News
News
X

Kamal Haasan Health: కమల్ హాసన్ ఆరోగ్యంపై లేటెస్ట్ హెల్త్ అప్‌డేట్‌... ఇప్పుడు ఆయనకు ఎలా ఉందంటే?

కమల్ హాసన్ కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్యంపై శ్రీ రామచంద్ర మెడికల్ హాస్పిటల్ లేటెస్టుగా హెల్త్ అప్‌డేట్‌ విడుదల చేసింది. ఇప్పుడు ఆయనకు ఎలా ఉందంటే...

FOLLOW US: 

కమల్ హాసన్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్. కరోనా బారిన పడిన ఆయన గత నెల 22న ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. తనకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని స్వయంగా ఆయనే ట్వీట్ చేశారు. అమెరికా వెళ్లి వచ్చిన కమల్, పరీక్షలు చేయించుకోగా కొవిడ్ అని తేలింది. దాంతో ఆయన ఐసోలేషన్‌లోకి వెళ్లారు. ఆయనలో స్వల్ప లక్షణాలు ఉండటంతో త్వరగా కోలుకున్నారు.
కమల్ హాసన్ పూర్తిగా కోలుకున్నారని ఆయనకు చికిత్స అందించిన శ్రీ రామచంద్ర మెడికల్ సెంటర్ తెలియజేసింది. బుధవారం మధ్యాహ్నం కమల్ హెల్త్ అప్‌డేట్‌ విడుదల చేసింది. ఈ నెల 3వ తేదీ వ‌ర‌కూ ఆయ‌న్ను ఐసోలేష‌న్‌లో ఉండాల‌ని సూచించిన‌ట్టు పేర్కొంది. ఈ నెల 4 నుంచి ఆయ‌న వృత్తిపరమైన ప‌నులు చేసుకోవ‌చ్చ‌ని స్పష్టం చేసింది. తనకు కరోనా వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండమంటూ అభిమానులకు కమల్ సూచించారు.

క‌మ‌ల్ హాస‌న్‌కు కరోనా రావడం, ఆయన ఐసోలేష‌న్‌లో ఉండటంతో 'బిగ్ బాస్'కు హోస్ట్ చేయడానికి కుదరలేదు. ఆయన బదులు లాస్ట్ వీక్ ఎపిసోడ్‌కు సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ హోస్ట్ చేశారు. రమ్యకృష్ణ హోస్ట్ చేయడానికి ముందు కమల్ కుమార్తె శ్రుతీ హాసన్ పేరు వినిపించింది. కానీ, ఆమె రాలేదు. రమ్యకృష్ణ వచ్చారు. నెక్స్ట్ వీక్ కమల్ హోస్ట్ చేయడానికి ఇప్పుడు లైన్ క్లియర్ అయినట్టే. సినిమాలకు వస్తే... 'ఖైదీ', 'మాస్టర్' ఫేమ్ లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో ఆయన 'విక్రమ్' సినిమా చేస్తున్నారు. 

View this post on Instagram
 
A post shared by Anirudh (@anirudhofficial)

Also Read: థియేటర్లు దొరక్క... పదిహేను రోజులు వెనక్కి వెళ్లిన పూర్ణ సినిమా
Also Read: ‘రాధేశ్యామ్’ సాంగ్.. ‘నన్ను ప్రేమిస్తే చస్తావ్’ ఇదో రొమాంటిక్ వార్నింగ్!
Also Read: 'సిరివెన్నెల' సాహిత్యాన్ని విశ్లేషించడమా!? వినడమా!? ఏం చేద్దాం??
Also Read: భీమ్లా నాయక్ పాట విడుదల చేయడం లేదు... ఆర్ఆర్ఆర్ ట్రైలర్ కూడా
Also Read: నా కంటే రెండు నెలలే పెద్దవాడు.. తనికెళ్ల భరణి కన్నీళ్లు.. ఓదార్చడం త్రివిక్రమ్ వల్ల కూడా కాలేదు!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Published at : 01 Dec 2021 02:56 PM (IST) Tags: Kamal Haasan కమల్ హాసన్ Kamal Haasan Latest Health Update

