అన్వేషించండి

Hanuman Sequel: 'హనుమాన్' సీక్వెల్ టైటిల్ చెప్పేశారు, రిలీజ్ ఎప్పుడో కూడా!

Jai Hanuman Movie: తేజ సజ్జ 'హనుమాన్'కు సీక్వెల్ అనౌన్స్ చేశారు. సినిమా ఎండ్ అయ్యాక... సీక్వెల్ టైటిల్ వెల్లడించిన ప్రశాంత్ వర్మ, విడుదల గురించి అప్డేట్ ఇచ్చారు.

Teja Sajja Hanuman sequel and release update: 'హిట్టు వర్మ... హిట్టు సినిమా తీశావ్. వర్త్ సినిమా' అని దర్శకుడు ప్రశాంత్ వర్మను ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. తేజ సజ్జ హీరోగా ఆయన దర్శకత్వం వహించిన 'హనుమాన్' సినిమాకు ఇటు విమర్శలు, అటు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. పెయిడ్ ప్రీమియర్ షోస్ నుంచి సూపర్ డూపర్ హిట్ టాక్ వచ్చింది. 

'హనుమాన్' సినిమా ప్రారంభంలో 'ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్' (PVCU) అని టైటిల్ కార్డు వేశారు. సినిమా విడుదలకు ముందు ఆ విషయం చెప్పారు. ఈ యూనివర్స్ / ఫ్రాంచైజీలో చాలా మంది సూపర్ హీరోలు ఉంటారని, వరుస సినిమాలు తీస్తానని చెప్పారు. 'హనుమాన్' ఎండింగ్‌లో సీక్వెల్ అనౌన్స్ చేశారు.

2025లో జై హనుమాన్!
Hanuman sequel titled Jai Hanuman: 'హనుమాన్' సీక్వెల్‌కు 'జై హనుమాన్' టైటిల్ ఖరారు చేశారు. వచ్చే ఏడాది... 2025లో సినిమాను విడుదల చేస్తామని కూడా పేర్కొన్నారు. 'హనుమాన్'లో ఓ సామాన్య యువకుడు సూపర్ హీరో ఎలా అయ్యాడు? అనేది కథ. 'జై హనుమాన్' సినిమాలో హనుమంతుడు వచ్చి ఏం చేశారనేది కథ అని ఎండింగ్ చూస్తే అర్థం అవుతోంది.

Also Readహనుమాన్ రివ్యూ: తేజ సజ్జ & ప్రశాంత్ వర్మ సినిమా గుంటూరు కారం కంటే బావుందా? అసలు ఎలా ఉంది?

తేజ సజ్జ హీరోగా నటించిన 'హనుమాన్'లో అమృతా అయ్యర్ హీరోయిన్. వీళ్లిద్దరూ జంటగా నటించిన తొలి చిత్రమిది. ఇందులో తేజ సజ్జ సోదరిగా వరలక్ష్మీ శరత్ కుమార్ నటించారు. వినయ్ రాయ్ విలన్ రోల్ చేయగా... ఇతర కీలక పాత్రల్లో రాజ్ దీపక్ శెట్టి, గెటప్ శ్రీను, సత్య, జబర్దస్త్ రోహిణి, రాకేష్ మాస్టర్ కనిపించారు. దర్శక నటుడు సముద్రఖని విభీషణుడి పాత్ర పోషించారు. సినిమాలో కామెడీకి చాలా బావుందని మంచి పేరు వచ్చింది. అసలు కథ ఏమిటి? అనే విషయానికి వస్తే... 

Also Readగుంటూరు కారం రివ్యూ : మహేష్ ఎనర్జీ, ఆ మాస్ సూపర్, మరి సినిమా?

హనుమంతు (తేజ సజ్జ)ది అంజనాద్రి గ్రామం. అతను ఓ దొంగ. చిన్నప్పటి నుంచి మీనాక్షి (అమృతా అయ్యర్) అంటే ప్రేమ. ఆమె డాక్టర్. వేసవి సెలవులకు తాతయ్య ఊరు అంజనాద్రి వస్తుంటుంది. అక్కడి ప్రజలకు వైద్యం చేస్తుంటుంది. ఊరి ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడం తప్ప పాలెగాడు (రాజ్ దీపక్ శెట్టి) అభివృద్ధిని పట్టించుకోడు. అతడిని ఎదిరించడంతో మీనాక్షికి ప్రమాదం ఎదురు అవుతుంది. దాన్నుంచి ఆమెను కాపాడే క్రమంలో హనుమంతుకు గాయాలు అవుతాయి. తెల్లారే సరికి గాయాలు మాయం అవుతాయి. సూపర్ పవర్స్ వస్తాయి. 

