News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ

నటి హరితేజ విడాకులు తీసుకుందంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రచారంపై బిగ్ బాస్ బ్యూటీ అదిరిపోయే సమాధానం చెప్పింది.

FOLLOW US: 
Share:

హరితేజ.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అసవరం లేదు. ఓవైపు బుల్లితెరపై, మరోవైపు వెండితెరపై  సత్తా చాటుతోంది. యాంకర్ గానూ అలరిస్తోంది. తెర మీదే కాదు, వెర వెనుక కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. సినిమాల్లో పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. బుల్లితెర షోలలో అదిరిపోయే కామెడీ టైమింగ్ తో అందరినీ నవ్వుల్లో ముంచెత్తుతుంది. కామెడీ అంటే కామెడీ, సీరియస్ అంటే సీరియస్, పాత్ర ఏదైనా ఇట్టే ఒదిగిపోయిన నటిస్తుంది. ‘అఆ’ సహా పలు సినిమాల్లో చక్కటి కామెడీతో అందరినీ ఆకట్టుకుంది. అటు బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొని అదిరిపోయే ఆటతీరుతో ఆకట్టుకుంది. టైటిల్ గెలవకపోయినా, టాప్ 5 కంటెస్టెంట్లలో ప్లేస్ దక్కించుకుంది.  ఈ షోతో మరింత గుర్తింపు తెచ్చుకుంది.

ఆస్ట్రేలియా వెకేషన్ లో బిగ్ బాస్ హరితేజ

తాజాగా ఈ ముద్దుగుమ్మ ఆస్ట్రేలియాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. ఫ్యామిలీ మెంబర్స్ తో కాకుండా ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా గడుపుతోంది. తనకో పాప ఉన్నా, ఆమెను ఫ్యామిలీ దగ్గరే వదిలేసి మరీ హాలీడే ట్రిప్ లో జల్సా చేస్తోంది. గత కొద్ది రోజులుగా కంగారూ దేశంలోనే గడుపుతోంది. చిట్టిపొట్టి డ్రెస్సుల్లో నెటిజన్లను అలరిస్తోంది. ఈ నేపథ్యంలోనే చాలా రోజుల తరువాత అభిమానులతో సోషల్ మీడియాలో చిట్ చాట్ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్న ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

నెటిజన్ ప్రశ్నకు అదిరిపోయే ఆన్సర్

నెటిజన్లతో ఇంటరాక్షన్ అవుతున్న హరితేజకు ఓ అభిమాని ఆసక్తికర ప్రశ్న వేశాడు. మీ భర్త దీపక్‌తో విడాకులు తీసుకున్నారా? అని క్వశ్చన్ చేశాడు. ఈ ప్రశ్నకు హరితేజ షాక్ అయ్యింది. అయితే, కోపం తెచ్చుకోకుండా, నవ్వుతూ చాలా హుందాగా సమాధానం చెప్పింది. నాలుగు రోజులు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా లేకపోతే మనిషిని కూడా చంపేలా ఉన్నారే అని కామెంట్ పెట్టింది. దీనికి తన భర్త దీపక్‌తో ఉ‍న్న ఫోటోను షేర్‌ చేసింది. విడాకుల ప్రశ్నకు  ఫుల్‌స్టాప్‌ పెట్టేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

2015లో దీపక్ తో హరితేజ వివాహం

హరితేజ 2015లో పెళ్లి చేసుకుంది. కన్నడకు చెందిన దీపక్ అనే వ్యక్తితో మూడు ముళ్లు వేయించుకుంది. వీరికి 2021లో కూతురు జన్మించింది. ఆమెకు భూమి అనే పేరు పెట్టారు. బిడ్డ పుట్టాక హరితేజ కొద్దిగా లావు అయ్యింది. ఆ తర్వాత బరువు తగ్గించుకునేందుకు చాలా కష్టపడింది. డైటింగ్ తో పాటు జిమ్ చేస్తూ మళ్లీ స్లిమ్ గా మారింది. తాజాగా ఆస్ట్రేలియా వెకేషన్‌ లో ఆనందంగా గడుపుతోంది.  ఇక తెలుగులో ‘అఆ’, ‘యూ ట‌ర్న్’, ‘అరవింద సమేత వీర రాఘవ’, ‘ప్రతిరోజు పండగే’ లాంటి సినిమాల్లో చక్కటి నటనతో అలరించింది. సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తోంది.