సంబంధిత కథనాలు

Ennenno Janmalabandham September 30th: 'ఐ లవ్యూ నాన్న' అని ఏడిపించేసిన ఆదిత్య- శ్రీవారికి  వేద ప్రేమలేఖ

Ennenno Janmalabandham September 30th: 'ఐ లవ్యూ నాన్న' అని ఏడిపించేసిన ఆదిత్య- శ్రీవారికి వేద ప్రేమలేఖ

Bigg Boss 6 telugu Episode 26: రేవంత్‌కి జీవితంలో మర్చిపోలేని కానుక ఇచ్చిన బిగ్‌బాస్, ప్రేక్షకుల కళ్లు కూడా చెమర్చేలా

Bigg Boss 6 telugu Episode 26: రేవంత్‌కి జీవితంలో మర్చిపోలేని కానుక ఇచ్చిన బిగ్‌బాస్, ప్రేక్షకుల కళ్లు కూడా చెమర్చేలా

Adipurush Teaser Poster : విల్లు ఎక్కుపెట్టిన శ్రీరామునిగా ప్రభాస్ వచ్చాడు - అభిమానులకు పండగ షురూ

Adipurush Teaser Poster : విల్లు ఎక్కుపెట్టిన శ్రీరామునిగా ప్రభాస్ వచ్చాడు - అభిమానులకు పండగ షురూ

Ponniyin Selvan Twitter Review : ఫ‌స్టాఫ్ డీసెంట్‌గా ఉంది! మ‌రి, సెకండాఫ్‌? మ‌ణిర‌త్నం సినిమాపై ఆడియ‌న్స్ రియాక్ష‌న్‌...

Ponniyin Selvan Twitter Review : ఫ‌స్టాఫ్ డీసెంట్‌గా ఉంది! మ‌రి, సెకండాఫ్‌? మ‌ణిర‌త్నం సినిమాపై ఆడియ‌న్స్ రియాక్ష‌న్‌...

Ram Charan: శంకర్ డబుల్ గేమ్ - చరణ్ ఎఫెక్ట్ అవుతున్నారా?

Ram Charan: శంకర్ డబుల్ గేమ్ - చరణ్ ఎఫెక్ట్ అవుతున్నారా?

టాప్ స్టోరీస్

YS Sharmila : వైఎస్ఆర్ బతికుంటే కాంగ్రెస్ పార్టీపై ఉమ్మేసేవారు, వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

YS Sharmila : వైఎస్ఆర్ బతికుంటే కాంగ్రెస్ పార్టీపై ఉమ్మేసేవారు, వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

Weather Latest Update: ఈ జిల్లాలవారికి హెచ్చరిక! నేడు భారీ-అతిభారీ వర్షాలు, పిడుగులూ పడే ఛాన్స్

Weather Latest Update: ఈ జిల్లాలవారికి హెచ్చరిక! నేడు భారీ-అతిభారీ వర్షాలు, పిడుగులూ పడే ఛాన్స్

AP Jobs: ఏపీ ప్రభుత్వానికి మరో షాక్! ఆ నియామకాలు నిలుపుదల, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు!!

AP Jobs: ఏపీ ప్రభుత్వానికి మరో షాక్! ఆ నియామకాలు నిలుపుదల, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు!!

Botsa Reaction On Harish : పక్కపక్కన పెట్టి చూస్తే తేడా తెలుస్తుంది - హరీష్‌రావుకు బొత్స కౌంటర్ !

Botsa Reaction On Harish : పక్కపక్కన పెట్టి చూస్తే తేడా తెలుస్తుంది - హరీష్‌రావుకు బొత్స కౌంటర్ !