Gopichand: మా అన్నయ్యే నా ముక్కు కోసేశాడు - హీరో గోపీచంద్ కామెంట్స్
గోపీచంద్ ముక్కు మీద ఒక మచ్చ ఉంటుంది. చిన్నప్పుడు తన సొంత అన్నయ్యే బ్లేడుతో తన ముక్కు కోసేశాడని ఆయన చెప్పుకొచ్చారు.
'తొలివలపు' సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు గోపీచంద్. మొదటి సినిమా వర్కవుట్ కాకపోవడంతో విలన్ గా నటించారు. ఆ తరువాత 'యజ్ఞం' సినిమాతో హీరోగా హిట్టు కొట్టి తన కెరీర్ ను నిలబెట్టుకున్నారు. ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ కమర్షియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల 'సీటీమార్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ హీరో ఇప్పుడు 'పక్కా కమర్షియల్'తో అలరించబోతున్నారు. జూలై 1న ఈ సినిమా విడుదల కానుంది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అలీతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు గోపీచంద్. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. గోపీచంద్ ముక్కు మీద ఒక మచ్చ ఉంటుంది. చిన్నప్పుడు తన సొంత అన్నయ్యే బ్లేడుతో తన ముక్కు కోసేశాడని ఆయన చెప్పుకొచ్చారు. గోపీచంద్ కి ప్రేమ్ చంద్ అనే ఒక అన్నయ్య ఉండేవారు. చిన్నతనంలో తన అన్నయ్య 'ముక్కు కోసి పప్పులో పెడతారా? ఎలా పెడతారు..? అసలు తెగుతాదా..? అంటూ సడెన్ గా గోపీచంద్ ముక్కు కోసేశారట.
ఆ సమయంలో తనకు విపరీతంగా రక్తం కారిపోయిందని అప్పటి సంగతులు గుర్తు చేసుకున్నారు. గోపీచంద్ అన్నయ్య ఓ కారు యాక్సిడెంట్ లో మరణించారు. ఆ సంఘటన నుంచి కోలుకోవడానికి గోపీచంద్ ఫ్యామిలీకి చాలా సమయం పట్టింది. ప్రస్తుతం గోపీచంద్ తన సినిమాలతో బిజీ అయ్యారు.
Also Read : శోభితతో నాగచైతన్య డేటింగ్ - సమంత పుట్టించిన పుకారేనా?
Also Read : తక్కువ అంచనా వేయకండి - బాలకృష్ణ హీరోయిన్‌కు కరోనా
View this post on Instagram