన్యుయేల్, లేడీ ఆర్టిస్ట్ వర్ష మధ్య ఏదో జరుగుతుంది అన్నట్టు చూపిస్తూ ఉంటారు. అయితే... వాళ్ల మధ్య ఏమీ లేదని టీఆర్పీ కోసం షో డైరెక్టర్లు చేస్తున్న జిమ్మిక్కులు అనే వాదన కూడా ఉంది. ఓ స్కిట్‌లో వాళ్ల మ‌ధ్య ఏమీ లేద‌ని, వ‌ర్ష వ‌దిలేయ‌డంతో ఇమ్మాన్యుయేల్ టీ ఇవ్వాల్సి వ‌స్తుంద‌న్న‌ట్టు కామెడీ చేశాడు. అది పక్కన పెడితే... లేటెస్టుగా విడుదల అయిన 'ఎక్స్ట్రా జబర్దస్త్' ప్రోమో చూస్తే నిజంగా వాళ్లిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉన్నట్టు అనిపిస్తుంది.

స్కిట్ కంప్లీట్ అయిన తర్వాత జ‌డ్జ్‌మెంట్ ఇచ్చే సమయంలో 'మీరిద్దరూ ఎక్కడికి వెళ్లారు చెప్పు... రెండు రోజుల ముందు' అని ఇమ్మాన్యుయేల్‌ను రోజా ప్రశ్నించారు. 'నేను ఊరు వెళ్లాను మేడమ్' అని అతడు సమాధానం ఇచ్చాడు. 'నేను షూటింగ్ లో ఉన్నాను మేడమ్' అని వర్ష జవాబు ఇచ్చింది. 'మరి, ఈ ఫొటో... రెండు రోజుల ముందు, ఎక్కడో కారులో ఇద్దరూ షికారులు చేస్తున్నట్టు' అని రోజా తన ఫొనులో ఓ ఫొటో తీసి చూపించారు. ఆ ఫొటోలో కారులో కూర్చ‌ని స‌ర‌దాగా క‌బుర్లు, క‌థలు చెప్పుకొంటున్న‌ వర్ష, ఇమ్మాన్యుయేల్ ఉన్నారు. చిరునవ్వులు చిందిస్తున్నారు. రోజా ఫొటో చూపిస్తుంటే వద్దన్నట్టు వర్ష సైగలు చేసింది.

కారులో వర్ష, ఇమ్మాన్యుయేల్ ఉన్న ఫొటో రెండు రోజుల ముందు తీసినదని రోజా చెప్పారు. జాగ్రత్తగా గమనిస్తే... షోలో వాళ్లిద్దరూ వేసుకున్న డ్రస్సులు, ఫొటోలు ఉన్న డ్రస్సులు సేమ్ అని అర్థం అవుతోంది. ఒకవేళ 'ఇది కూడా ప్లాన్ చేసి తీసినది ఏమో!' అని కొందరి సందేహం. ఏది ఏమైనా వీళ్లిద్దరి ట్రాక్ వీక్షకులను అట్ట్రాక్ట్ చేస్తోంది. సోషల్ మీడియాలో వర్ష ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బావుంది. 
Extra Jabardasth Latest Promo:

Also Read: కమల్ హాసన్ ఆరోగ్యంపై లేటెస్ట్ హెల్త్ అప్‌డేట్‌... ఇప్పుడు ఆయనకు ఎలా ఉందంటే?
Also Read: థియేటర్లు దొరక్క... పదిహేను రోజులు వెనక్కి వెళ్లిన పూర్ణ సినిమా
Also Read: ‘రాధేశ్యామ్’ సాంగ్.. ‘నన్ను ప్రేమిస్తే చస్తావ్’ ఇదో రొమాంటిక్ వార్నింగ్!
Also Read: 'సిరివెన్నెల' సాహిత్యాన్ని విశ్లేషించడమా!? వినడమా!? ఏం చేద్దాం??
Also Read: భీమ్లా నాయక్ పాట విడుదల చేయడం లేదు... ఆర్ఆర్ఆర్ ట్రైలర్ కూడా
Also Read: నా కంటే రెండు నెలలే పెద్దవాడు.. తనికెళ్ల భరణి కన్నీళ్లు.. ఓదార్చడం త్రివిక్రమ్ వల్ల కూడా కాలేదు!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Published at : 01 Dec 2021 03:38 PM (IST) Tags: Emmanuel Roja Jabardasth Varsha రోజా వర్ష