Read Also: 2 రోజుల్లో రిలీజ్ డేట్ చెప్పకపోతే సూసైడ్ చేసుకుంటా, ‘గేమ్ ఛేంజర్‘ టీమ్ కు చెర్రీ ఫ్యాన్ వార్నింగ్

Read Also: యశ్, ‘KGF’అభిమానులకు సూపర్ న్యూస్, ‘KGF3' విడుదల ఎప్పుడో చెప్పేసిన హోంబలే ఫిల్మ్స్!

Published at : 30 Sep 2023 09:58 PM (IST) Tags: Hari Teja Hari Teja Divorce Hari Teja Husband Hari Teja Reaction Hari Teja Vacation

ఇవి కూడా చూడండి

Chitra Shukla Marriage: పెళ్లి పీటలెక్కిన ‘సిల్లీ ఫెలోస్’ బ్యూటీ, పోలీస్ అధికారితో ఏడడుగులు!

Chitra Shukla Marriage: పెళ్లి పీటలెక్కిన ‘సిల్లీ ఫెలోస్’ బ్యూటీ, పోలీస్ అధికారితో ఏడడుగులు!

Bootcut Balaraju Teaser: ఫుల్ ఫన్నీగా ‘బూట్ కట్ బాలరాజు‘ టీజర్, ఊర్లో మీ గాలి బ్యాచ్ బ్రాండ్ వ్యాల్యూ భలే ఉంది గురూ!

Bootcut Balaraju Teaser: ఫుల్ ఫన్నీగా ‘బూట్ కట్ బాలరాజు‘ టీజర్, ఊర్లో మీ గాలి బ్యాచ్ బ్రాండ్ వ్యాల్యూ భలే ఉంది గురూ!

Naga Panchami Serial December 11th Episode - 'నాగ పంచమి' సీరియల్: నన్ను క్షమించండి మోక్షాబాబు, పంచమి వీడ్కోలు - హోమం దగ్గర ఫణేంద్ర తిప్పలు!

Naga Panchami Serial December 11th Episode - 'నాగ పంచమి' సీరియల్: నన్ను క్షమించండి మోక్షాబాబు, పంచమి వీడ్కోలు - హోమం దగ్గర ఫణేంద్ర తిప్పలు!

Intinti Gruhalakshmi December 11th Episode - ఇంటింటి గృహలక్ష్మి సీరియల్: విషమించిన పరంధామయ్య ఆరోగ్యం, నందుని కడిగిపారేసిన తులసి!

Intinti Gruhalakshmi December 11th Episode - ఇంటింటి గృహలక్ష్మి సీరియల్: విషమించిన పరంధామయ్య ఆరోగ్యం, నందుని కడిగిపారేసిన తులసి!

Bigg Boss 17: బిగ్ బాస్‌లోకి కొరియన్ పాప్ సింగర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ

Bigg Boss 17: బిగ్ బాస్‌లోకి కొరియన్ పాప్ సింగర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ

టాప్ స్టోరీస్

TS Rythu Bharosa: తెలంగాణలో రైతు భరోసాపై నేడు ప్రభుత్వం కీలక ప్రకటన

TS Rythu Bharosa: తెలంగాణలో రైతు భరోసాపై నేడు ప్రభుత్వం కీలక ప్రకటన

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

Bhagwant Mann: 'అబద్ధాల మా నాన్న మూడోసారి తండ్రి కాబోతున్నారు' - పంజాబ్ సీఎం భగవంత్ పై కుమార్తె సంచలన వ్యాఖ్యలు

Bhagwant Mann: 'అబద్ధాల మా నాన్న మూడోసారి తండ్రి కాబోతున్నారు' - పంజాబ్ సీఎం భగవంత్ పై కుమార్తె సంచలన వ్యాఖ్యలు

MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్‌ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి- మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!

MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్‌ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి-  మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!