హనుమంతుకు సూపర్ పవర్స్ ఎలా వచ్చాయి? అతని గురించి తెలిసి ఆ ఊరు వచ్చిన మైఖేల్ (వినయ్ రాయ్), సిరి అలియాస్ సిరివెన్నెల (వెన్నెల కిశోర్) ఎవరు? ఊరిలో ఆస్పత్రి కడతామని నమ్మించిన మైఖేల్ ఏం చేశాడు? అంజమ్మ (వరలక్ష్మీ శరత్ కుమార్), హనుమంతు... అక్కా తమ్ముడి అనుబంధం ఏమిటి? హనుమతుకు విభీషణుడు (సముద్రఖని) ఎటువంటి సాయం చేశాడు? రుధిర మణి కథేంటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Maoist Ganesh : ఒడిశాలో ఎన్‌కౌంటర్‌- సెంట్రల్ కమిటీ సభ్యుడుగణేష్ సహా మహిళా మావోయిస్టుల మృతి
ఒడిశాలో ఎన్‌కౌంటర్‌- సెంట్రల్ కమిటీ సభ్యుడుగణేష్ సహా మహిళా మావోయిస్టుల మృతి
Bandi Sanjay : చంద్రబాబు నుంచి కేసీఆర్‌కు ముడుపులు- సానుభూతి కోసం రేవంత్ రెడ్డి బూతులు; బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
చంద్రబాబు నుంచి కేసీఆర్‌కు ముడుపులు- సానుభూతి కోసం రేవంత్ రెడ్డి బూతులు; బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
BCCI Video: రోహిత్, కోహ్లీ సెంచరీల వీడియో షేర్ చేసి అభాసుపాలైన బీసీసీఐ! సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగతాళి
రోహిత్, కోహ్లీ సెంచరీల వీడియో షేర్ చేసి అభాసుపాలైన బీసీసీఐ! సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగతాళి
Microsoft: C, C++కు చరమగీతం పాడుతున్న మైక్రోసాఫ్ట్ - రస్ట్ పేరుతో కొత్త లాంగ్వేజ్ - కొత్తది నేర్చుకోక తప్పదా?
C, C++కు చరమగీతం పాడుతున్న మైక్రోసాఫ్ట్ - రస్ట్ పేరుతో కొత్త లాంగ్వేజ్ - కొత్తది నేర్చుకోక తప్పదా?

వీడియోలు

Rohit Sharma Century Mumbai vs Sikkim | Vijay Hazare Trophy 2025 తొలి మ్యాచ్ లో ముంబై ఘన విజయం | ABP Desam
Vijay Hazare trophy 2025 | విజయ్ హజారే ట్రోఫీలో తొలిరోజే రికార్డుల మోత మోగించిన బిహార్ బ్యాటర్లు
ప్రపంచ రికార్డ్ సృష్టించిన షెఫాలీ వర్మ
టీమిండియా సూపర్ విక్టరీ.. ఐసీసీ ర్యాంకులో దూసుకెళ్లిన దీప్తి
15 ఏళ్ల తర్వాత రోహిత్, కోహ్లీ.. ఫస్ట్ టైం స్టార్లతో నిండిన విజయ్ హజాారే ట్రోఫీ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoist Ganesh : ఒడిశాలో ఎన్‌కౌంటర్‌- సెంట్రల్ కమిటీ సభ్యుడుగణేష్ సహా మహిళా మావోయిస్టుల మృతి
ఒడిశాలో ఎన్‌కౌంటర్‌- సెంట్రల్ కమిటీ సభ్యుడుగణేష్ సహా మహిళా మావోయిస్టుల మృతి
Bandi Sanjay : చంద్రబాబు నుంచి కేసీఆర్‌కు ముడుపులు- సానుభూతి కోసం రేవంత్ రెడ్డి బూతులు; బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
చంద్రబాబు నుంచి కేసీఆర్‌కు ముడుపులు- సానుభూతి కోసం రేవంత్ రెడ్డి బూతులు; బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
BCCI Video: రోహిత్, కోహ్లీ సెంచరీల వీడియో షేర్ చేసి అభాసుపాలైన బీసీసీఐ! సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగతాళి
రోహిత్, కోహ్లీ సెంచరీల వీడియో షేర్ చేసి అభాసుపాలైన బీసీసీఐ! సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగతాళి
Microsoft: C, C++కు చరమగీతం పాడుతున్న మైక్రోసాఫ్ట్ - రస్ట్ పేరుతో కొత్త లాంగ్వేజ్ - కొత్తది నేర్చుకోక తప్పదా?
C, C++కు చరమగీతం పాడుతున్న మైక్రోసాఫ్ట్ - రస్ట్ పేరుతో కొత్త లాంగ్వేజ్ - కొత్తది నేర్చుకోక తప్పదా?
Viraansh Bhanushali: ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
Tarique Rahman: బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
Govt New Rules: జనవరి 2026 నుంచి మారే నియమాలు ఇవే! తెలుసుకోకుంటే భారీగా నష్టపోతారు!
జనవరి 2026 నుంచి మారే నియమాలు ఇవే! తెలుసుకోకుంటే భారీగా నష్టపోతారు!
Prime Ministerial candidate Priyanka: ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రియాంకకు పెరుగుతున్న మద్దతు - కాంగ్రెస్‌‌లో అంతర్గత సంక్షోభం ఏర్పడనుందా ?
ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రియాంకకు పెరుగుతున్న మద్దతు - కాంగ్రెస్‌‌లో అంతర్గత సంక్షోభం ఏర్పడనుందా ?
Embed widget