సంబంధిత కథనాలు

Guppedantha Manasu September 30 Update: ప్రాజెక్ట్ పేరుతో మళ్లీ ఒక్కచోట చేరిన ప్రియమైన శత్రువులు రిషిధార

Guppedantha Manasu September 30 Update: ప్రాజెక్ట్ పేరుతో మళ్లీ ఒక్కచోట చేరిన ప్రియమైన శత్రువులు రిషిధార

Karthika Deepam September 30 Update: మోనితపై కార్తీక్ కి మొదలైన అనుమానం, దీపకు అభయం ఇచ్చిన దుర్గ

Karthika Deepam September 30 Update: మోనితపై కార్తీక్ కి మొదలైన అనుమానం,  దీపకు అభయం ఇచ్చిన దుర్గ

Devatha September 30 Update: రామూర్తి కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన డాక్టర్- సత్యని అనుమానం తగ్గించుకోమన్న దేవుడమ్మ

Devatha September 30 Update: రామూర్తి కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన డాక్టర్- సత్యని అనుమానం తగ్గించుకోమన్న దేవుడమ్మ

Ennenno Janmalabandham September 30th: 'ఐ లవ్యూ నాన్న' అని ఏడిపించేసిన ఆదిత్య- శ్రీవారికి వేద ప్రేమలేఖ

Ennenno Janmalabandham September 30th: 'ఐ లవ్యూ నాన్న' అని ఏడిపించేసిన ఆదిత్య- శ్రీవారికి  వేద ప్రేమలేఖ

Bigg Boss 6 telugu Episode 26: రేవంత్‌కి జీవితంలో మర్చిపోలేని కానుక ఇచ్చిన బిగ్‌బాస్, ప్రేక్షకుల కళ్లు కూడా చెమర్చేలా

Bigg Boss 6 telugu Episode 26: రేవంత్‌కి జీవితంలో మర్చిపోలేని కానుక ఇచ్చిన బిగ్‌బాస్, ప్రేక్షకుల కళ్లు కూడా చెమర్చేలా

టాప్ స్టోరీస్

Minister Botsa : వైజాగ్ లో సీఎం అధికారిక నివాసం కడతాం, తప్పేంటి?- మంత్రి బొత్స

Minister Botsa  : వైజాగ్ లో సీఎం అధికారిక నివాసం కడతాం, తప్పేంటి?- మంత్రి బొత్స

YS Sharmila : వైఎస్ఆర్ బతికుంటే కాంగ్రెస్ పార్టీపై ఉమ్మేసేవారు, వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

YS Sharmila : వైఎస్ఆర్ బతికుంటే కాంగ్రెస్ పార్టీపై ఉమ్మేసేవారు, వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

Ponniyin Selvan Twitter Review : ఫ‌స్టాఫ్ డీసెంట్‌గా ఉంది! మ‌రి, సెకండాఫ్‌? మ‌ణిర‌త్నం సినిమాపై ఆడియ‌న్స్ రియాక్ష‌న్‌...

Ponniyin Selvan Twitter Review : ఫ‌స్టాఫ్ డీసెంట్‌గా ఉంది! మ‌రి, సెకండాఫ్‌? మ‌ణిర‌త్నం సినిమాపై ఆడియ‌న్స్ రియాక్ష‌న్‌...

Weather Latest Update: ఈ జిల్లాలవారికి హెచ్చరిక! నేడు భారీ-అతిభారీ వర్షాలు, పిడుగులూ పడే ఛాన్స్

Weather Latest Update: ఈ జిల్లాలవారికి హెచ్చరిక! నేడు భారీ-అతిభారీ వర్షాలు, పిడుగులూ పడే ఛాన్స్